కోయిలకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 11:
'''కోయిలకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509371.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> కోయిలకొండ గ్రామంలో పురాతన కోటతో పాటు పురాతన ఆలయాలు, చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామము మహబూబ్ నగర్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది.
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 66710. ఇందులో పురుషుల సంఖ్య 33852, స్త్రీల సంఖ్య 32858. అక్షరాస్యుల సంఖ్య 30047.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
==విద్యాసంస్థలు==
* వీరభద్ర జూనియర్ కళాశాల (స్థాపన : [[2005]]-[[2006|06]]
పంక్తి 22:
 
==కోట నిర్మాణం==
ఆంధ్రరాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్ట గా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు కలవుఉన్నాయి.ఒకనాడు తాలుకా కేంద్రంగా విరజిల్లిన ఈ కోట నేడు మండల కేంద్రంగా తన ఉనికిని చాటుకుంటుంది. కోయిలకొండ గ్రామానికి దక్షిణాన ఎత్తైన గుట్టపై నిర్మాణం జరిగింది. కోట సప్తప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్ళను ఒక దానిపై మరొక దాన్ని పేర్చి గోడల నిర్మాణం చేశారు. గచ్చు గానీ, మట్టి గానీ వాడకుండానే గోడల నిర్మాణం చేయడం మహా అద్భుతం. కోటపైకి ఎక్కడానికి విశాలమైన మెట్లను నిర్మించారు. కోటలో రెండంతస్తుల దివ్యమైన రాణి మహేల్‌ ఉండేవి. అది నేటికి మనకంటికి అక్కడ కనిపిస్తుంది. కోటపై భాగంలో సంవత్సరం పొడవునా తాగునీటి ఎద్దడి లేకుండా విశాలమైన సరోవరములను నిర్మించారు. ఆ నాటి రాజులు తమ సౌకర్యార్ధం అశ్వశాలలు, గజశాలలు, ధాన్యాగారాలు, నివాస గృహాలు కోటపై భాగముననే నిర్మించారు. రాజు వినియోగానికి నీటి గది ఒకటి రమణీయంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ గదిలోనికి వీరు మాత్రం ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు. నీళ్ళు మాత్రం సూచికగా కనబడతాయి. కోటపై భగంలో ఆంజనేయస్వామి,దేవాలయాలతో పాటు అడుగడుగున అనేక దేవాలయాలు తారసపడతాయి.
 
==కోట చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/కోయిలకొండ" నుండి వెలికితీశారు