ఇక్బాల్ పాష: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాధ్యుల → బాధ్యుల, , → , (2), , → , , కు → కు (2) using AWB
పంక్తి 36:
}}
 
'''ఇక్బాల్ పాషా''' అను ఈ కవి, రచయిత [[మహబూబ్ నగర్ జిల్లా]] , [[కొల్లాపూర్]]కు కు చెందినవారు. 'ఉజ్వల్ ' పేరుతో రాస్తుంటారు. వీరి తల్లిదండ్రులు ఖాజాబీ, మహ్మద్ ఇబ్రహీం సాహెబ్. ఇక్బాల్ గారు 1981లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, కొల్లాపూర్ లోని నవోదయ పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం [[గద్వాల]] మండలం అనంతాపురంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తూ, గద్వాలలో స్థిరపడ్డారు.
 
==కథకుడిగా ఇక్బాల్ ==
కళాశాలలో చదివే రోజుల నుంచే సాహిత్య రచనను మొదలు పెట్టారు. 1977 లో 'ఎవరికి సొంతం వాడిన వసంతం' పేరుతో మొదటి కథను రాశారు. 1992లో 'ఆటా' వారు నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ' ఎటు చూసినా వాడే ' కు ప్రత్యేక బహుమతి వచ్చింది. అమెరికా నుండి వెలువడే ' అమెరికా భారతి ' లోనూ ఈ కథ అచ్చయింది. వీరి కథలన్నీ సామాజిక సమస్యల నేపథ్యంగా రాసినవే. గట్టు మండలంలో నెట్టెంపాడు రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలపై రాసిన ' కాల్వ మింగిన ఊరు ', పోలేపల్లి సెజ్ సమస్యపై రాసిన ' కఫన్ ' కథలు వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1985 నుంచి వరుసగా రాస్తూ వచ్చిన కథలతో 2011 లో [[ కఫన్]]<ref> ఇక్బాల్, కఫన్, పాలమూరు ప్రచురణలు, 2011</ref> అను పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. విరసం వారి 'కథల పంట' లో, ప్రజా సాహితీ, అరుణతార పత్రికలో వీరి కథలు ముద్రించబడ్డాయి.
== కవిగా ఇక్బాల్ ==
1977 లో తొలిసారి 'దేవుడికో లేఖ' పేరుతో దీర్ఘ కవిత రాశారు. 1984 లో గద్వాలలో జరిగిన విరసం రాష్ట్ర మహాసభలలో [[స్పందన]] పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. దీనిని అప్పటి విరసం సభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన సాగర్ గారు ఆవిష్కరించారు. వీరి 'తుఫాను ' కవితకు రాష్ట్ర స్థాయి కవితల పోటిలో మొదటి బహుమతి వచ్చింది. ' జర్మినేషన్ ' పేరుతో వీరు రాసిన కవిత [[స్కైబాబ]] గారి సంపాదకత్వంలో వెలువడిన ' మునుమ 'లోనూ చోటు దక్కించుకుంది. 1978 నుండి 2010 వరకు తాను రాసిన వాటిలో ఉత్తమమైన ఓ 88 కవితలతో [[సేద్యం]]<ref>ఇక్బాల్, సేద్యం, పాలమూరు ప్రచురణలు, 2011</ref>
పేరుతో ఓ కవితా సంపుటిని 2011 లో వెలువరించారు. [[పాలమూరు అధ్యయన వేదిక]] కు జిల్లా భాధ్యులుగాబాధ్యులుగా పని చేస్తూ వివిధ సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ఈ వేదికలో పని చేస్తున్న ఇతర కవులు [[పరిమళ్]] , [[ ఉదయమిత్ర ]] లతో కలిసి [[ దుఃఖాగ్నుల తెలంగాణ ]]<ref>ఇక్బాల్, పరిమళ్, ఉదయమిత్ర, దుఃఖాగ్నుల తెలంగాణ, పాలమూరు ప్రచురణలు,2009 </ref> అను కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరు ఉదయమిత్రతో కలిసి పాలమూరు జిల్లాలోని పోలేపల్లి సెజ్ ( ప్రత్యేక ఆర్థిక మండలి) సమస్యలపై రాసిన కొన్ని కథలు, కవితలతో కలిపి [[ఓడిపోలే...పల్లె ]]<ref>ఉదయమిత్ర, ఇక్బాల్, ఓడిపోలే...పల్లె, పాలమూరు ప్రచురణలు,2009</ref> అను పుస్తకాన్ని వెలువరించారు. ఇంకా బాల గేయాలు, కరువు పాటలు, ఉపాధ్యాయ ఉద్యమ గీతాలు కూడా రాశారు.
 
== నటుడిగా ఇక్బాల్ ==
పంక్తి 54:
{{మూలాలజాబితా}}
{{పాలమూరు జిల్లా కవులు}}
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా వర్తమాన కవులు]]
[[వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:పాలమూరు జిల్లా కథా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/ఇక్బాల్_పాష" నుండి వెలికితీశారు