ఉత్తరాఖండ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (5), ( → (, ఉన్నది. → ఉంది. (2), లో → లో , లు → లు using AWB
పంక్తి 25:
}}
 
'''ఉత్తరాఖండ్''' ([[హిందీ]]:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు '''ఉత్తరాంచల్''' గా పిలవబడినది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. [[ఉత్తరప్రదేశ్]] , [[హిమాచల్ ప్రదేశ్]]లు లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన [[చైనా]] ([[టిబెట్]]) , [[నేపాల్]] దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని [[డెహ్రాడూన్]]. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం [[నైనిటాల్]] లో ఉన్నదిఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న [[గైర్సాయిన్]] అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.
 
ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని [[ఘఢ్వాల్]] అనీ, తూర్పు ప్రాంతాన్ని [[కుమావూ]] అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి) , వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన [[గంగా నది|గంగా]], [[యమున|యమునా]] నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్ధికవనరు. బ్రిటిష్ కాలం నుండి [[ముస్సోరీ]], [[ఆల్మోరా]], [[రాణీఖేత్]]‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా [[హరిద్వార్]], [[ఋషీకేశ్]], [[బదరీనాధ్]], [[కేదారనాధ్]] వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.
పంక్తి 37:
 
== భౌగోళికము ==
ఉత్తరాఖండ్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉన్నదిఉంది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూస్వరూపమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండల వాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలు మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి.
 
* 3000 - 3500 మీటర్ల ఎత్తున: హిమాలయ గడ్డి మైదానాలు, ఇంకా ఎత్తైన చోట్ల టండ్రా మైదానాలు
పంక్తి 56:
== గణాంకాలు ==
[[దస్త్రం:Uttaranchal districts.png|thumb|250px|right|ఉత్తరాఖండ్ జిల్లాలు]]
* మొత్తం విస్తీర్ణం: 51, 125 చదరపు కి.మీ.
:పర్వత ప్రాంతం: 92.57%
:మైదాన ప్రాతం: 7.43%
పంక్తి 65:
:అక్షాంశము: ఉత్తరం: 28° 53' 24" నుండి 31° 27' 50"
 
* మోత్తం జనాభా: 7, 050, 634 (పురుషులు, స్త్రీల నిష్పత్తి = 1000 : 976)
:పురుషులు % 51.91
:స్త్రీలు % 48.81
పంక్తి 73:
 
* అక్షరాస్యత 65%
 
* గ్రామాలు: 15620
 
* నగరాలు, పట్టణాలు: 81
 
* రైల్వే స్టేషన్లు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్
 
* విమానాశ్రయాలు : పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్
 
* ముఖ్యమైన పర్వతాలు ( సముద్ర మట్టం నుండి ఎత్తు)
: గౌరీ పర్వత్ (6590), [[గంగోత్రి]] (6614), [[పంచ్ చూలి]]( 6910), [[నందాదేవి]] (7816), [[నందాకోట్]] (6861), [[కామెట్]]( 7756), [[బద్రీనాధ్]] (7140), [[త్రిశూల్]] (7120), [[చౌఖంబా]](7138), [[దునాగిరి]] (7066)
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్" నుండి వెలికితీశారు