మీమాంస: కూర్పుల మధ్య తేడాలు

మరింత వివరణ
→‎మీమాంస గ్రంథములు: సూచికలను జోడించడమైనది
పంక్తి 1:
సంస్కృత ఆస్తిక విద్యావిధానములలో మీమాంస ఒక పద్దతి. [[చతుర్వేదాలు|వైదిక]] శాస్త్ర పద్దతులలో ధర్మాన్ని విశ్లేషించు ప్రధానమైన పద్దతి మీమాంస.<ref>http://www.merriam-webster.com/dictionary/Mimamsa</ref> వైదిక సాంప్రదాయము పెంపొందుటకు మూలభూతమైన ఒకానొక పద్దతి మీమాంస.<ref>http://www.britannica.com/EBchecked/topic/383181/Mimamsa</ref>
 
మీమాంస రెండు విధములు:
# [[పూర్వమీమాంస|పూర్వ మీమాంస]] (దీనినే కర్మ మీమాంస అందురు)
# [[ఉత్తరమీమాంస|ఉత్తర మీమాంస]] (దీనిని జ్ఞాన మీమాంస అని కూడా అందురు)<ref name=":0">Oliver Leaman (2006), Shruti, in ''Encyclopaedia of Asian Philosophy'', Routledge, ISBN 978-0415862530, page 503</ref>
 
మీమాంస గురించి వివిధ ప్రతిపాదనలు ఉన్నవి. అందు ప్రధానమైనవి రెండు:
# ప్రభాకర ప్రతిపాదన: ప్రభాకర మిశ్ర జ్ఞానసముపార్జనకు పంచవిధ విధానములను ప్రతిపాదించినారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థపత్తి, శబ్ద<ref>DPS Bhawuk (2011), Spirituality and Indian Psychology (Editor: Anthony Marsella), Springer, ISBN 978-1-4419-8109-7, page 172</ref>
 
# భట్ట ప్రతిపాదన: [[ఆది శంకరాచార్యులు|శ్రీఆదిశంకర భాగవత్పాదాచార్యుల]] శిష్యులైన [[కుమారిల భట్టు]] జ్ఞాన సముపార్జనకు పైని ఐదు విధానములతో పాటుగా అనుపలబ్ధి అను విధానమును జోడించినారు.<ref>DPS Bhawuk (2011), Spirituality and Indian Psychology (Editor: Anthony Marsella), Springer, ISBN 978-1-4419-8109-7, page 172</ref>
 
మీమాంస [[ఆస్తికవాదం|ఆస్తిక]], [[నాస్తికత్వం|నాస్తిక]] విధానములు రెంటినీ పరిగణిస్తుంది. మీమాంస ప్రకారము [[ఆత్మ]] నిత్యమూ, సర్వవ్యాపకమూ అయ్యి సమస్త జీవకోటి అంతఃకరణము అయ్యి ధర్మాధర్మ విచక్షణ పైన దృష్టి సారిస్తుంది. మీమాంస ప్రకారము ధర్మమన్నది కర్మజనీయమే కానీ దేవతా సంబంధమైనది కాదు. దేవతలు కల్పితములు కానీ ధర్మము సార్వజనీనము. వేదాలు అపౌరుషేయాలనీ, వైదిక విధులు అనుల్లంఘనీయములు అనీ మీమాంస పరిగణిస్తుంది. మీమాంసలో వైదిక కర్మలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చినారు.
 
వేదాంతులు వేదాంగములైన [[ఉపనిషత్తులు|ఉపనిషత్తులను]] ఎక్కువ తలిస్తే మీమాంసకులు భాషాపరిజ్ఞానము యొక్క పరమార్థము శబ్దసంపద [[జ్ఞానము|జ్ఞాన సముపార్జనకు,]] మంచిని చెడు నుండి వేరుపరచుటకు ఉపయోగించవలెనని భావిస్తారు. న్యాయమైన, ఋజుప్రవర్తన జీవిత పరమార్థమని మీమాంసకుల వాదన.<ref name=":1">Chris Bartley (2013), Purva Mimamsa, in ''Encyclopaedia of Asian Philosophy'' (Editor: Oliver Leaman), Routledge, 978-0415862530, page 443-445</ref>
 
మీమాంసలో ముఖ్యమైన పుస్తకము [[జైమిని మహర్షి]] రచించిన "మీమాంస సూత్రములు"<ref name=":1" /><ref>M. Hiriyanna (1993), Outlines of Indian Philosophy, Motilal Banarsidass, ISBN 978-8120810860, page 298-335</ref>
 
