మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

మీమాంస - క్రొత్త పుటను తెరిచితిని
 
పాఠ వివరణ
పంక్తి 19:
మీమాంసలో ముఖ్యమైన పుస్తకము జైమిని మహర్షి రచించిన "మీమాంస సూత్రములు"
 
== '''మీమాంస''' ==
మీమాంస అను సంస్కృత పదమునకు వివిధ అర్థములు గలవు. "పరిగణన, పరిశోధన, చర్చ" అని మీమాంసకు గల నిఘంటార్థములు. వైదిక పాఠ పరిశీలనను కూడా మీమాంస అని చెప్పవచ్చును. మీమాంసలోని పూర్వోత్తర మీమాంసలు వైదిక పాఠములోని కర్మకాండ, జ్ఞానకాండలను అనుసరించి విభజింపబడినాయి. వైదిక వాజ్ఞ్మయములోని సంహిత, బ్రాహ్మణములలో, మీమాంసకు సంబంధించిన సూత్రములు ఎక్కువగా బ్రాహ్మణపాఠముపైననే ఆధారపడి ఉంటాయి.
 
== '''హేతుబద్దత''' ==
హేతువాదానికి, వైదిక పాఠ హేతుబద్దతకు మీమాంస అతి ముఖ్యమైనది. న్యాయ, వైశేషిక రంగముల మాదిరి కాక మీమాంస ఆరు ముఖ్యమైన విధానాలను ప్రతిపాదించింది. అందులో ప్రభాకర మిశ్ర ప్రతిపాదించినవి మొదటి అయిదు కాగా, కుమారిల భట్టు మిగిలిన ఒక్కటిని ప్రతిపాదించినారు.
 
పంక్తి 28:
ప్రత్యక్ష విధానమనగా గోచరమైనది. ఇవి రెండు విధములు, అంతః; బాహ్య.
 
బాహ్యగోచరము అనగా పంచేంద్రియముల చేత కానీ ఇతర ప్రాపంచిక పదార్థములచేత కానీ ధృవీకరించదగినదిధృవీకరించదగినటువంటిది.
అంతఃగోచరము మనస్సుచేత, బుద్దిచేత తెలుసుకోదగిన విషయము.
 
బాహ్యగోచరము క్రింది నియమములకు ఒడబడి ఉంటుంది.
అంతఃగోచరము మనస్సుచేత, బుద్దిచేత తెలుసుకోదగిన విషయము.
- ఇంద్రియార్థసన్నికర్ష (పరిశీలిస్తున్న పదార్థము యొక్క గుణగణాలను ప్రత్యక్ష్యముగా పంచేంద్రియముల (వాఙ్గ్మనస్చక్షు శ్రోత్రత్వగ్) ద్వారా తెలుసుకోగలగడం)
- అవ్యాపదేశ్య (వాగేతర పరిశీలన; ఇతరులు చెప్పింది మాత్రమే నమ్మక తన స్వబుద్ధితో నిర్ణయించగలిగిన స్టితి)
- అవ్యభిచార (పరిపూర్ణ సంకల్ప సిద్ధి కలిగి, దృష్టి మరలకుండా ఉన్నట్టి స్టితి)
- వ్యవసాయాత్మక (పూర్ణత; నిజాము తెలుసుకొనుటకు స్వయముగా శ్రమ పడగలిగినటువంటి స్టితి)
 
అదే విధముగా అంతఃగోచరావస్థ కొన్ని నియమములకు ఒడబడి ఉంటుంది. అవి:
- ప్రతిభ (గ్రాహకుడి స్వయం ప్రతిభ)
- సామాన్యలక్షణప్రత్యక్ష (సామాన్య విషయముల పట్ల ఉన్న అవగాహనను పరీక్షా వస్తువు మీదికి ప్రసరించుట)
- జ్ఞానలక్షణప్రత్యక్ష (తన పూర్వ జ్ఞానమును ఉపయోగించి పరీక్షించుట)
 
ఇవే కాక, సందేహాత్మకమైన విషయమును ప్రత్యక్షప్రమాణమును మాదిరి కాక అంగీకరింపవలసినప్పుడు అది నిర్ణయానుసారమా (నిర్ణయాత్మకమైన విషయాంగీకారమా) లేక అనధ్యవసాయమా (అనుమానాత్మక విషయాంగీకారమా) అని నిర్ణయించేందుకు వేర్వేరు పద్దతులను మీమాంసా శాస్త్రము నియమించింది.
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు