"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), కలవు. → ఉన్నాయి. using AWB
(+ తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం) లింకు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), కలవు. → ఉన్నాయి. using AWB)
1940 లో విడుదలైన [[విశ్వమోహిని]] భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. [[ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం]] వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన [[మల్లీశ్వరి]]. ఈ చిత్ర్ం [[చైనా]] లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో [[బీజింగ్]] లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన [[పాతాళ భైరవి]] 24 జనవరి 1952 న [[బొంబాయి]] లో జరిగిన మొట్టమొదటి [[ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్]] లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] చలన చిత్రం. 1956 లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] [[ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం]] ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]], [[తెలుగు సినిమాలు 2006|2006]] మరియు [[తెలుగు సినిమాలు 2008|2008]] సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ [[బాలీవుడ్]]ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినది. [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్]] లో నమోదైనది. హైదరాబాదులో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే కలవుఉన్నాయి.
 
సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది [[పాతాళ భైరవి]](1951), [[మల్లీశ్వరి]](1951), [[దేవదాసు]](1953), [[మాయాబజార్]](1957), [[నర్తనశాల]](1963), [[మరో చరిత్ర]](1978), [[మా భూమి (సినిమా)|మా భూమి]](1979), [[శంకరాభరణం]] (1979), [[సాగర సంగమం]](1983), [[శివ]](1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.
 
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
* అతి పెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* ఎక్కువ పాటలు (వివిధ బాషలలో) పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]] ''30''' వేలకు పైగా
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]] ('''149''' సినిమాలు)
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]] ('''100''' సినిమాలకి పైగా)
* అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>('''42''' సినిమాలు) <br/> [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
 
దక్షిణ భారతదేశంలో గల [[ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. [[హాలీవుడ్]] పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.
 
==చరిత్ర==
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా వసూళ్లు]]''')
వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చినది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ కలదు. 1992 లో చిరంజీవి నటించిన[[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన [[ఘరానా మొగుడు]] బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం గా నిలచినది..
 
== పరిశ్రమ ==
[[అక్కినేని నాగేశ్వరరావు]] హైదరాబాదు చేరి, [[అన్నపూర్ణ స్టూడియో]] నిర్మించారు. [[దగ్గుబాటి రామానాయుడు]], [[రామోజీరావు]] లచే నిర్మించబడ్డ ఫిలిం స్టూడియోలు విరివిగా సినీ నిర్మాణం చేయటంతో బాటు పలువురికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పలు తెలుగు చిత్రాలు [[హిందీ]], [[తమిళం]] ల లో పునర్నిర్మించబడ్డట్టే, పలు హిందీ, తమిళ మరియు మలయాళ చిత్రాలు తెలుగులో పునర్నిర్మింపబడ్డాయి. అయితే కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు నేరుగా అనువదించబడటమే కాక ఆయా భాషలలో కంటే తెలుగులోనే అధిక విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
 
ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి.
 
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించే పరిశ్రమలలో తెలుగు కూడా ఒకటి.
[[తెలుగు సినిమాలు 2004|2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
 
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
 
{| class="wikitable"
 
==కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం==
తమిళ చలనచిత్ర పరిశ్రమ [[కోలీవుడ్]] అని పేరు పొందినది. యాభై మరియు అరవై దశకం లో స్టూడియోలు మద్రాసు మహానగరం లో వుండటం వలన తెలుగు మరియు తమిళ సినిమాకి మంచి సంబంధం కలదు. నేటికి అనేక తెలుగు చలనచిత్రాలు తమిళంలో, మరియు తమిళ చలనచిత్రాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం మామూలూ. అలగే తెలుగు తారలు తమిళం లో నటించటం తమిళ తారలు తెలుగులో నటించడం సహజం. ప్రముఖ తారలు [[త్రిష]], [[ఇలియానా]] 123 లక్షల వరకు; [[శ్రియ]], [[జెనీలియ]], [[సదా]], [[భూమిక]] చావ్లా, ఛార్మి (వీళ్ళంతా ముంబాయికి సంబందించిన వాళ్ళు) 150 నుండి 160 లక్షల వరకు తీసుకుంటారు. నయన తార, ఆసిన్, [[అనుష్క]] వంటి వారు నటించే రోజులు బట్టి 130 నుండి 140 లక్షల వరకు తీసుకుంటారు.
 
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు.<!-- The swapping of stories and heroines between Kollywood and Tollywood is common. --> తెలుగువాడైన [[విద్యాసాగర్]] కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, [[శంకర్]] వంటి దర్శకులు, [[ఏ.ఎమ్.రత్నం]] వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
 
ఒక పక్క టాలీవుడ్ కోలీవుడ్ మధ్య కొన్ని దశకాలుగా సంబంధం వున్నటైతే టాలీవుడ్ మరియు బాలీవుడ్ మధ్య వున్నా సంబంధం మొన్న మొన్నటిదిగా లెక్క వెయ్య వచ్చు. ఎనభై దశకాల దాకా టాలీవుడ్లో హిట్ అయ్యిన హిందీ చిత్రాలను తెలుగులో రిమేక్ చెయ్యడం దాకానే పరిమితమైనది. తొంభై దశకంలో తెలుగు [[రామ్ గోపాల్ వర్మ ]] లాంటి దర్శకుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి పేరు ప్రతిష్టలు సంపాదించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రతిబంద్ మరియు నాగార్జున ఖుదా గవః మరియు క్రిమినల్ లాంటి హిట్ చిత్రాలలో నటించారు. క్రితం పదేళ్లుగా హిందీ అభినేత్రులు తెలుగు సినిమా లో నటించడం మామూలూ అయ్యింది. అంజల జావేరీ, [[కత్రినా కైఫ్]] వంటి అభినేత్రులు తెలుగులో నటించారు.
 
==ప్రత్యేకతలు==
*[http://tollywoodphotoprofiles.blogspot.in/ నటీనటుల సమాచారం కోసం]
 
-------------
 
* '''మరికొంత సమాచారం కోసం [[వికీపీడియా:WikiProject/తెలుగు సినిమాలు|ప్రాజెక్టు పేజీ చూడండి.]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956211" నుండి వెలికితీశారు