== '''మీమాంస''' ==
మీమాంస అను సంస్కృత పదమునకు వివిధ అర్థములు గలవు. "పరిగణన, పరిశోధన, చర్చ" అని మీమాంసకు గల నిఘంటార్థములు<ref>http://www.sanskrit-lexicon.uni-koeln.de/scans/MWScan/tamil/index.html</ref>. వైదిక పాఠ పరిశీలనను కూడా మీమాంస అని చెప్పవచ్చును. మీమాంసలోని పూర్వోత్తర మీమాంసలు వైదిక పాఠములోని కర్మకాండ, జ్ఞానకాండలను అనుసరించి విభజింపబడినాయి. వైదిక వాజ్ఞ్మయములోని [[సంహితము|సంహిత]], [[బ్రాహ్మణం|బ్రాహ్మణములలో]], మీమాంసకు సంబంధించిన సూత్రములు ఎక్కువగా [[బ్రాహ్మణం|బ్రాహ్మణపాఠముపైననే]] ఆధారపడి ఉంటాయి.<ref name=":0" />
 
== '''హేతుబద్దత''' ==
[[హేతువు|హేతువాదానికి]], వైదిక పాఠ హేతుబద్దతకు మీమాంస అతి ముఖ్యమైనది. [[న్యాయ మీమాంస|న్యాయ]], [[వైశేషిక దర్శనము|వైశేషిక]] రంగముల మాదిరి కాక మీమాంస ఆరు ముఖ్యమైన విధానాలను ప్రతిపాదించింది. అందులో ప్రభాకర మిశ్ర ప్రతిపాదించినవి మొదటి అయిదు కాగా, కుమారిల భట్టు మిగిలిన ఒక్కటిని ప్రతిపాదించినారు.
 
=== ప్రత్యక్ష విధానము ===
పంక్తి 54:
సపక్ష విపక్షములు ఎంత వరకు వాదనను బల (నిర్వీర్య) పరుస్తాయో అది వ్యాప్తి అనబడుతుంది. ఈ విధముగా వ్యాప్తి కలిగిన వాదనలతో నిరూపింపబదినటువంటి విషయమును నిగామానము అని వాక్రుచ్చెదరు.
 
=== [[ఉపమాలంకారం|ఉపమానము]] ===
 
ఉపమానమనగా సామ్యము. దీనికి ఉదాహరణగా ఒక విషయమును చెప్పుకోవచ్చును. ఒక బాటసారి ఒక దూరదేశమునకేగి అందు ఒక మృగమును చూచెనని భావించెదము. అప్పుడు ఆతను తిరిగి వచ్చి "నేను బహు దూరమున ఒక మృగము చూచితిని అది గోవువలె నడచుచున్నది. గోవువలె మేయుచున్నది. గోవువలె కన్పడుచున్నది. కాని గోవు కాదు" అని తన స్నేహితునికి చెప్పగా ఆ స్నేహితునికి ఆ మృగము మీద ఒక అభిప్రాయము వచ్చి ఉండును. ఇక్కడ [[ఉపమాలంకారం|ఉపమాన]] వస్తువు "గోవు". ఈ వివరణ ద్వారా ఆ మృగమును తదుపరి కనుగొనుటకు వీలు కలుగును. పైని ఉదాహరణలో గోవు ఉపమానము కాగా, మృగము [[ఉపమాలంకారం|ఉపమేయము]], వాటి మధ్య గల సామ్యము సామాన్యము. ౭వ శతాబ్దపు భట్టకవి పరివిధములైన ఉపమానములను చెప్పి ఉన్నాడు.
 
=== అర్థపత్తి ===
పంక్తి 77:
శబ్దము అనగా ప్రాచీన లేక ప్రస్తుత నిపుణుల వాక్కు మీద ఆధారపడటము. ఒక విషయము మీద అత్యంత పరిణతి కలిగి మిక్కిలి విషయ పరిజ్ఞానము కలిగి ఉన్న వ్యక్తి యొక్క అభిప్రాయమును స్వీకరించి వాదనను సమర్థించుకొనుటను శబ్దము అని అంటారు.<ref>Eliott Deutsche (2000), in Philosophy of Religion : Indian Philosophy Vol 4 (Editor: Roy Perrett), Routledge, ISBN 978-0815336112, pages 245-248</ref> సమయాభావమున్న సందర్భమునందు పెద్దల, నిపుణులు, పూర్వీకులు, గురువుల యొక్క అభిప్రాయము మీద ఆధారపడి నిర్య్నయము తీసుకొనుట మీమాంసకులకు అంగీకృతమే. చార్వాక సంప్రదాయానుసారము శబ్దము నిర్ణయాత్మకమైన వాదన కాదు.<ref>Eliott Deutsche (2000), in Philosophy of Religion : Indian Philosophy Vol 4 (Editor: Roy Perrett), Routledge, ISBN 978-0815336112, pages 245-248</ref><ref>M. Hiriyanna (2000), The Essentials of Indian Philosophy, Motilal Banarsidass, ISBN 978-8120813304, page 43</ref>
 
=== [[వేదాంతశాస్త్రం|వేదాంత పరిశీలన]] ===
మీమాంస ప్రకారము వేదములు స్వతః ప్రమాణములు. దీనినే స్వతఃప్రమాణ్యవాదము అని అందురు. భారతీయ సాంప్రదాయానుసారముగా వేదములు అత్యున్నత స్థానమును అధిరోహించినాయి. కావున ఏదైనా విషయము వేదప్రమాణము అనిన, దానికి మరలా మీమాంస, తర్క వాదములు వర్తించవు.
 
