"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (4) using AWB
చి (AWB తో RETF మార్పులు, typos fixed: → (2), , → , (4), చేసినాడు → చేసాడు, చినారు → చారు using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (4) using AWB)
|pincode = 509001
}}
'''మహబూబ్‌నగర్''' జిల్లా [[తెలంగాణా]] రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, '''మహబూబ్‌నగర్'''. ఇది [[హైదరాబాదు]]నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కలదు. జిల్లాకు దక్షిణాన [[తుంగభద్ర నది]], [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[నల్గొండ]] జిల్లా, ఉత్తరమున [[రంగారెడ్డి]] జిల్లా, పశ్చిమమున [[కర్ణాటక]] లోని [[రాయచూరు]], [[గుల్బర్గా]] జిల్లాలు కలవుఉన్నాయి. ఈశాన్య దిశలో [[హైదరాబాదు]] జిల్లా కలదు. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ,తొలి ముద్రణ 2006, పేజీ 233</ref> రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. [[కృష్ణానది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]] నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచిన[[ఆలంపూర్]]<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982 ముద్రణ, పేజీ 133</ref>, [[మన్యంకొండ]], [[కురుమూర్తి]],మల్దకల్ శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఊర్కొండపేట, [[శ్రీరంగాపూర్]] లాంటి పుణ్యక్షేత్రాలు, [[పిల్లలమర్రి (వృక్షం)|పిల్లలమర్రి]], [[బీచుపల్లి]], వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, [[ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు|జూరాల]], [[కోయిలకొండ]]కోయిల్ సాగర్, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు<ref>నా దక్షిణ భారత యాత్రా విశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 247</ref>) లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన [[గద్వాల]] కోట, [[కోయిలకొండ కోట]], [[చంద్రగఢ్ కోట]], పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పల్లెర్ల హనుమంతరావు]] లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, [[గడియారం రామకృష్ణ శర్మ]] లాంటి సాహితీవేత్తలు, [[సూదిని జైపాల్ రెడ్డి]], సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. [[ఎన్.టి.రామారావు]]ను సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది.కెసిర్ ఈ జిల్లా మంత్రిగా ఉన్నపుడె తెలంగాణ రాష్ట్రం వచ్చింది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన [[నారాయణపేట]], చేనేత వస్త్రాలకు పేరుగాంచిన [[రాజోలి]], కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, [[మామిడి]]పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, [[రామాయణం|రామాయణ]] కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన [[తంగడి]] ప్రాంతం<ref>పాలమూరు వైజయంతి, 2013</ref> ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 7 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 11 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]].
 
==భౌగోళికం==
 
==మహబూబ్ నగర్ జిల్లా సమాచారం==
[[తెలంగాణ]]లో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా అతి పెద్ద జిల్లా. [[పాలమూరు]] అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు (నగర పంచాయతీలతో కలిపి), 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు కలవుఉన్నాయి. [[కృష్ణా నది|కృష్ణా]] మరియు [[తుంగభద్ర నది|తుంగభద్ర]]లతొ పాటు దిండి, భీమా లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్నది.
 
==మహబూబ్ నగర్ మండలాలు==
[[బొమ్మ:Mahabubnagar Railway Station.JPG|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ రైల్వే స్టేషను</center>]]
[[బొమ్మ:Mahabubnagar Bus Station.jpg|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ బస్ స్టేషను</center>]]
'''రైలు సౌకర్యం''' : [[దక్షిణ మధ్య రైల్వే]] పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం [[సికింద్రాబాదు]] నుంచి [[కర్నూలు]] గుండా [[తిరుపతి]], [[బెంగుళూరు]] వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషను వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషనులు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషనులు కలవు ఉన్నాయి.(మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని [[వాడి]] మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. [[మాగనూరు]] మండలంలోని [[కృష్ణ (మాగనూరు మండలము)|కృష్ణా]] రైల్వేస్టేషను ఈ మార్గంలోనే ఉంది. [[గద్వాల]] నుంచి [[కర్ణాటక]] లోని [[రాయచూరు]]కు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.
 
'''రోడ్డు సౌకర్యం''' : దేశంలోనే అతి పొడవైన [[జాతీయ రహదారి]] అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు కలదు. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, [[జడ్చర్ల]], పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-[[బీజాపూర్]] రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.
[[బొమ్మ:Gadwal Fort.JPG|thumb|right|200px|<center>సంస్థానాధీశుల కాలం నాటి గద్వాల మట్టికోట</center>]]
[[బొమ్మ:Mahabubnagar ZP.jpg|thumb|right|200px|<center>మహబూబ్ నగర్ జిల్లా పరిషత్తు కార్యాలయము</center>]]
*'''ఆలంపూర్ దేవాలయాలు''' : [[తుంగభద్ర నది]] ఒడ్డున ఉన్న [[ఆలంపూర్]] వద్ద ఐదో శక్తి పీఠంగా పేరుగాంచిన జోగుళాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు-బెంగుళూరు 7 వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపుర్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్ లో ఈ ఆలయాలు కలవుఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో క్రీ.శ.7, 8వ శతాబ్దాలలో నిర్మితమైనాయి<ref>శ్రీసాయిధాత్రి పర్యాటకాంధ్ర, దాసరి ధాత్రి రచన, 2009 ముద్రణ, పేజీ 295</ref>. జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడ ఆలంపుర్ పురావస్యు మ్యూజియంలో ఉన్నాయి.
*'''పిల్లలమర్రి''' : మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహావృక్షం ఊడలు ఊడలుగా అభివృద్ధిచెంది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. మహబూబ్ నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడాన్కి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్క్, అక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడాస్థలం, జింకలపార్క్, దర్గా మొదలగునవి కూడా తనవితీరా చూడవచ్చు.
*'''బీచుపల్లి''' : 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారిపై [[కృష్ణానది]] పై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్ళు వాహనాల నుండి కూడా ఇక్కడి అపురూపమైన దృష్యాలు కానవస్తాయి.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956243" నుండి వెలికితీశారు