బొబ్బిలి యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్‌లో సామ్రాజ్యవాదుల యుద్ధాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 15:
 
=== బుస్సీ వద్ద రాజకీయం ===
[[హైదరాబాదు]] నిజాం [[సలాబత్ జంగ్]] బుస్సీని ఉద్యోగం నుండి తొలగించిన వార్త తెలిసిన తరువాత [[విజయనగరం]] రాజులు తప్ప ఉత్తర కోస్తా జమీందారు లందరూ ఫ్రెంచి వారికి శిస్తులు చెల్లించడం మానివేశారు. [[బుస్సీ]] నిజాముతో[[నిజాము]]తో రాజీ కుదుర్చుకుని, సర్కారు జిల్లాల పర్యటనకు వచ్చాడు. 1757 లో బుస్సీ నిజాము సంస్థానం నుండి బయల్దేరి మచిలీపట్నం మీదుగా [[రాజమండ్రి]] చేరుకుని, కోటిపల్లి వద్ద మకాం వేసాడు. పాలెగాళ్ళను, జమీందార్లను, సంస్థానాధీశులను వచ్చి తనను కలవమని కబురు పంపాడు. [[బొబ్బిలి]] పాలకుడు రంగారావు తప్ప, విజయరామరాజుతో సహా అందరూ వచ్చి కలిసారు. విజయరామరాజు దీన్ని అవకాశంగా తీసుకుని రంగారావుపై బుస్సీకి అతడి దివాను హైదర్ జంగుకూ చాడీలు చెప్పాడు. మీరంటే వారికి లెక్కలేదని అందుచేతే మీ వద్దకు వచ్చి కలవలేదనీ అతడికి నూరిపోసాడు. తనకు అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తున్నారని, వారిని బొబ్బిలి నుండి వెళ్ళగొట్టి, దాన్ని తనకు స్వాధీనం చేస్తే శిస్తు సక్రమంగా చెల్లిస్తాననీ అతడు బుస్సీకి చెప్పాడు. దాంతో బుస్సీ, రంగారావును బొబ్బిలి వదలి, అంతకంటే పెద్దదైన వేరే స్థలానికి పోయి రాజ్యాన్ని స్థాపించుకోవాలని ప్రతిపాదించాడు. రంగారావు దాన్ని అవమానంగా భావించాడు.
 
విజయరామరాజు తాను బుస్సీకి కట్టాల్సిన కప్పం పది లక్షలూ కట్టేసాడు, అంతేకాక, మూడు లక్షల లంచం హైదర్ జంగుకు ఇచ్చి, బుస్సీకి బొబ్బిలిపై మనసు విరిచేందుకు సహకరించమని చెప్పాడు. హైదర్ జంగు అందుకంగీకరించాడు.
 
=== ఫ్రెంచి సిపాయీల వధ ===
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_యుద్ధం" నుండి వెలికితీశారు