కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

1913 ను 1913 గా మార్చాను
పంక్తి 15:
 
=== భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు ===
క్రీ. శ. 1913వ1913 (1813?)వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి [[పంజాబ్]]‌పాలకుడు మహారాజా [[రంజిత్‌ సింగ్]]‌దీన్ని సొంతం చేసుకున్నాడు. చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ [[లార్డ్ డల్హౌసీ]] దీన్ని [[విక్టోరియా రాణి]]కి బహుమతిగా ఇప్పించాడు. రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది. సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనభై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది. దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.
 
తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.
"https://te.wikipedia.org/wiki/కోహినూరు_వజ్రం" నుండి వెలికితీశారు