"అరుణాచల్ ప్రదేశ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), ను → ను (3), గా → గా , తో → తో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), ప్రథాన → ప్రధాన (2), కలవు. → ఉన్నాయి. (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), ను → ను (3), గా → గా , తో → తో using AWB)
}}
 
'''అరుణాచల్ ప్రదేశ్ (अरुणाचल प्रदेश)''' (''Arunachal Pradesh'') [[భారత దేశము]]లోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని [[టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము]]లో భాగమని [[చైనా]] వాదన. <!--claim-->. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో [[అక్సాయి చిన్]] తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన [[అస్సాం]] రాష్ట్రము, ఆగ్నేయాన [[నాగాలాండ్]], తూర్పున [[బర్మా]], పశ్చిమాన [[భూటాన్]] సరిహద్దులుగా ఉన్నాయి. [[ఇటానగర్]] రాష్ట్ర రాజధాని.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన [[మెక్‌మెహన్ రేఖ]]ను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 [[పిన్యిన్]]:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) [[కోన కౌంటీ]], [[లుంఝే కౌంటీ]], [[నంగ్ కౌంటీ]], [[మైయిన్లింగ్ కౌంటీ]], [[మేదోగ్ కౌంటీ]], మరియు [[ఝాయూ కౌంటీ]]. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక [[వాస్తవాధీన రేఖ]] ను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.
 
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతము గాప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము [[1987]] వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.
 
== చరిత్ర ==
ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు.
 
'''అపతానీ ''' అనే తెగకు చరిత్ర గురించిన అవ్గాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాధలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు క్రీ.పూ. 500, క్రీ.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్‌మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. [[1858]] లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు.
 
పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి.
 
[[1913]]-[[1914|14]] లో బ్రిటిషు అధికారి, సర్ [[హెన్రీ మెక్‌మెహాన్]] [[సిమ్లా]] లో జరిగిన ఒక సమావేశంలో [[భారత్]] [[చైనా]]ల మధ్య 550 మైళ్ళ పొడవైన ఒక సరిహద్దు రేఖను ప్రతిపాదించాడు. అదే [[మెక్‌మెహాన్ రేఖ]]. కానీ [[1947]] లో చైనా ఈ సరిహద్దు రేఖను తిరస్కరించి, అసలా రేఖను ఎప్పుడూ అంగీకరించలేదని [[1929]] నాటి ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లోని మాపును ఉదహరిస్తూ వాదించింది. ఆ మాపులో సరిహద్దు రేఖ ఏకంగా అస్సాం లోని మైదాన ప్రాంతం వద్ద గుర్తించబడి ఉంది. ఈ వివాదాన్ని సాకుగా తీసుకుని, [[1959]] [[ఆగష్టు 26]] న చైనా సైనికుల గుంపు ఒకటి మెక్‌మెహాన్ రేఖను దాటి భారత భూభాగంలోకి కొన్ని మైళ్ళు చొచ్చుకు వచ్చి, లాంగ్‌జు వద్దగల ఔట్‌పోస్టును పట్టుకుంది. [[1961]] లో దీన్ని వదలి వెనక్కి వెళ్ళినా, తిరిగి [[1962]] లో ససైన్యంగా చొచ్చుకువచ్చి, [[భారత చైనా యుద్ధం|భారత చైనా యుద్ధానికి]] తెర లేపింది. ముందు భూటాన్ సరిహద్దుకు దగ్గరగా గల తాంగ్లా, తవాంగ్ ల వద్ద దాడి చేసి, తరువాత మొత్తం సరిహద్దు రేఖ పొడవునా దాడి చేసింది. అనేక చోట్ల బాగా లోపలికి చొచ్చుకు వచ్చారు. అయితే, వెనక్కి, మెక్‌మెహాన్ రేఖ వద్దకు తిరిగి వెళ్ళిపోవడానికి ఒప్పుకుని, [[1963]] లో యుద్ధ ఖైదీలను వదలిపెట్టారు. అస్సాం మైదాన ప్రాంత పరిరక్షణలో భారత సంసిద్ధత, భారతీయ వైమానిక దళ పటిమ, చైనీయులకెదురైన ప్రతికూల పరిస్థితులు దీనికి కారణంగా భారత్ చెప్పుకోగా, కేవలం రాజకీయ కారణాల వల్లనే వెనుదిరిగామని చైనా చెప్పుకుంది.
 
ఈ యుద్ధం తరువాత అప్పటి వరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం అస్సాంలో భాగమైంది. చైనాతో ఉన్న ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో ఉంచుకుని 1987 లో అరుణాచల్ ప్రదేశ్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను ఇచ్చారు. కానీ చైనా దీన్ని గుర్తించలేదు.
అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్థానిక తెగలలో [[ఆది (తెగ)|ఆది]], [[నిషి (తెగ)|నిషి]] మరియు [[మోన్పా]] తెగలు ప్రధానమైనవి.
 
రాష్ట్రములో అక్షరాస్యత శాతము 1991 లో ఉన్న 41.59% నుండి 54.74% కు పెరిగినది. ప్రస్తుత గణన ప్రకారము 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.
 
రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగము ప్రజలు [[డోన్యి పోలో]] మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు [[భౌద్ధ మతము]] మరియు [[హిందూ మతం]]నకు చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ మరియు ఇస్లాం మతస్థులు.
 
== రాజకీయాలు ==
అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి [[pema khandu]] నాయకత్వమున [[అరుణాచల్ కాంగ్రెస్]] పార్టీ అధికారములో ఉంది. [[అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి)]], [[కాంగ్రెస్ (డోలో)]] మరియు [[పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్]] లు రాష్ట్రములోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.
 
== రవాణా ==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1958524" నుండి వెలికితీశారు