అడ్డాల అరవలరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అడ్డాల అరవలరాజు ''' ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. [[పశ్చిమగోదావరి జిల్లా]], [[కొవ్వూరు]]తాలూకా [[ధర్మవరం]]గ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.<ref name="గాదం గోపాలస్వామి">{{cite book|last1=గాదం|first1=గోపాలస్వామి|author1=గాదం గోపాలస్వామి|authorlink1=గాదం గోపాలస్వామి|title=భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు|date=ఆగస్టు 2016|publisher=శ్రీసత్య పబ్లికేషన్స్|location=అత్తిలి|accessdate=8 సెప్టెంబరు 2016|language=తెలుగు}}</ref> గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.
== వ్యక్తిగత జీవితం ==
[[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో చినవెంకటరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు అరవలరాజు. 8వ తరగతి వరకు చదువుకున్న ఆయన, వారసత్వ భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు. అరవలరాజు గ్రామ పెద్దగా కూడా వ్యవహరించేవారు.
"https://te.wikipedia.org/wiki/అడ్డాల_అరవలరాజు" నుండి వెలికితీశారు