సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ప్రధమ → ప్రథమ, చినారు → చారు (5) using AWB
పంక్తి 28:
రాజకీయముగా భారతదేశము పాశ్చాత్యుల అధీనమయిన కాలములో, పాశ్చాత్యులు భారతీయభాషయే తమ భాషకు తల్లియని అంగీకరించుచో, అది విపరీతముగ నుండెడి మాట వాస్తవమే. అట్లొప్పుకొనుట పాలకజాతివారి గర్వమునకు భంగకరమును, పాలితజాతివారి ఆత్మగౌరవమునకు ఉద్దీపకమును అగును. అయినను ఉదారులగు పాశ్చ్యాత్యులు కొందరు సత్యమును బాహాటముగా చాటిరి. విమర్శకులలో ఉన్నతశ్రేణికి చెందిన కర్జన్ పండితుడు వ్రాసిన మాటల నిట ఉల్లేఖించుచున్నాను.
 
“గ్రీకు, లాటిను, గొతిక్ మొదలైన భాషలన్నియు భిన్న, భిన్న కాలములయందు సంస్కృతభాషనుండియే, ముఖ్యముగా వైదిక సంస్కృతమునుండియే, ఉద్భవించినవి.” (Journal of Royal Asiatic Society of Britain and Ireland అను ప్రసిద్ధ పత్రికలో ః 16 వ సంపుటము ప్రధమప్రథమ భాగములో 177 వ పుట).
 
నిష్పక్షపాతబుద్ధితో ఈరీతిగా సంస్కృతభాషకు యూరపీయభాషామాతృత్వము నంగీకరించినవారు కొందరు కలరు. 1834 వ సంవత్సరములో R.A.S. పత్రికలోనే ద్వితీయసంపుటములో Sanskrit Literature అను శీర్షిక క్రింద W.C. టెయిలర్ వ్రాసిన యీక్రిందిమాటలుకూడ గమనింపదగియున్నవి. “ప్రాచీనయూరోపీయభాషల కన్నింటికిని తల్లి హిందూదేశపుభాషయే. దేశములో ఎన్నిమార్పులు వచ్చినను ఆ భాషను హిందూదేశము నిలబెట్టుకొనగల్గినదని మనము ఆశ్చర్యముతో కనుగొంటిమి.”
పంక్తి 38:
ఇండోయూరపీయ కుటుంబమునకు చెందిన యేభాషలోనైనను కూలంకషమైన పాండిత్యము గల్గుటకు సంస్కృతభాషాజ్ఞానము అత్యంతావశ్యకము. ఇం.యూ. కుటుంబమునకు చెందక, ప్రత్యేకము ద్రావిడభాషా కుటుంబమునకు చెందినవని కొందరిచే భావింపబడుచున్న ఆంధ్రము, కర్ణాటకము మున్నగు భాషలను నేర్చుకొనుటకుకూడ సంస్కృత జ్ఞాన మవసరమే. ఈనడుమ గొందరు పండితులు ఆంధ్రము, సంస్కృత ప్రాకృతజన్యమని రుజువుచేసియుండుటచే, సంస్కృతభాషాప్రాముఖ్యత మరింత హెచ్చినది. ప్రపంచములోని ఏభాషనునేర్చుకొనుటకైనను సంస్కృతము కీలకమని మాక్సుముల్లరు అభిప్రాయపడినాడు. ఆధునికశాస్త్రముల కన్నింటికిని గణితశాస్త్ర మెట్టిదో, ప్రపంచభాషలకన్నింటికిని సంస్కృతమట్టిదని యాయన నుడివినాడు. “What Mathematics is to the Sciences, the same is Sanskrit to the languages of the world”.
 
సంస్కృతమునేర్చిన పాశ్చాత్య పండితులేకాక, ఇతర పాశ్చాత్య విద్వాంసులుకూడ నీ యభిప్రాయమునంగీకరించినారుయభిప్రాయమునంగీకరించారు. జాన్ రస్కిన్ కూడ ఇంగ్లీషుభాషలో పాండిత్యము గలుగవలెనన్నచో మాక్సుముల్లరు రచించిన Biography of words అను గ్రంథమును చదువవలెనని చెప్పినాడు. ఆ గ్రంథములో ప్రధానముగా యూరపీయ భాషాపదముల సంస్కృతభాషా వ్యుత్పత్తి ప్రదర్శింపబడినది. దానిని చదువుటవలన ఇంగ్లీషుపదముల శక్తి, వినియోగ విధానము బాగుగా బోధపడునని రస్కిన్ అభీప్రాయము.(చూ: Sesame and Lilies.)
 
====విజ్ఞానభాండారము====
పంక్తి 50:
ప్రపంచములో మొదటికావ్యమగు రామాయణము సంస్కృతభాషలో నుద్భవించినది, ప్రపంచములోని మొదటి జ్యౌతిషగ్రంథము, మొదటి నాట్యశాస్త్ర గ్రంథము, మొదటి వ్యాకరణ గ్రంథము సంస్కృతభాషలోనే యుద్భవించినవి. కావున ప్రపంచవిజ్ఞానచరిత్రలో సంస్కృతభాషకు విశిష్టమైనస్థానము కలదు.
 
