తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (11), చినారు → చారు, కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 34:
}}
 
'''తిరుపతి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[చిత్తూరు]] జిల్లాలో ఉన్న ఏకైక నగరము మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లో 4 వ అతిపెద్ధ నగరం .తిరుపతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరుపతి నగరానికి విమాన, రైలు, రహదారి సౌకర్యాలు కలవుఉన్నాయి. ఈ నగరం విజయవాడకు 349 కి.మీ, హైదరాబాదుకు 550 కి.మీ, బెంగళూరుకు 256 కి.మీ., చెన్నైకు 140 కి.మీ దూరంలో ఉంది.
 
==చరిత్ర==
[[రామానుజాచార్యుడు|రామానుజాచార్యులు]] కొండ కింద [[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజస్వామి ఆలయాన్ని]] ఏర్పాటుచేయడంతో తిరుమల చరిత్రకు బీజం పడింది. తన శిష్యుడైన యాదవరాజును రామానుజులు ప్రోత్సహించి అప్పటికే ఉన్న చెరువు పక్కన ఆలయ నిర్మాణం ప్రారంభించేలా చేశారు. యాదవరాజు దేవాలయాన్ని నిర్మించడం పూర్తయ్యాకా క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట ''రామానుజపురం'' అని నామకరణం చేశారు. రామానుజపురమే కాక యాదవరాజు చాలా గృహాలు నిర్మించారు. [[శ్రీశైలపూర్ణుడు]], [[అనంతాచార్యులు]] వంటి భక్తులకు నివాసాలు ఏర్పాటుచేశారు. దేవాలయానికి తూర్పున ధాన్యాగారం, వాయువ్యదిశలో అంగడి వీథి నిర్మించి నేటి తిరుపతి నగరానికి ఆనాడు పునాదివేశారు.<ref name="తిరుమల చరితామృతం 57">తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో బుక్స్:2013:పేజీ 57</ref>
==శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం==
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాచీనతకు చాలా సాహిత్యపరమైన ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయలు]] తిరుపతి వేంకటేశ్వరస్వామిని చాలా మార్లు దర్శించుకొని కానుకలు సమర్పించాడు. [[చంద్రగిరి]] కోట నుంచి [[తిరుమల]] గిరుల పైకి చేరుకోవటానికి అతి సమీప కాలి మార్గమైన [[శ్రీ వారి మెట్టు]] ద్వారా [[శ్రీ కృష్ణదేవ రాయలు]] తరచూ స్వామి దర్శనమునకు డోలీపై వెళ్ళేవాడు. 9వ శతాబ్దంలో [[కాంచీపురము|కాంచీపురాన్ని]] పరిపాలించిన [[పల్లవులు]], ఆ తరువాతి శతాబ్దపు [[తంజావూరు]] [[చోళులు]], [[మదురై]]ని పరిపాలించిన [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] చక్రవర్తులు, సామంతులు ఈ వేంకటేశ్వరస్వామి భక్తులై కొలిచారు. ఒకరిని మించి మరొకరు పోటీపడి ఆలయనిర్వహణకు, సేవలకు దానధర్మాలు చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఆలయానికి చాలా సంపద చేకూరింది. శ్రీ కృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యల విగ్రహాలను, తన విగ్రహాన్ని, ఆలయ మండపం పై ప్రతిష్టింపజేశాడు. ప్రధాన ఆలయంలో [[వేంకటపతి రాయలు|వేంకటపతి రాయల]] విగ్రహం కూడా ఉంది. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత, దేశం నలుమూలల ఉన్న చాలామంది చిన్న నాయకులు, ధనవంతులు దేవాలయాన్ని పోషించి కానుకలు బహూకరించడం కొనసాగించారు. [[మరాఠీ భాష|మరాఠీ]] సేనాని, [[రాఘోజీ భోంస్లే]] ఆలయాన్ని సందర్శించి గుడిలో నిత్య పూజా నిర్వహణకై శాశ్వత దాన పథకాన్ని స్థాపించాడు. ఈయన వేంకటేశ్వర స్వామికి ఒక పెద్ద మరకతాన్ని, విలువైన వజ్రవైఢూర్యాలను బహూకరించాడు. ఆ మరకతం ఇప్పటికీ రాఘోజీ పేరుతో ఉన్న ఒక పెట్టెలో భద్రంగా ఉంది. ఆ తరువాతి కాలంలో పెద్ద పెద్ద దానాలు చేసిన వారిలో [[మైసూరు]] మరియు [[గద్వాల]] పాలకులు చెప్పుకోదగినవారు. హిందూ సామ్రాజ్యాల తరువాత, పాలన కర్ణాటక ముస్లిం పాలకుల చేతిలోకి, ఆ తరువాత బ్రిటీషు వారికి వెళ్లింది. తిరుపతి గుడి కూడా వారి పర్యవేక్షణ కిందికి వచ్చింది. అయితే చరిత్రపరంగా ఆలయం మొదట బౌద్ధ / జైన దేవాలయమనిbవాదించే చరిత్రకారులు లేకపోలేదు <ref>http://prearyan.blogspot.in/2010/03/tirupati-balaji-is-jain-temple-of.html</ref><ref>Tirupati Balaji was a Buddhist Shrine - by Prof. Dr. M. D. Nalawade, M.A., B.Ed., LL. B., Ph. D.,Ex- Registrar, Retd. Professor and Head of History Dept. Pune University</ref>
[[File:MS Subbalaxmi. Tirupati (1).JPG|thumb|right|తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహము]]
 
