త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →త్రినాథ వ్రత కథ: AWB తో RETF మార్పులు, typos fixed: , → , (13), చేసినారు → చేసారు (3) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →త్రినాథ వ్రత కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు (20) using AWB |
||
పంక్తి 201:
భక్తులారా ! మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతము వలె నుండును. శ్రీపురము అను గ్రామము నందు మధుసూదనుడను నొక బ్రాహ్మణుడుండెడివాడు. మిక్కిలి దరిద్రుదగుటచే బిక్ష మెత్తుకుని జీవించే వాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించు చున్నది. ఆ బాలుడు చిక్క పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను. "అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి " అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పు చున్నాడంటే 'ఓసీ' నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో, వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది . అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు. అని బ్రాహ్మణుడు చెప్పెను. బార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు చుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి, తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి, ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, పెనిమిటిని చూచి అయ్యా ! ఈ సొమ్మును తీసుకు వెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకు రండని చెప్పినది.
అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను. ఇట్లు తిరుగుచూ, పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండి యున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది. తన ఆవులలో 'భోదా' అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్ట బుద్ధి గలది. బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో యేమను చున్నాడంటే "ఇక దీని ముఖము చూడకూడదు. అవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను" అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. "షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను ఆవూ దూడా రెండిటిని నాకు ఇప్పించండి" అని అనగానే "ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా" అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు "మీరు షావుకార్లు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు" అని అన్నాడు . ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని, తన మదిలో విచారించి తెలియక అనివేసినాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా ! అని బ్రాహ్మణుని చూచి చెయ్యి
; మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట :
పంక్తి 209:
; త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట :
ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని, నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , "ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు. అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు "దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు "ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను" అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి
; త్రినాధుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట :
శలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే "ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని "స్వామీ ! ఏయే వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . 'ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే తృప్తి పొందుదుము. ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి, అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును." అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంబించి, గంజాయి ముందు తయారు
; త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట :
త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను" అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ
; రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట :
పంక్తి 224:
; త్రినాధుల దయతో యువరాజు బ్రతుకుట :
త్రినాదులకు దయ కలిగినది "రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును." అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు
; వర్తకుడు త్రినాధుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట :
అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నది తీరమున
; మేళా చేయక పోవుటచే ఓడ మునుగుట :
తన నౌకర్లందరూ ఓడ లోని ధనము మోసుకొని పోయినారు.ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువులవారి మేళాలు మరిచెను . అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది . నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగి పోయిరి .అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంత సేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చు చుండగా ఆకాశములో నుండి త్రినాధులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు. అందుచేతనే ఓడ మునిగినది . నీవు ఐదు మేళాలు సమర్పించి నట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును. అని
; గ్రుడ్డివానికి చూపు - కుంటివానికి కాళ్ళు వచ్చుట :
ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీపేరేమిటి ? మీరెక్కడకు వెళ్ళు చున్నారు ? అనెను వారు మేళా చూచుట కనిరి .అది విని గ్రుడ్డి వారు నాకు కండ్లు కానరావు .మీరందరూ నేత్రములతో చూస్తారు .నేను దేనితో చూస్తాను. అని అనగా గ్రుద్దివాడా ! త్రినాధ స్వామీ వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును. ప్రభువుల వారి మహిమ చూడ వచ్చును. అని చెప్పి,వారంతా మేళా వద్దకు
; త్రినాధులు వైష్ణవ భక్తుని రక్షించుట - మూర్ఖపు గురువును శిక్షించుట :
పంక్తి 239:
; గురువు పశ్చాత్తాప పడి మేళా చేయగా త్రినాధులు కరుణించుట :
వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండ బెట్టి,ముఖముపై నీళ్ళు చల్లి" అయ్యా ! తమరు త్రినాధ స్వామివారికి అపరాదులు, త్రినాధ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము .మీరు నిష్టతో స్వామీ వారి మేళాను చేసిన యెడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు." అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా,వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాధ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది ."నేను మూర్ఖుడను ,అధముడను ప్రభువులవారి మహిమ తెలిసికొనలేకపోతిని " అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్దములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా
==ఫలశ్రుతి==
ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము, గ్రుడ్డి తనము కలుగుతుంది. ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను. చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి" అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కథను సీతా దాసు చెప్పి యున్నారు.
|