అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా (2) using AWB
పంక్తి 15:
| spouse = [[పి.ఆదినారాయణరావు]]
}}
అభినవ సీతమ్మ గాసీతమ్మగా ప్రసిద్ధి చెందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు 24]], [[1927]] - [[జనవరి 13]], [[2014]]) 1950-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి మరియు నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి |url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]</ref>.
 
==బాల్యం==
అంజలీదేవి [[1927]], [[ఆగష్టు 24]]న [[తూర్పు గోదావరి జిల్లా]], [[పెద్దాపురం]] లో జన్మించింది <ref name="IMDB dec 8">{{cite web|title=Anjali Devi|url=http://www.imdb.com/name/nm0222432/|publisher=IMDB|accessdate=8 December 2012}}</ref>. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు [[సి. పుల్లయ్య]] ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.<ref>http://www.dnaindia.com/entertainment/report-i-feel-i-ve-lost-my-mother-chandramohan-on-anjali-devi-1950943</ref>
 
==చిత్ర సమాహారం==
===నటిగా===
 
1936లో [[రాజా హరిశ్చంద్ర]]లో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత [[కష్టజీవి]]లో నాయిక గానాయికగా నటించింది. [[లవకుశ]]లో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.<ref>http://www.thehindu.com/news/cities/chennai/veteran-actor-anjali-devi-dead/article5574548.ece</ref> [[సువర్ణసుందరి]], [[అనార్కలి]] లో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. [[బృందావనం]](1992), [[అన్న వదిన]](1993) మరియు [[పోలీస్ అల్లుడు]](1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.
 
===నిర్మాతగా===
{{main|అంజలీ పిక్చర్స్}}
[[అనార్కలి]] (1955) లో అంజలీదేవి నాయికగా [[అక్కినేని నాగేశ్వరరావు]] జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత [[భక్త తుకారాం]] (1973) మరియు [[చండీప్రియ]] (1980) నిర్మించింది. [[చండీప్రియ]] లో [[జయప్రద]] నాయికగా [[శోభన్ బాబు]] మరియు [[చిరంజీవి]] లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు