ఐక్యరాజ్య సమితి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Flag of the United Nations.svg|thumb|right|ఐక్యరాజ్య సమితి పతాకం]]
'''ఐక్యరాజ్య సమితి''' ([[ఆంగ్లం]]: United Nations) అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తరువాత ఏర్పాటు చేసిన [[నానాజాతి సమితి]] (లీగ్ ఆఫ్ నేషన్స్) [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధాన్ని]] నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా [[1945]]లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతము [[దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు|193]] దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: [[అమెరికా]], [[రష్యా]], [[బ్రిటన్]], [[చైనా]] మరియు [[ఫ్రాన్స్]]. ప్రధాన కార్యాలయం [[న్యూయార్క్]] నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి [[బాన్ కి-మూన్]]. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన [[అక్టోబరు 24]]వ తేదీని ప్రతి సంవత్సరం '''[[ఐక్యరాజ్యసమితి_దినోత్సవంఐక్యరాజ్యసమితి దినోత్సవం|ఐక్యరాజ్య సమితి దినోత్సవం]]''' గా పాటిస్తారు.
 
[[దస్త్రం:United Nations Members.PNG|thumb|300px|ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : [[అంటార్కిటికా]] (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), [[వాటికన్ నగరం]]లేదా [[హోలీ సీ]] (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), [[పాలస్తీనా భూభాగాలు]] (ఐ.రా.స. అబ్సర్వర్), [[పశ్చిమ సహారా]] ([[మొరాకో]], [[పోలిసారియో ఫ్రంట్]]ల మధ్య వివాదంలో ఉన్నది), [[తైవాన్]] - ([[చైనా రిపబ్లిక్ (తైవాన్)]] అనబడే దీనిని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]]లో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.]]
పంక్తి 20:
 
== సమితి ప్రధాన అంగాలు ==
ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు కలవుఉన్నాయి.
=== సర్వ ప్రతినిధి సభ ===
[[దస్త్రం:UN General Assembly hall.jpg|thumb|సాధారణ సభ సమావేశం]]
పంక్తి 27:
=== భద్రతా మండలి ===
[[దస్త్రం:United Nations Security Council.jpg|thumb|భద్రతా మండలి ఆఫీసు లోపలి భాగం]]
సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సబ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలు కలవుఉన్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ళ కాలవ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్యదేశాలు. [[అమెరికా]], [[రష్యా]], [[ఇంగ్లాండు]], [[చైనా]], [[ఫ్రాన్సు]] లు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం కూడా కలదు. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేసారు. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను 10 కి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ యూరప్ నుండి ఇద్దరు, తూర్పు యూరప్‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసము మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.
 
=== సచివాలయం ===
"https://te.wikipedia.org/wiki/ఐక్యరాజ్య_సమితి" నుండి వెలికితీశారు