== '''మీమాంస వాదనలు''' ==
మీమాంస ప్రకారము ధర్మాచరణ అతి ముఖ్యమైన విధి. ధర్మావలంబనకు అవసరమైన [[కర్మ (హిందూ మతము)|కర్మ]], జ్ఞానావసరముల యొక్క నిబద్దతను మీమాంసలోని వాదనలు బలపరుస్తాయి
 
=== [[నాస్తికత్వం|నాస్తికత]] ===
భగవంతుడు లేదన్న నాస్తిక వాదనను మీమాంస పూర్తిగా సమర్థించాడు. అదే విధముగా ఆ వాదనలలోని బలమును పూర్తిగా అంగీకరించదు. భగవంతుని ఉనికిని బలపరుచుట అనవసరము, ఏలన - వేదములు అపౌరుషేయములని, వాటి రచన మానవసంబంధము కాదని వేదవాక్కు. అదే విధముగా,వేదమే భగవత్స్వరూపమైనప్పుడు అందులోని మంత్రములు ఉదాహరించిన దేవతామూర్తులకు ప్రాధాన్యత లేదని, ధర్మమూ[[ధర్మము]] సర్వంసహా అధికారి అని మీమాంసకుల వాదన.
 
=== [[ధర్మము]] ===
ధర్మమును వేదార్థములో మీమాంస పరిగణిస్తుంది. వేదార్థము మిగిలిన అన్ని అర్థములనూ మించినది కావున, తతిమ్మా అర్థవివరణలు అవసరము లేదని మీమాంసకుల వాదన.<ref name=":2">https://books.google.com/books?id=LkE_8uch5P0C</ref> ధర్మము యొక్క పరమార్థము వేదవచనములైన [[సంహితము|సంహిత]], బ్రాహ్మణములలోని[[బ్రాహ్మణం|బ్రాహ్మణము]]<nowiki/>లలోని కర్మల సరియైన పాలన. ఇదే అత్యున్నత ధర్మమని మీమాంసకుల వాదన.<ref name=":2" />
 
== మీమాంస గ్రంథములు ==
మీమాంస యొక్క అతి ముఖ్యమైన గ్రంథము [[జైమిని మహర్షి|జైమిని]] మహర్షి వ్రాసిన "[[జైమిని భారతం|జైమిని భారతము]]" లేక "[[జైమిని భారతం|జైమిని మీమాంస సూత్రములు]]". ఈ సూత్రములకు [[శబరుడు]] "మీమాంససూత్రభాష్యము" అని ఒక భాష్యము రాసియున్నారు.
 
దీనిపైన పలువిధములైన భాష్యములను వివిధ భాష్యకారులు రచించియున్నారు. అందు ముఖ్యమైనవారు:
* [[ప్రభాకర మిశ్రుడు]] - బృహతి (శబర సూత్రముల మీద ఆధారము)
* [[కుమారిల భట్టు]]
** వీరు మీమాంస సూత్రముల పైన, శబర భాష్యము పైన భాష్యములు రాసినారు. కుమారిల భట్టు భాష్యములను మూడు విధములుగా విభజించవచ్చును.
*** శ్లోకవార్తిక
పంక్తి 100:
*** తుప్తీక
 
* [[మండన మిశ్రుడు]]
** కుమారిల భట్టు రాసిన సూత్రముల ఆధారముగా రాసిన వీరి భాష్యములు రెండు విధములుగా విభజింపవచ్చును
*** విధివివేక
*** మీమాంసానుక్రమణి
* [[పార్థసారథి మిశ్రుడు]] - న్యాయరత్నాకరము (శ్లోకవార్తిక ఆధారము), శాస్త్రదీపిక,
* సుచరిత మిశ్రుడు - కాశికా భాష్యము (ఇది కుమారిల భట్టు శ్లోకవార్తిక మీద వ్రాసినది)
* [[సోమేశ్వర భట్టు]] - న్యాయసుధా (తంత్రవార్తిక మీది భాష్యము)
* భావనాథుడు - న్యాయవివేక
* [[ఆపదేవుడు]] - ఆపదేవి మఱియు మీమాంసన్యాయప్రకాశము
* రామకృష్ణ భట్టు
* మాధవ సుభోధిని
* [[శంకర భట్టు]]
* కృష్ణయజ్వనుడు
* అనంతదేవుడు
పంక్తి 117:
* రాఘవేంద్ర తీర్థ
* విజయేంద్ర తీర్థ
* [[అప్పయ్య దీక్షితులు]]
* పరుతియుర్ కృష్ణ శాస్త్రి
* రామసుబ్బశాస్త్రి
పంక్తి 130:
*[[శ్రీఆదిశంకరులు]]
*[[చార్వాకుడు]]
*[[వైశేషిక దర్శనము|వైశేషికము]]
*[[సాంఖ్య దర్శనము|సాంఖ్యము]]
*[[యోగము]]
*[[కుమారిల భట్టు]]
"https://te.wikipedia.org/wiki/మీమాంస" నుండి వెలికితీశారు