పంక్తి 61:
*'''[[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజ స్వామి దేవాలయం:]]''' తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత [[రాజగోపురం]]తో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో [[రామానుజాచార్యులు]] ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ [[రాజగోపురం|రాజగోపురాన్ని]] 1624లో స్వామిభక్తుడు [[మట్లి అనంతరాజు]] నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది [[శ్రీకృష్ణ ఆలయం]] అయినా, నాటి మూలవిరాట్‌ అయిన [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, [[కుబేరుడు|కుబేరుడి]] వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
*'''[[కోదండ రామాలయం, తిరుపతి|కోదండ రామాలయం]]:''' ఈ [[ఆలయం]]లోని ప్రత్యేకత ఏమిటంటే, [[సీత|సీతమ్మతల్లి]] [[రామావతారము|రాములవారికి]] కుడివైపున ఉండటం! ఇది [[వైఖానసశాస్త్రం|వైఖానసశాస్త్ర]] సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
*'''[[కపిలతీర్థం]]:'''కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడ చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
*'''వరదరాజ స్వామి దేవాలయం:'''ఇది [[కపిల తీర్థం రోడ్డు]] లేదా [[కే టీ రోడ్డు]] లో ఉన్నది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించినారుగావించారు. ఇక్కడ సన్నిధి లో శ్రీ నృసింహస్వామి మరియు శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిల నందు పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధి నందు కూడా పూజలందుకుంటున్నారు.
*'''జీవకోన:'''జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్బుతం.
*'''[[అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం|ఇస్కాన్ దేవాలయం]]:''' ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
పంక్తి 71:
*'''[[తిరుచానూరు|అలివేలు మంగాపురం]] లేదా తిరుచానూరు :''' [[తిరుమల]] వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్‌(దీన్నే అలివేలుమంగాపురం అంటారు)లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్‌, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. [[కార్తీకమాసం]]లో తిరుచానూర్‌ పద్మావతీ అమ్మవారి [[బ్రహ్మోత్సవం|బ్రహ్మోత్సవాలూ]] బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ [[నిత్య కళ్యాణం|నిత్య కళ్యాణమే]].
*'''[[ముక్కోటి]]:''' ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున వున్నది.ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
[[File:SWETA building. Tirupati (1).JPG|thumb|కుడి|తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంథాలయం]]
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 70 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[గుడిమల్లం]]:''' ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
పంక్తి 89:
[[దస్త్రం:Alipiri metla daari pai saastaanga namaskaara silpam clear.JPG|thumb|right|240px|అలిపిరి వద్ద మెట్లదారి పైనున్న సాష్టాంగ ముద్ర శిల్పం]]
[[File:Kapilatheertam.jpg|thumb|240px|కపిలతీర్థం]]
;[[అలిపిరి]]
అలపిరి దగ్గరున్న మెట్ల దారిలో వున్న తల తాకుడు గుండు:---దీన్నె [[తలయేరు గుండు]] అని కూడ అంటారు.- గతంలో అంటరాని వారు కొండ పైకి వెళ్ళే వారు కాదు. వారు ఈ గుండుకు తమ తలను తాకించి ఇక్కడి నుండే వారు తిరిగి వెనక్కి వెళ్ళే వారు. ఏడు కొండలపై తమ పాదాలను సైతం ఉంచ రాదు అని అనుకునె వారు. అందు చేత ఈగుండుకు రంద్రాలున్నాయి. ఇంకో కథనం ప్రకారం ఈ తలయేరు గుండు నుండి మెట్ల దారి అతి కష్టం వుంటుండి. దీనిని మోకాళ్ల మెట్ల దారి అంటారు. తమ మోకాళ్ల నెప్పులు తగ్గాలంటే ఈ గుండుకు తమ మోకాళ్లను తాకించి నడిస్తే మోకాళ్లు నెప్పులు వుండవని భక్తుల నమ్మిక. కారణం ఏదైతేనేమి తల తాకించినా, మోకాలు తాకించినా ఆ గుండుకు అనేక గుంటలు పడి వున్నాయి. గత కాలానికి దర్పణంగా ఈగుండును ఇప్పటికి చూడవచ్చు
[[File:In Tirupati.JPG|thumb|కుడి|తిరుపతిలో ఒక గుడిముందున్న శిల్పము]]
 
పంక్తి 165:
{{colend}}
[[File:ChakramTirupati.JPG|thumb|ఒక గేటుపై చెక్కబడిన సుదర్శన చక్రము]]
{{colbegin}} {{colend}}
 
==తిరుపతి పట్టణంలోని సినిమా థియేటర్లు==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు