దామెర (ఎల్కతుర్తి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
}}
==[[మత సామరస్యం]] ==
ఎల్క తుర్తి మండలం దామెరలో ఫకీర్‌షావలీ జా తర ప్రతి యేటా ఉగాది పండుగ రోజు ఘ నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని గుట్టపై వెలసిన ఫకీర్‌షావలీని స్మరిస్తూ ప్రతి [[ఉగాది]] రోజున [[హిందూ]], [[ముస్లింలు]] కలిసి [[ఉరుసు]] ([[జాతర]] ) ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు నూట యాబై ఏళ్ల క్రితం నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో, ప్రస్తుత వరంగల్ జిల్లా ఆత్మ కూరు వద్ద ఆర్మీసైనిక క్యాంపుపటాలాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సయ్యద్ హజ్రత్ ఫకిర్ షావ లీ అనే యూనాని వైద్యుడు ఉండేవారు. ఆయన ఎక్కడ పని చేసినా సమీప ప్రాంతాలను సందర్శించి, పేద రోగులకు చికిత్స చేయడం అలవాటు. ఈ క్రమంలో ఓసారి దామెరకు వచ్చాడు. అప్పటికి దామెరతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో గత్తర (కలరా), ప్లేగు లాంటి వ్యాధులు వ్యాపించడం వల్ల నిత్యం పదుల సంఖ్యలో జనాలు మరణిస్తుండేవారు.
ఈ పరిస్థితి చూసి చలించిన ఆయన ప్రజల ఆరోగ్యవంతులయ్యే వరకు దామెర పరిసర ప్రాంతాలలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఫకీర్ తన సొమ్మును సైతం పేద ప్రజల కోసం వెచ్చించాడు. ఈ చర్యలతో ఫకీర్ ప్రజల గుండెల్లో దైవమై నిలిచాడు. వయసు మీద పడడంతో ఫకీర్ అతివృద్ద్యాప్య దశకు చేరుకున్నాడు. ఫకీర్ గ్రామ పెద్దలను పిలిచి తాను [[ఉగాది]] పర్వదినాన మరణిస్తానని నా శవాన్ని మంచంపై వేసుకుని ఇస్లాం మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తేచాలని చెప్పారు. దీంతో ముస్లిం సంప్రదాయం తెలియని గ్రామస్తులు ఇతర ప్రాంతం నుంచి లాల్‌మహ్మద్ అనే ముజావర్ (ఇస్లాం సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి)ను తీసుకొచ్చారు. (ప్రస్తుతం గ్రామంలో ఉన్న ముస్లింలంతా ముజావర్ సంబంధీకులే కావడం విశేషం) ఫకీర్ మరణం తర్వాత మంచంపై మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్లేసరికి మంచంలోని శవం అదృశ్యమైందని, అదే రోజు రాత్రి కొందరికి ఫకీర్ కలలో తాను ఎక్కడికి పోలేదని గ్రామ సమీపంలోని రాతి గుట్టపైనే ఉన్నానని చెప్పాడట.మర్నాడు గ్రామస్తులంతా గుట్టపైకి వెళ్లీ చూసేసరికి ఫకీర్ సమాధి సాక్షాత్కరించిందట.అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతియేటా ఉగాది పండుగ రోజు ఫకీర్‌షావలీ జాతర నిర్వహిస్తు న్నారు. ఫకీరషావలీని దర్శించుకుంటే దీర్ఘ కాలిక రోగాలు నయమవడంతో పాటు, సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. క ష్టమైనప్పటికి వయోభేదం లేకుండా గుట్టపైకెక్కి ఫకీర్‌షావలీ సమాధిని ద ర్శించుకుంటారు. గుట్టపైకి వెళ్లిన తర్వాత వేసవిలో సైతం చల్లని గాలులు వీచడం విశేషం. ఎల్కతుర్తి మండలం తో పాటు [[భీమదేవరపల్లి]], [[హుజూరా బాద్]], [[వరంగల్ జిల్లా]] [[ధర్మసాగర్]], [[హ సన్‌పర్తి]], [[హన్మకొండ]] మండలాల నుం చి 20వేల మంది భక్తులు వస్తారు.ఎల్కతుర్తి మండలకేంద్రం నుంచి జాతర జరిగే దామెర గ్రామం మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేటల ను కలిపే ప్రధాన రహదారులపైనే ఎల్కతుర్తి ఉం టుంది. ఇక్కడ దిగి ఆటోలో దామెరకు చే రుకోవచ్చు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ నుంచి కూడా రవాణా మార్గం ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/దామెర_(ఎల్కతుర్తి)" నుండి వెలికితీశారు