ధనుర్వాతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
}}
 
ధనుర్వాతము (Tetanus) చిన్నపిల్లలకు వచ్చే ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధి 'క్లాస్ట్రీడియం టెటని' అనే [[బాక్టీరియా]] వలన కలుగుతుంది. దవడలు బిగిసే ప్రధాన లక్షణం గల వ్యాధి కనుక దీనిని లాక్ జా (Lock-jaw) అని వ్యవహరిస్తారు.
 
వ్యాధికారక సూక్ష్మక్రిములు గడ్డిమేసే జంతువుల పేడ ద్వారా వెలువడి, వీటి స్పోర్లు మట్టిలోను, దుమ్ములోను చాలా కాలం బ్రతికిఉంటాయి. చర్మం పగుళ్ళు, గాయాలు, జంతువుల కాట్లద్వారా మన శరీరంలో ప్రవేశిస్తాయి. బొడ్డును కోసే పరికరాలు, కట్టే దారం అపరిశుభ్రమైనవైతే, కోసిన బొడ్డుకు బూడిద, పేడపూయడం ద్వార పురిటి బిడ్డలలో దనుర్వాతం కలుగుతుంది.
 
సూక్ష్మక్రిములు శరీరంలో ప్రవేశించిన చోటనే, ఆమ్లజని రహిత పరిస్థితులలో వృద్ధిచెంది ఎక్సోటాక్సిన్ ను ఉత్పత్తి చేసి అవి రక్తంద్వారా నాడీ మండలాన్ని చేరి వ్యాధి లక్షణాలను కలుగజేస్తాయి. మొదటి సాదారణ లక్షణాలు దవడలు బిగిసి, నోరు సరిగా తెరవ లేకపోవడం, మెడ బిగియడం, శరీరం వంకరలు పోవడం. చంటిపిల్లలు పాలు త్రాగరు. కొద్దిపాటి వెలుతురు, శబ్దం లేక రోగిని ముట్టుకున్నా శరీరం వంకరలు తిరిగిపోరుంది. మరణం సంభవించవచ్చును. ఈవ్యాధి అంతర్గతకాలం సాధారణంగఅ 3 నుండి 21 రోజులు.
 
[[వర్గం:అంటు వ్యాధులు]]
"https://te.wikipedia.org/wiki/ధనుర్వాతము" నుండి వెలికితీశారు