షోడశి - రామాయణ రహస్యములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
'''షోడశి - రామాయణ రహస్యములు''', [[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచించిన ఒక ఆధ్యాత్మిక సాహితీ విశ్లేషణాత్మక రచన. వ్యాస సంకలనం. సరళమైన గ్రాంధిక భాషలో వ్రాయబడిన ఈ రచన రామాయణ మహాభారతాల గురించి కొన్ని విశేషాల సంగ్రహం. ఇవి ముందుగా 1965లో [[ఆంధ్రప్రభ]] దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురింపబడ్డాయి. జ్యోత్స్న ప్రచురణల ద్వారా 1967లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరల 1980లోను, 2000 లోను పునర్ముద్రింపబడ్డాయి. ఈ పుస్తకంలో రెండు ప్రధాన విషయాలు - (1) [[సుందరకాండ]], దాని పేరు, అందులో కుండలినీయోగ రహస్యము (2) [[మహాభారతం]] తరువాత [[రామాయణం]] వ్రాయబడిందన్న కొందరు విమర్శకులకు నిశితమైన విశ్లేషణాత్మకమైన జవాబు. వీటితోబాటు మరి కొన్ని వ్యాసాలున్నాయి.
 
ఎన్. రమేశన్ అనే ఐ.ఎ.ఎస్. అధికారి ముందుమాట ఉంది. అందులో రచయిత పరిశోధనాత్మక విశ్లేషణను, పాండిత్యాన్ని ప్రశంసించడమైంది. తరువాత శ్రీమాన్ గుండేరావు హర్కరె అనే సంస్కృత పండితుని ముందుమాట సంస్కతంలో వ్రాయబడింది. [[కవిసామ్రాట్]] [[విశ్వనాథ సత్యనారాయణ]] పరిచయ పీఠిక ఉంది. అందులో రచయిత శర్మ పాండిత్యం ఎంత లోతైనదో, శ్రీవిద్యపై రచయితకు ఎంత చక్కని అవగాహన ఉన్నదో, ఈ రచనకై రచయిత రామాయణ మహాభారతాలను ఎన్నిసార్లు చదివి ఉండాలో ఊహిస్తూ విశ్వనాధ సత్యనారాయణ రచయితను కొనియాడాడు.
 
తరువాత రచయిత "ముందొకమాట" అనే ఉపోద్ఘాతాన్ని వ్రాశాడు. అందులో సాహిత్యానికి (1) కవి (2) రసము అనే అంశాలు అత్యంత ప్రధానమైనవి అని రచయిత వివరించాడు. "వేదమునకేది పరమార్ధమో, శాస్త్రములకేది పరమార్ధమో, అదియే కావ్యమునకు పరమార్ధము. కనుకనే కవి, రసము అను తాత్విక పరిభాష సాహిత్యమున ప్రవేశించినది. ఈ దేశమునకు ఆనందము పరమార్ధము. ఇది ఆనంద భూమి" అని చెప్పాడు. అట్టి పరమార్ధముపై నిర్మింపబడిన ఈ దేశపు సంస్కృతి ఔన్నత్యాన్ని విస్మరించి పరసంస్కృతికై ప్రాకులాడడం సిద్ధాన్నాన్ని వదలుకొని భిక్షాటనం చేయడం వంటిదని చింతించాడు.