హిందూపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
పట్టణంలో గతంలో 236 బోర్లు ఉండేవి. వాటి సంఖ్య 2016 నాటికి 120కి చేరింది. 2016 మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే 30కి పైగా బోర్లు ఎండిపోయాయి. వందకు పైగా బోర్లలో నీటిమట్టం తగ్గింది. కేవలం 30 బోర్లలో మాత్రమే పూర్తి స్థాయిలో నీరు వస్తోంది. పీఏబీఆర్‌ నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో కేవలం ట్యాంకర్ల ద్వారా మాత్రమే పట్టణ ప్రజలకు సరఫరా చేయాల్సి వస్తోంది. మున్సిపాలిటీ తరపున 75 ట్యాంకర్ల ద్వారా రోజుకు దాదాపు 400 ట్రిప్పుల నీటిని అందిస్తున్నారు. ఇలా నీటి కోసం రోజుకు రూ.లక్ష దాక ఖర్చు పెడుతున్నారు<ref name="కన్నీటి.. ‘పురం’! ">{{cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-top1|title=కన్నీటి.. ‘పురం’! ీ|publisher=[[ఈనాడు]]|date= 2016-5-27|accessdate=2016-5-27}}</ref>.
===వ్యవసాయంపై ప్రభావం===
హిందూపురం పట్టణంలో నెలకొన్న నీటి సమస్య కారణంగా ఈ ప్రాంతంలో [[వ్యవసాయం]] పక్కన పెట్టేశారు. వ్యవసాయ బోర్ల నుంచి పట్టణానికి నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు 100 బోర్ల నుంచి పట్టణానికి నీటిని ప్రైవేటు ట్యాంకర్లతో తీసుకొస్తున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని పల్లెల నుంచి నీటిని తీసుకురావాల్సిన వస్తోంది. లేపాక్షి మండలం చోళసముద్రం, పరిగి మండలం కొడిగినహళ్లి, శాసనకోట, హిందూపురం గ్రామీణ మండలం పూలకుంట, బీరేపల్లి, కొటిపి, మణేసముద్రం, కిరికెర తదితర పంచాయతీల్లోని గ్రామాల నుంచి పట్టణానికి నీటిని తీసుకువస్తున్నారు. ఫలితంగా [[సడ్లపల్లి]], [[కొట్నూరు]], [[శ్రీకంఠపురం]], [[ముద్దిరెడ్డిపల్లి]], [[సుగూరు]] తదితర గ్రామాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని పక్కన పెట్టి, పట్టణానికి నీటిని అందిస్తున్నారు<ref name="కన్నీటి.. ‘పురం’! ">{{cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-top1|title=కన్నీటి.. ‘పురం’! ీ|publisher=[[ఈనాడు]]|date= 2016-5-27|accessdate=2016-5-27}}</ref>.
 
===భూగర్భ జలాలు===
హిందూపురం ప్రాంతంలో కొత్తగా బోర్లు వేసినా ప్రయోజనం లేదని అధికారులు తేల్చేశారు. 1000 అడుగుల లోతు తవ్వినా నీరు పడని పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపాల్టీ తరపున 2015లో దాదాపు రూ.50 లక్షలు వెచ్చించి 40 బోర్లు తవ్వించగా మొదట్లో కొంత నీరు వచ్చినా, 2016 నాటికి అన్ని ఎండిపోయాయి. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో మణేసముద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫీజో మీటర్‌లోనే భూగర్భ జలమట్టం 38 మీటర్లు కనిపిస్తోంది. భూగర్భ జలమట్టం జిల్లాలో 19 మీటర్లు ఉండగా హిందూపురంలో 38 మీటర్లకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో లాతూరులా మారనుంది<ref name="కన్నీటి.. ‘పురం’! ">{{cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Anantapur&info=atp-top1|title=కన్నీటి.. ‘పురం’! ీ|publisher=[[ఈనాడు]]|date= 2016-5-27|accessdate=2016-5-27}}</ref>.
"https://te.wikipedia.org/wiki/హిందూపురం" నుండి వెలికితీశారు