మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

ఎక్కువ వివరణ
లంకెలు అమర్చడము జరిగినది
పంక్తి 1:
సంస్కృత ఆస్తిక విద్యావిధానములలో మీమాంస ఒక పద్దతి. వైదిక శాస్త్ర పద్దతులలో ధర్మాన్ని విశ్లేషించు ప్రధానమైన పద్దతి మీమాంస.<ref>http://www.merriam-webster.com/dictionary/Mimamsa</ref> వైదిక సాంప్రదాయము పెంపొందుటకు మూలభూతమైన ఒకానొక పద్దతి మీమాంస.<ref>http://www.britannica.com/EBchecked/topic/383181/Mimamsa</ref>
 
మీమాంస రెండు విధములు:
పంక్తి 5:
౧. పూర్వ మీమాంస (దీనినే కర్మ మీమాంస అందురు)
 
౨. ఉత్తర మీమాంస (దీనిని జ్ఞాన మీమాంస అని కూడా అందురు)<ref name=":0">Oliver Leaman (2006), Shruti, in ''Encyclopaedia of Asian Philosophy'', Routledge, ISBN 978-0415862530, page 503</ref>
 
మీమాంస గురించి వివిధ ప్రతిపాదనలు ఉన్నవి. అందు ప్రధానమైనవి రెండు:
 
౧. ప్రభాకర ప్రతిపాదన: ప్రభాకర మిశ్ర జ్ఞానసముపార్జనకు పంచవిధ విధానములను ప్రతిపాదించినారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థపత్తి, శబ్ద<ref>DPS Bhawuk (2011), Spirituality and Indian Psychology (Editor: Anthony Marsella), Springer, ISBN 978-1-4419-8109-7, page 172</ref>
 
౨. భట్ట ప్రతిపాదన: శ్రీఆదిశంకర భాగవత్పాదాచార్యుల శిష్యులైన కుమారిల భట్టు జ్ఞాన సముపార్జనకు పైని ఐదు విధానములతో పాటుగా అనుపలబ్ధి అను విధానమును జాదించినారుజోడించినారు.<ref>DPS Bhawuk (2011), Spirituality and Indian Psychology (Editor: Anthony Marsella), Springer, ISBN 978-1-4419-8109-7, page 172</ref>
 
మీమాంస ఆస్తిక, నాస్తిక విధానములు రెంటినీ పరిగణిస్తుంది. మీమాంస ప్రకారము ఆత్మ నిత్యమూ, సర్వవ్యాపకమూ అయ్యి సమస్త జీవకోటి అంతఃకరణము అయ్యి ధర్మాధర్మ విచక్షణ పైన దృష్టి సారిస్తుంది. మీమాంస ప్రకారము ధర్మమన్నది కర్మజనీయమే కానీ దేవతా సంబంధమైనది కాదు. దేవతలు కల్పితములు కానీ ధర్మము సార్వజనీనము. వేదాలు అపౌరుషేయాలనీ, వైదిక విధులు అనుల్లంఘనీయములు అనీ మీమాంస పరిగణిస్తుంది. మీమాంసలో వైదిక కర్మలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చినారు.
 
వేదాంతులు వేదాంగములైన ఉపనిషత్తులను ఎక్కువ తలిస్తే మీమాంసకులు భాషాపరిజ్ఞానము యొక్క పరమార్థము శబ్దసంపద జ్ఞాన సముపార్జనకు, మంచిని చెడు నుండి వేరుపరచుటకు ఉపయోగించవలెనని భావిస్తారు. న్యాయమైన, ఋజుప్రవర్తన జీవిత పరమార్థమని మీమాంసకుల వాదన.<ref name=":1">Chris Bartley (2013), Purva Mimamsa, in ''Encyclopaedia of Asian Philosophy'' (Editor: Oliver Leaman), Routledge, 978-0415862530, page 443-445</ref>
 
మీమాంసలో ముఖ్యమైన పుస్తకము జైమిని మహర్షి రచించిన "మీమాంస సూత్రములు"<ref name=":1" /><ref>M. Hiriyanna (1993), Outlines of Indian Philosophy, Motilal Banarsidass, ISBN 978-8120810860, page 298-335</ref>
 
== '''మీమాంస''' ==
మీమాంస అను సంస్కృత పదమునకు వివిధ అర్థములు గలవు. "పరిగణన, పరిశోధన, చర్చ" అని మీమాంసకు గల నిఘంటార్థములు<ref>http://www.sanskrit-lexicon.uni-koeln.de/scans/MWScan/tamil/index.html</ref>. వైదిక పాఠ పరిశీలనను కూడా మీమాంస అని చెప్పవచ్చును. మీమాంసలోని పూర్వోత్తర మీమాంసలు వైదిక పాఠములోని కర్మకాండ, జ్ఞానకాండలను అనుసరించి విభజింపబడినాయి. వైదిక వాజ్ఞ్మయములోని సంహిత, బ్రాహ్మణములలో, మీమాంసకు సంబంధించిన సూత్రములు ఎక్కువగా బ్రాహ్మణపాఠముపైననే ఆధారపడి ఉంటాయి.<ref name=":0" />
 
== '''హేతుబద్దత''' ==
పంక్తి 26:
 
=== ప్రత్యక్ష విధానము ===
ప్రత్యక్ష విధానమనగా గోచరమైనది. ఇవి రెండు విధములు, అంతఃఅంతఃగోచరములు; బాహ్యబాహ్యగోచరములు.
 
బాహ్యగోచరము అనగా పంచేంద్రియముల చేత కానీ ఇతర ప్రాపంచిక పదార్థములచేత కానీ ధృవీకరించదగినటువంటిది.
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు