ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → (, లో → లో (6) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Eiffel Tower 20051010.jpg|thumb|right|300px|ఐఫిల్ టవర్]]
[[ఈఫిల్ టవర్|'''ఐఫిల్ టవర్]]''' ([[ఫ్రెంచి]]: Tour Eiffel, /tuʀ ɛfɛl/) [[ప్యారిస్]] లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప [[గోపురం]]. ఇది [[ఫ్రాన్సు]]కు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం.
== పరిచయం ==
 
[[దస్త్రం:Tour Eiffel - 20150801 15h30 (10621).jpg|thumbnail]]
 
దీనిని రూపొందించిన ఇంజనీరు [[గుస్టావ్ ఈఫిల్]] పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/tour_monde.html |title=ప్రపంచ చారిత్రాత్మక స్థలంగా ఈఫిల్ టవర్}}</ref>. [[1889]] లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000 (ఇరవై కోట్లు) మందికి పైగా దీన్ని సందర్శించారు <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/frequentation.html |title=1889 నుంచి సందర్శించిన యాత్రికుల సంఖ్య}}</ref> . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది [[2006]] లో సందర్శించారు.<ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/structure/page/chiffres.html |title=ఈఫిల్ టవర్ గురించిన కొన్ని గణాంకాలు}}</ref>. దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.
 
ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.
పంక్తి 11:
== చరిత్ర ==
[[దస్త్రం:Tour_Eiffel,_July_1888.jpg|thumb|right|300px|నిర్మాణంలో ఈఫిల్ టవర్]]
ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో [[ఫ్రెంచి విప్లవం]] వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో [[బార్సిలోనా]] లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.
 
మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.
పంక్తి 28:
 
== ముఖ్య సంఘటనలు ==
* [[సెప్టెంబరు 10]], [[1889]] లో [[థామస్ అల్వా ఎడిసన్]] దీనిని సందర్శించి ఈఫిల్ కు తన ప్రపంచంలో అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకుగాను తన అభినందనలు తెలియజేస్తూ అక్కడి గెస్ట్ బుక్ లో సంతకం చేశాడు.
* [[1902]]లో మెరుపుల ప్రభావంతో టవరు 100మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నది. టవరును కాంతితో నింపే కొన్ని విద్యుద్దీపాలను మార్చవలసి వచ్చింది.<ref name=Flammarion>"Thunder and Lightning", Camille Flammarion, translated by Walter Mostyn, published in 1906.</ref>
* [[1910]]లో [[థియోడర్ ఉల్ఫ్]] దీనిని సందర్శించి టవర్ ఆడుగున విడుదలయ్యే ఉష్ణ శక్తిని మరియు టవర్ పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. ఈ అంచనాల మూలంగానే ఆయన [[కాస్మిక్ కిరణాలు|కాస్మిక్ కిరణాలను]] కనుగొన్నాడు.<ref name=Wulf>Wulf, Theodor. ''Physikalische Zeitschrift'', contains results of the four-day long observation done by Theodor Wulf while at the top of the Eiffel Tower in 1910.</ref>
* [[1930]]లో [[న్యూయార్క్]] నగరంలో క్రిజ్లర్ భవంతిని నిర్మించడంతో ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాలలో మొదటి స్థానాన్ని కోల్పోయింది.
* [[జనవరి 3]], [[1956]]లో జరిగిన ఒక [[అగ్ని]]ప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతిన్నది.
* [[1957]] లో టవర్ పైభాగాన ప్రస్తుతం ఉన్న [[రేడియో]] యాంటెన్నాను అమర్చారు.
 
== నమూనాలు ==
"https://te.wikipedia.org/wiki/ఈఫిల్_టవర్" నుండి వెలికితీశారు