మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఎక్కువ వివరణ
పంక్తి 43:
 
ఇవే కాక, సందేహాత్మకమైన విషయమును ప్రత్యక్షప్రమాణమును మాదిరి కాక అంగీకరింపవలసినప్పుడు అది నిర్ణయానుసారమా (నిర్ణయాత్మకమైన విషయాంగీకారమా) లేక అనధ్యవసాయమా (అనుమానాత్మక విషయాంగీకారమా) అని నిర్ణయించేందుకు వేర్వేరు పద్దతులను మీమాంసా శాస్త్రము నియమించింది.
 
===అనుమానము ===
 
ఒక విషయమును లేదా కొన్ని విషయములను పరిగ్రహించి దానికి ఒక కారణమును ఆపాదించి తద్వారా ఒక నిర్ణయమునకు రావడము అనుమానము.
- పొగ రావడము చూసి నిప్పును శంకించుట ఒక ఉదాహరణ
అనుమానము మూడు విధములుగా విభజించవచ్చును
౧. ప్రతిజ్ఞ
౨. హేతువు
౩. దృష్టాంతము
 
ఈ అనుమానము మరి రెండు విధములు:
౧. సాధ్యము - సాధ్యమనగా ఒక విషయ వస్తువు నిరూపింపదగినట్టిదా కదా అని తెలుసుకోవడము
౨. పక్షము - సాధ్యత యే విధముగా చేకూరునో దాని మార్గము పక్షము. ఇది నిరూపింపదగినట్టిదైతే అది సపక్షము, లేనిచో విపక్షము.
 
సపక్ష విపక్షములు ఎంత వరకు వాదనను బల (నిర్వీర్య) పరుస్తాయో అది వ్యాప్తి అనబడుతుంది. ఈ విధముగా వ్యాప్తి కలిగిన వాదనలతో నిరూపింపబదినటువంటి విషయమును నిగామానము అని వాక్రుచ్చెదరు.
 
=== ఉపమానము ===
 
ఉపమానమనగా సామ్యము. దీనికి ఉదాహరణగా ఒక విషయమును చెప్పుకోవచ్చును. ఒక బాటసారి ఒక దూరదేశమునకేగి అందు ఒక మృగమును చూచెనని భావించెదము. అప్పుడు ఆతను తిరిగి వచ్చి "నేను బహు దూరమున ఒక మృగము చూచితిని అది గోవువలె నడచుచున్నది. గోవువలె మేయుచున్నది. గోవువలె కన్పడుచున్నది. కాని గోవు కాదు" అని తన స్నేహితునికి చెప్పగా ఆ స్నేహితునికి ఆ మృగము మీద ఒక అభిప్రాయము వచ్చి ఉండును. ఇక్కడ ఉపమాన వస్తువు "గోవు". ఈ వివరణ ద్వారా ఆ మృగమును తదుపరి కనుగొనుటకు వీలు కలుగును. పైని ఉదాహరణలో గోవు ఉపమానము కాగా, మృగము ఉపమేయము, వాటి మధ్య గల సామ్యము సామాన్యము. ౭వ శతాబ్దపు భట్టకవి పరివిధములైన ఉపమానములను చెప్పి ఉన్నాడు.
 
=== అర్థపత్తి ===
 
అర్థపత్తి అనగా ముందున్న పరిస్థితులను బట్టి ప్రతిపాదించుట. ఒక ఉదాహరణ: దేవదత్తుడు లావుగా ఉన్నాడు అనునది నిజము, ప్రత్యక్షప్రమాణము అనుకొందము. మరి ఒక విషయమేమన, దేవదత్తుడు దినమునందు భుజింపడు అనునది మనకు తెలిసిన మరియొక్క విషయము. ఇప్పుడు ఈ రెండు వాక్యములు కలిపి చదివిన చదువరికి అర్థమగునది ఏమనగా - దేవదత్తుడు రాత్రివేళలయందు భుజించును అని. దీనిని అర్థపత్తి అందురు.
మీమాంసకులు అర్థపత్తిని బలమైనదిగా పరిగణించరు. ఏలన, రెండు వాక్యముల ద్వారా మూడవ వాక్యమును ధ్రువీకరించుట కష్టసాధ్యమైన పని. పై ఉదాహరణను తీసుకున్న, దేవదత్తుడు లావుగా ఉన్నందులకు మరి ఏదైనా కారణము ఉండవచ్చును. ఆతడు కేవలము రాత్రి భోజనము చేయుట మాత్రమే కాకపోవచ్చును.
 
కావున కేవలము అర్థపత్తియే ఆధారముగా విషయనిర్ధారణ చేయకుండుట మేలని మీమాంసకుల అభిప్రాయము.
 
 
=== అనుపలబ్ది ===
 
పైని అయిదు వాదనలను ప్రభాకర మిశ్ర ప్రతిపాదించగా, ఈ ఆరవ వాదనను శ్రీఆదిశంకర భగవత్పాదాచార్యుల శిష్యులైన కుమారిల భట్టు ప్రతిపాదించినారు. అనుపలబ్ది అనగా లేని పదార్ధమును లేదు అని చెప్పుట ఒక నాణ్యమైన జ్ఞానము. ఉదాహరణకు ఒక గదిలో ఒక మరచెంబు లేదు అని చూచి చెప్పుట సరియైనదే. ఒక విషయము ఉపలబ్దము కానిదని కానీ అసాధ్యమని కానీ తెలుసుకొనుట ఒక జ్ఞానమే, ఏలన ఆ విషయము అసాధ్యమని ముందు గ్రాహకునికి తెలియదు కావున. ఈ అనుపలబ్ది సద్రూపము కానీ అసద్రూపము గానీ కావచ్చును.
 
అనుపలబ్ది నాలుగు విధములుగా విభజింపవచ్చును:
౧. కర్మానుపలబ్ది
౨. క్రియానుపలబ్ది
౩. వస్తోనుపలబ్ది
4. అనంగీకారానుపలబ్ది
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు