"అద్వైతం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. (4) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కలవు. → ఉన్నాయి. (4) using AWB)
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''అద్వైతం''' ( [[సంస్కృతం]] : अद्वैत वेदान्त ); [[వేదాంతం|వేదాంతానికి]] చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".<ref>[http://books.google.com/books?id=63gdKwhHeV0C "Advaita Vedanta: A Philosophical Reconstruction,"] By Eliot Deutsch, University of Hawaii Press, 1980, ISBN 0-8248-0271-3.</ref> వేదాంతాల ఇతర ఉపశాఖలు [[ద్వైతం]] మరియు [[విశిష్టాద్వైతం]]. ''అద్వైతం'' అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, [[జీవాత్మ]], [[పరమాత్మ]]ల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక.<ref>''Brahman'' is not to be confused with [[Brahma]], the Creator and one third of the [[Trimurti]] along with [[Shiva]], the Destroyer and [[Vishnu]], the Preserver.</ref> [[ఆది శంకరాచార్యులు]] ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.<ref>[http://books.google.com/books?id=zJeEhvvLdhMC "Thirty-five Oriental Philosophers,"] By Diané Collinson, Robert Wilkinson, Routledge, 1994, ISBN 0-415-02596-6.</ref> అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము , జీవ పరమాత్మల భేదము, అవిద్య (మాయ), మాయా చైతన్యాల సంబంధమూ , ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి , మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని అంగీకరించాలి. అలా కాకుండా, స్వభావంచేతనే సృష్టి జరుగుతోందని అంటే, దాన్లో ఒక పద్ధతీ, నియమమూ ఉండకూడదనేది స్పష్టమవుతుంది.
 
నామ రూపాలచేత విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఊహించడానికి కూడ శక్యంగాని విధంగా సృష్టి రచనావిధానం తెలియబడుతోంది. బ్రహ్మసూత్రాల్లో “జన్మాద్యస్య యతః “ - అంటే ఈ జగత్తుయొక్క జన్మ- స్థితి - ప్రళయములు దేనివల్ల కల్గుతున్నాయో, అది బ్రహ్మము అని చెప్పబడింది. సృష్టి అంటే యిదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కన్పించేదని స్థూలంగా అనుకోవచ్చు. “సృష్టికి పూర్వం బ్రహ్మమొక్కటే ఉండెను. మాయలచేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి కారణం ఏదీ లేదు. కార్యం కూడ ఏదీ లేదు. ద్వితీయ వస్తువేదీ లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమునూ అనుభవించేది, తెలుసుకొనేదీ” అనే వాక్యాలు ఛాందోగ్యోపనిషత్తు యందు చెప్పబడ్డాయి.
 
= చరిత్ర =
ఉపనిషత్తులలో జీవుడు, బ్రహ్మం, జగత్తును గురించి గురుశిష్యుల నడుమ చర్చలుగా వ్రాసి ఉన్నాయి<ref>[http://www.britannica.com/EBchecked/topic/618602/Upanishad "britannica.com లో ఉపనిషత్"]</ref>. ఈ ఉపనిషత్తులలో అనేక చోట్ల సాక్షాత్తు అద్వైతం అన్న పదం వాడకపోయినా జీవుడు బ్రహ్మ ఒకటే అన్న విషయాన్ని ప్రస్తావించబడినది. సుమారు క్రీ. శ. 600 లో రచించిన బృహదరణ్యకోపనిషత్ లో అద్వైతసూత్రాలు చాలా కనబడతాయి. క్రీ. శ 6 వ శతాబ్దంలో జీవించిన [[గౌడపాదులు]] ఈ ఉపనిషత్తుల సారం అద్వైతం అని వారు రచించిన [[మాండూక్య కారిక]]లో చెప్పారు<ref>[http://books.google.com/books?id=FitzCp2CkoAC&lpg=PP1&ots=cFKiaeBV8F&dq=mandukya%20karika&pg=PA183#v=onepage&q=advaita&f=false "గూగుల్ books లో మాండూక్య కారిక గురించి స్వామీ చిన్మయానంద పుస్తకం"]</ref>. అద్వైతం అంటే "రెండవది-లేని" అని అర్థం. బ్రహ్మం, జీవుడు, జగత్ అని మూడు విషయాలు లేవు. ఉన్నదంతా ఒకటే, అది బ్రహ్మమే అని అర్థం. ఆయన శిష్యుడు [[గోవింద భగవత్పాదులు]]. వారి శిష్యుడు [[శంకరాచార్యులు]]<ref>[http://www.advaita-vedanta.org/avhp/advaita-parampara.html "అద్వైత పరంపరాశ్లోకం"]</ref>.
 
ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవుఉన్నాయి. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
 
అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
 
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవిఉన్నాయి. ఆచ్ఛాదక శక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
 
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.
నిర్విశేషమయిన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిశేవిబ్రహ్మోపాసనము చేయవలయు. వీరికి సగుణబ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడఁగానే నిర్విశేష బ్రహ్మము తానే తోఁచును. సగుణబ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది అందు శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు. కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల పుణ్యపాపానురూపముగ మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు. నిషిద్ధకర్మములను ఆచరించువారు రౌరవాదినరకములను పొంది అందు పాపానురూపంబుగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాఁగల తిర్యగ్యోనులయందు స్థావరాదియోనులయందును పుట్టి నశించుచున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమునుపొంది, నిరతిశయానందమును అనుభవించుచున్నారు.
 
ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, [[శంకరాచార్యులు]] అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు. [[ఉపనిషత్తులు]], [[బ్రహ్మసూత్రాలు]], [[భగవద్గీత]] -- ఈ—ఈ మూడింటినీ కలిపి [[ప్రస్థానత్రయం|ప్రస్థానత్రయి]] అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటారు. అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది. కేరళ నుండి ఉత్తరభారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు<ref>[http://books.google.com/books?id=Xd_rc7vWaEQC&lpg=PA61&ots=J-xIZYynSR&dq=adi%20sankara%20spread%20hinduism&pg=PA61#v=onepage&q&f=false "గూగుల్ books లో తిరుమంగళకుడి వెంకటరామన్ రచించిన "Discovery of Spiritual India"]</ref>. దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన [[పద్మపాదులు]] (తూర్పున పూరి లో), [[హస్తామలకులు]] (పడమరన ద్వారకలో), [[తోటకాచార్యులు]] (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), [[సురేశ్వరాచార్యులు]] (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తఱువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
==పురాణ ప్రకారము==
ఇది స్మార్తమతము. ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండుపదార్థములు కలవుఉన్నాయి. అందు బ్రహ్మము సత్యము, జ్ఞానానందాత్మకము, నిర్వికారము, నిరవయవము, నిత్యము, నిర్దోషము, విభువు. (సత్యము = కాలత్రయముచే బాధింపఁదగనిది. నిర్వికారము = రూపాంతరములు లేనిది. నిరవయవము = అవయవములు లేనిది. నిత్యము = కాలత్రయములయందు ఉండునది. విభువు = వ్యాపనము కలిగి ఉండునది.)
 
@అవిద్య అపారమార్థికము, సదసద్విలక్షణము, జడము, సవికారము, సావయవము, అనాది సాంతము, అజ్ఞానరూపము. (అపారమార్థికము = మిథ్యా భూతము. బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది. ఇది వ్యావహారికసత్త అని చెప్పఁబడుచున్నది. వ్యవహారదశలో సత్తుగా తోఁచును కాని పరమార్థము కాదు. సదసద్విలక్షణము = సత్తనఁగా బ్రహ్మము, అసత్తనఁగా తుచ్ఛమయిన శశశృంగాది; పారమార్థికసత్తయిన బ్రహ్మముకంటెను ప్రమాణసిద్ధముగాని తుచ్ఛముకంటెను విలక్షణమైనది. బ్రహ్మమువలె పారమార్థికము కాదు, తుచ్ఛమువలె ప్రమాణములకు అవిషయమును కాదు.)
ఈయవిద్య సత్వరజస్తమోరూపగుణత్రయాత్మకము. దీనికి ఆచ్ఛాదకశక్తి, విక్షేపశక్తి అని రెండుశక్తులు ఉన్నవిఉన్నాయి. ఆచ్ఛాదకశక్తికల యవిద్యచేత ఆవరింపఁబడిన బ్రహ్మమునకు చీఁకటిలో ఉన్నమనుష్యునకువలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమయిన దేవతిర్యఙ్మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది. ఈదేవాదిభేదములు అన్నియు అవిద్యాపరిణామములుగాని పరమార్థములు కావు.
ఈచైతన్యరూపమయిన బ్రహ్మము శుద్ధ చైతన్యము, మాయావచ్ఛిన్నచైతన్యము, అంతఃకరణావచ్ఛిన్నచైతన్యము, వృత్త్యవచ్ఛిన్నచైతన్యము, విషయావచ్ఛిన్నచైతన్యము అని అయిదు భేదములుగలది. శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈభేదములు అవిద్య మొదలుగాఁగల యుపాధులచేత కలుగుచున్నవి.
అందు శుద్ధచైతన్యము అనునది శుద్ధబ్రహ్మస్వరూపము.
{{భారతీయ తత్వశాస్త్రం}}
{{శైవం}}
 
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:తత్వశాస్త్రం]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956683" నుండి వెలికితీశారు