కశింకోట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3) using AWB
పంక్తి 105:
==చరిత్ర ==
కశింకోట సంస్థానపు గ్రామము. [[నిజాం]] పాలనలో చికాకోల్ సర్కారులో ఒక ఫౌజ్‌దారీగా ఉండేది. ఆ తరువాత 1794 నుండి 1802 వరకు విశాఖపట్నం జిల్లాగా ఏర్పడిన మూడు కలెక్టరేట్లలో ఒక కలెక్టరేటుకు ముఖ్యపట్టణంగా ఉన్నది.<ref>[http://books.google.com/books?id=_RG2x2xDQ5UC&pg=PA260&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Gazetteer of South India, Volume 2 By W. Francis]</ref> 1802లో విశాఖపట్నం జిల్లా ఏర్పడిన తర్వాత [[అనకాపల్లి]] జమిందారీ తాలూకాలో భాగమైనది.
మహమ్మదీయుల పాలనలో గోదావరి నదికి ఉత్తారన ఉన్న ప్రాంతంలోని కోటలలోకెల్లా పఠిష్టమైన ప్రముఖ కోటగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం కశింకోటలో కోట యొక్క శిధిలాలు మాత్రమే మిగిలాయి. 1882లో రాబర్ట్ సీవెల్ కశింకోట దుర్గం 800 యేళ్ళనాటిదని ప్రస్తావించాడు. అంటే ఈ కోట కనీసం 11వ శతాబ్దం నుండి ఉండి ఉండాలి. ఇక్కడ [[సదాశివ రాయలు|సదాశివరాయల]] కాలం నాటి రెండు శాసనాలు (1558, 1559) లభించాయి.<ref>[http://books.google.com/books?id=pApDAAAAYAAJ&q=kasimkota+sewell&dq=kasimkota+sewell Itihas, Volume 11]</ref> 1572లో [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]] ఉత్తరాంధ్రలో తన ప్రాబ్యలం పెంచుకోవటానికి రాజమండ్రి నుండి దండెత్తి కశింకోటను వశపరచుకున్నాడు. ఆ తరువాత [[ఒరిస్సా]]పై దండెత్తాడు. నామమాత్రంగా గంజాం మెత్తం గోల్కొండ సుల్తానుల ఆధీనంలో ఉన్నా బాహుబలేంద్ర కుటుంబం వారు పాలిస్తుండేవారు. ఆ తరువాత వాళ్లు రాజధానిని [[రాజమండ్రి]] నుండి కశింకోటకు మార్చారు.<ref>[http://books.google.com/books?id=iF4KAQAAIAAJ&q=kasimkota+fort&dq=kasimkota+fort Orissa District Gazetteers: Ganjam]</ref> బాహుబలేంద్ర కుమారుడు ముకుందరాజు కశింకోట రాజుగా ఉన్న కాలంలో పన్నులు కట్టడానికి నిరాకరించాడు. కుతుబ్‌షా దండెత్తి రాగా, [[వేంకటపతి రాయలు|వేంకటాపతి రాయలు]]ను సహాయం కోరాడు.
[[దస్త్రం:National Highway Kasimkota Visakhapatnam District.jpg|thumbnail|కశింకోట వద్ద జాతీయ రహదారి]]
 
పంక్తి 112:
హవేలీ భూములతో ఏర్పడిన కశింకోట, మేలుపాక సంస్థానాలను వేలంలో విజయనగరం రాజు కొన్నాడు. రెండు సంవత్సరాల తర్వాత వాటిని కారుమంచి వెంకటాచలానికి అమ్మాడు. 1837లో ఆయన మరణించిన తర్వాత కూతురు కొడుకు మంత్రిప్రగడ వెంకటరావుకు సిద్ధించాయి. 1845లో ఆయన కూడా మరణించగా, వెంకటరావు తమ్ముడు చిరంజీవిరావు, కొడుకు వెంకటాచలంకు ఉమ్మడిగా కట్టబెట్టారు. ఇద్దరూ పిల్లలైనందువళ్ళ సంస్థానం సంరక్షక పాలనలో ఉన్నది. తమ్ముడు చిరంజీవిరావు 1851లో మరణించాడు, కొడుకు వెంకటాచలం 1863లో యుక్తవయస్కుడై 1865 మే నెలలో మరణించాడు. ఆయన మైనరు విధవ రామాయమ్మ, పసిపాప మహాలక్ష్మమ్మ<ref>[http://books.google.com/books?id=956pPm6wf84C&pg=PA222&dq=kasimkota#v=onepage&q=kasimkota&f=false Vizagapatam District Gazetteer By W. Francis]</ref>
 
ఏనుగుల వీరాసామయ్య తన కాశీ యాత్ర చరిత్రలొ కశింకోట గ్రామ ప్రస్తావన వున్నది. దాని ప్రకారము:
''14 తేది వుదయాత్పూర్వము 3 గంటలకు లేచి యిక్కదికి 7 కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు 9 గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్ను40 యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి. కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు 7 గంటలకు చెరినాను.''
 
"https://te.wikipedia.org/wiki/కశింకోట" నుండి వెలికితీశారు