"కృష్ణా జలవివాదాల న్యాయస్థానం" కూర్పుల మధ్య తేడాలు

+వివాదాలు, వర్గాలు
(+మూస)
(+వివాదాలు, వర్గాలు)
 
==ట్రిబ్యునల్ పంపకాలు==
Tribyunal^
కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నీటిని [[1976]] లో ట్రిబ్యునల్ కింది విధంగా పంపకం చేసింది.
*మహారాష్ట్ర: 560 టి.ఎం.సి.
*కర్ణాటక: 734 టి.ఎం.సి.
*ఆంధ్ర ప్రదేశ్: 811 టి.ఎం.సి.
పై మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చింది. అయితే ఈ అధిక జలాలపై హక్కును మాత్రం ఆంధ్ర ప్రదేశ్ పొందదు.
 
;స్కీము ఎ, స్కీము బి:ట్రిబ్యునల్ తన నివేదికను స్కీము 'ఎ', స్కీము 'బి' అనే రెండు భాగాలుగా ఇచ్చింది. అయితే తన తుది తీర్పులో మాత్రం స్కీము 'ఎ' ను మాత్రమే ప్రస్తావించి, స్కీము 'బి' ని వదలివేసింది. అయితే మూడు పక్షాలు అంగీకరిస్తే స్కీము 'బి' ని కూడా అమలు జరపవచ్చని వివరించింది.
;ట్రిబ్యునల్ తీర్పు యొక్క సమీక్ష: బచావత్ ట్రిబ్యునల్ చేసిన పంపకాలను [[2000]] [[మే 31]] తరువాత మరో అధికారిక సంస్థ చేత సమీక్ష చేయించవచ్చు.
 
==వివాదాలు==
ట్రిబ్యునల్ తీర్పులోని అదనపు జలాలను ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చనే అంశం అనంతర కాలంలో వివాదాలకు దారితీసింది. అధిక జలాలను వాడుకునే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ తన వాటాకు మించి నీటి వినియోగానికై ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టింది. దీనికి మిగిలిన రెండు రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాయి. ఈ అభ్యంతరానికి ప్రధాన కారణం: ఎగువనున్న రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ తమకు పంచిన భాగపు నీటినే వాడుకునే ఏర్పాట్లు చేసుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం తన వాటాకు మించి వాడుకునేందుకు ప్రాజెక్టులు కడుతోంది. (తెలుగుగంగ ద్వారా రాయలసీమకు సాగునీటి సరఫరా అటువంటి ప్రాజెక్టే.) అంతర్జాతీయ జలవినియోగ నియమాల ప్రకారం '''మొదట వాడుకునే వారికి మొదటి హక్కు''' అనే ఒక సూత్రం ఉంది. దాని ప్రకారం తరువాతి ట్రిబ్యునల్ ఏర్పాటయి నీటి పంపకాలు జరిగే సమయానికి ఈ అదనపు జలాలు ఆంధ్ర ప్రదేశ్ కు హక్కు అయిపోతుందనే భయమే ఈ అభ్యంతరాలకు ప్రధాన కారణం.{{చూడు|ref1}}
 
==మూలాలు, వనరులు==
*#{{మూలం|ref1}}[http://www.unu.edu/unupress/unupbooks/80a03e/80A03E0h.htm ''వందనా శివ'' రచన, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయ ప్రచురణ]
*#[http://www.prajasakti.com/ap_rivers/krishnajalaalu/krishnawater_dispute.pdf ప్రజాశక్తి ప్రచురణ]
*#[http://www.deccanherald.com/deccanherald/sep02/top.asp బచావత్ ట్రిబ్యునల్ గురించి దక్కన్ హెరాల్డ్ లో]
*#[http://www.hinduonnet.com/fline/fl2209/stories/20050506001403100.htm కృష్ణా బేసిన్‌లో వివాదం]
 
 
[[Category:ఆంధ్ర ప్రదేశ్‌లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు]]
[[Category:కృష్ణా నదీజల వివాదాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/19558" నుండి వెలికితీశారు