సంస్కృతభాషలోని వాఙ్మయముతో పరిచయమును పొందిన పాశ్చాత్యపండితులెల్లరు, దాని మహత్త్వమును వేనోళ్ల కొనియాడిరి. మహామేధావి, విమర్శకశిరోమణియైన గెటీయను జర్మనుపండితుడు శాకుంతలనాటకమును జర్మనుభాషలో చదివి ముగ్ధుడైనాడు. స్వర్గమర్త్యలోకముల సారసర్వస్వమే శకుంతలయని యాతడు వర్ణించినాడువర్ణించాడు. మానవ హృదయమునకు ఉపనిషత్తు లీయగల శాంతిని మరియేవాఙ్మయము కూర్పజాలదని యెల్లరు నంగీకరించిరి.
విశ్వవిఖ్యాతిగల షోపెన్ హోవర్ అను జర్మనువిద్వాంసుడు "ఉపనిషత్పఠన మంత లాభదాయకమైనది, ఔన్నత్యాపాదకమైనది మరొకటిలేదు. అది జీవితకాలమంతయు నాకు ఆశ్వాసజనకముగా నున్నది. మరణ సమయమునకూడ అదియే నాకు ఆశ్వాసహేతువు కాగలదు” అని నుడివినాడు.
 
పంక్తి 59:
భాషను నిబంధించు వ్యాకరణశాస్త్రము ఒక శాస్త్రముగా పరిగణింపబడు ఉన్నతస్ధితికి వచ్చుట భారతదేశములో మాత్రమే జరిగినది. సంస్కృతవ్యాకరణమునుగూర్చి యీరీతి వర్ణనను "Most Scientific Grammar” అని అనేక పాశ్చాత్యపండితులు గావించియున్నారు. బుద్ధికి శిక్షణము నొసగు విషయములలో గణితశాస్త్రమొకటి. గణితశాస్త్రమునుగాని, సంస్కృతవ్యాకరణమునుగాని చదువుచో మానవబుద్ధి సరియైన మార్గములో ఆలోచించుటయను అలవాటులో పడునని నిష్పక్షపాతబుద్ధి గల పాశ్చాత్యులే నుడివియున్నారు.
 
బహుభాషానిబద్ధ సాహిత్యకృషి చేసినవారు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణముతో సమానమైన గ్రంథము లేదనిరి. ఆంగ్లములో గ్రంథకర్తగా ప్రసిద్ధిచెందిన భూతపూర్వ బీహార్ రాజ్యపాల శ్రీ ఆర్. ఆర్. దివాకర్ ఇట్లు వాక్రుచ్చినారువాక్రుచ్చారు. “కొందరు నాతో ఏకీభవించినను, ఏకీభవింపకపోయినను నామట్టునకు నాకు ప్రపంచసాహిత్యములో వాల్మీకి రామాయణము ఉత్తమోత్తమ గ్రంథమనిపించుచున్నది.” (ఆంధ్రపత్రిక 21-7-57 ) . ఇట్టి బహువిషయములలో అగ్రస్థానము మరి యేభాషకును లభించుట లేదు.
 
====జాతిని తీర్చిదిద్దినది====
 
ప్రపంచములో ఏభాషయు సాధింపజాలని యొక విశేషమును సంస్కృతము సాధించినదని శ్రీ వివేకానంద స్వామి నుడివియున్నారు. ఏభాషలోనైనను కావ్యము రసవంతమై రమ్యముగానున్నచో అందు ధర్మబోధ తక్కువగా నుండును. ధర్మబోధ యెక్కువగానున్నచో రమ్యత తక్కువగానుండును. రమ్యతయు, ధర్మ్యతయు కలియుట మేలనియు, కాని అట్టి కలయిక కన్పట్టుటలేదనియు అరిస్టాటిల్ మున్నగు ప్రాచీనవిమర్శకులు పరితపించినారుపరితపించారు. పాశ్చాత్య నాటకకర్తలలో మేటియైన షేక్స్పియరులోకూడ ధర్మబోధ ప్రయత్నము తక్కువయనియు, షేక్స్పియరు లోకమునకు సందేశమునిచ్చు దృష్టితో నాటకములను వ్రాయనేలేదనియు విమర్శకులు చెప్పుచున్నారు. రమ్యతను, ధర్మ్యతను అత్యున్నత పథములో సమముగా సాధించిన గ్రంథము వాల్మీకి రామాయణము మాత్రమే. ఈ యంశమును స్వామి వివేకానందుడు అమెరికనులకు తెలుపుచు ఇట్లు పలికెను.
 
“Nowhere else are the aesthetic and the didactic so harmoniously blended as in the Ramayana”.
 
ఈ విషయములో రామాయణమునే వరవడిగా నుంచుకొని సంస్కృతకావ్య నాటకాదులు బయలుదేరినవనుట స్పష్టము. ఆలంకారికులుకూడ ఈలక్ష్యమునే ఆదేశించినారుఆదేశించారు. ప్రతాపరుద్ర యశోభూషణములో విద్యానాథడు రచించిన "యద్వేదాత్ప్రభుసమ్మితాదధిగతం” ఇత్యాది శ్లోకసందర్భమును పరికింపదగును.
 
పాఠకుని హృదయము ఆనందసముద్రములో ఓలలాడుటతో బాటు, ధర్మసౌధశిఖరమును సోపానక్రమముచే అధిరోహించుట రామాయణ పఠనసమయములోనేకాక కాళిదాసాది ఇతర సంస్కృతకవుల గ్రంథములను పఠించు సమయములో కూడ అనుభవగోచరము.
పంక్తి 153:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
2. మూలం: "భారతీయవైభవము" , జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanscrit, S.R.R. & C.V.R College, Vijayawada) గారి చే 1957 లో ముద్రింపబడినది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు