ఆంధ్రుల దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

Y_S_Rajasekhar_Reddy.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Yann. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
[[File:Watercolour painting on paper of two male figures, possibly Nara and Narayana, twin incarnations of Viṣṇu..jpg|thumb|350px|right|పంచె కండువా ధరించిన నరనారాయణుల చిత్రపటం.]]
దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒకే రకమైన దుస్తులున్ననూ, రాష్ట్రాల, వాటి ప్రదేశాల, మతాల వారీగా వీటిలో స్వల్ప తేడాలు గలవు. (మిగతా దక్షిణ రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క [[కేరళ]] లో మాత్రం విభిన్న సంస్కృతి ఉండటంతో, ఇక్కడి దుస్తులలో కూడా అంతే వ్యత్యాసం కనబడుతుంది.) దుస్తులలో వైవిద్యాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.దుస్తుల నేత, వాటిని తయారు చేసే నూలు, వాటికి వాడబడే రంగులు, వాటి తయారీలో ఇతర ముడిసరుకుల వినియోగం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
 
పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. [[కోస్తా ఆంధ్ర]] లో [[పంచె]]ని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమ లో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టు ని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు కలవుఉన్నాయి.
 
ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పై కి కడతారు. [[ఆంధ్ర]] లో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది.
|పంచెకట్టు
 
 
 
 
==పురుషుల వస్త్రధారణ==
Line 25 ⟶ 22:
{{Main|కుర్తా}}
 
సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ), ధోవతి (పంచె) లని ధరిస్తారు.
 
[[మ్యాండరిన్ కాలర్]] ([[చైనీసు కాలర్]]) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద [[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద [[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. [[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తా కి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి. ఒక్కోమారు కుర్తా స్థానంలో [[చొక్కా]]ని కూడా ధరిస్తారు.
Line 32 ⟶ 29:
 
{{Main|పంచె}}
 
 
ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా [[రాయలసీమ]])లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. [[యునైటెడ్ కింగ్డమ్]] కి చెందిన [[గ్లాస్గో]] లో ఉత్తమ నూలు ఉత్పత్తి అవటం వలన నాణ్యత గల పంచెలని గ్లాస్గో పంచెలు అని సంబోధిస్తారు. అయితే వీటి వికృతి '''గ్లాస్కో''' పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి [[మొలత్రాడు]]ని వాడతారు. పంచ, పై పంచ లు సాధారణంగా తెలుపు రంగు లో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం [[అంచు]] అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.
Line 44 ⟶ 40:
{{Main|కండువా}}
 
కుర్తా పై కండువా/పై పంచ ధరిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో ఖచ్చితం కాకున్ననూ, పెద్దరికానికి, హుందాతనానికి చిహ్నంగా దీనిని ఎడమ భుజము పై (కుడి చేత్తో) సగం వీపు వైపుకు, సగం ఛాతీ వైపుకు వ్రేలాడేలా (ఎక్కువగా [[కోస్తాంధ్ర]])లో అలంకరించుకొంటారు.
 
ఇవి పురుషుల సాంప్రదాయిక దుస్తులు. ఈ మధ్య పెళ్ళికొడుకులు ఫ్యాషన్ అనుసరించి షేర్వానీ లు ధరిస్తున్నారు. కానీ పూర్వం పెళ్ళికొడుకు కుర్తా-ధోవతులనే ధరించేవారు.
Line 67 ⟶ 63:
{{Main|లుంగీ}}
 
ఇంట్లో ఉన్నప్పుడు/సాంప్రదాయికత అవసరం లేనప్పుడు పంచెను ధరించగలిగిననూ, వాటి స్థానంలో లుంగీ ల వాడకం ఎక్కువ. ఇవి రకరకాల రంగులలో గడుల డిజైనులలో లభిస్తాయి. నేసిన (గడుల) వే కాకుండా (ఇతర) ప్రింటు డిజైనులలో కూడా ఇవి లభ్యమౌతాయి.
 
=====టవల్=====
Line 82 ⟶ 78:
<gallery>
File:Lungi clad man in Baleswar Odisha.JPG|లుంగీ ధరించిన ఒక వ్యక్తి
దస్త్రం:Sobhanbabu.jpg| [[సోగ్గాడు (1975 సినిమా) ]] సినిమాలో హాఫ్ స్లీవ్స్ కుర్తా, సైకిల్ కట్టు ధోవతి లో [[శోభన్ బాబు]]
</gallery>
 
Line 140 ⟶ 136:
{{Main|లంగా ఓణి}}
 
పెళ్ళి కావలసిన యువతులు దైనందిన జీవితాలలో పైట-పావడ (లంగా-పైట/ఓణి)లు వాడతారు. గుళ్ళకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళేప్పుడు, ఉత్సవాలకి, ఇతరుల నిశ్చితార్థం, పెళ్ళిళ్ళ వంటి శుభకార్యాలకి కూడా సాంప్రదాయికత ఉట్టిపడటం కోసం యువతులు పైట-పావడలలో హాజరు అవుతారు.
 
పెళ్ళి కాబోతోంది కాబట్టి '''లంగా-ఓణీ, నేటితో రద్దయిపోనీ''' అనే పాట [[వర్షం (సినిమా)]] లో ఉంది. [[చంటి]] సినిమా లో కథానాయిక పుష్పించిన సందర్భానికి జరిగే పేరంటానికి నాయికకి లంగా-ఛోళీ నే తొడిగారు. (వాస్తవానికి ఈ సందర్భములో యౌవనాన్ని సూచించే పైట-పావడ నో, లేక పరిపూర్ణత సూచించే చీరకట్టో ఉంటుంది.)
Line 167 ⟶ 163:
'''లంగా''' భారతీయ [[స్త్రీలు]] ధరించే ఒక రకమైన [[దుస్తులు|దుస్తుల]] లో ఒకటి. లంగా కు నాడాలు ఉంటాయి. ముడి నడుము కి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .
 
పెళ్ళైనవారు [[చీర]] లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
 
అయితే పెళ్ళికి ముందు [[లంగా ఓణి]]లు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో [[పట్టు]]తో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.
Line 189 ⟶ 185:
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:దుస్తులు]]
{{ఆంధ్రుల దుస్తులు}}
{{మూస:భారతీయులు ధరించే దుస్తులు}}
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రుల_దుస్తులు" నుండి వెలికితీశారు