కాంచన: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
పంక్తి 2:
'''కాంచన''' ([[ఆంగ్లం]]: Kanchana) [[తెలుగు సినిమా]] నటీమణి.
 
సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే [[భరత నాట్యము]] మరియు [[సంగీతము]]లో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె [[బ్రహ్మచారిణి]] గా జీవితాన్ని గడిపింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించినది.
 
1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు [[శ్రీధర్]] ఈమెను చూసి [[ప్రేమించి చూడు]] సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. 1965 సంవత్సరం మధుసూధనరావు గారి [[వీరాభిమన్యు]] లో కథానాయిక ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. తర్వాత [[కె.విశ్వనాథ్]] దర్శకత్వంలో ఆత్మ గౌరవంలో పోషించిన నాయిక పాత్రలో గ్లామర్ తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులు లభించాయి. హీరో [[కృష్ణ]]తో నటించిన [[అవే కళ్ళు]], నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రస్ లో గ్లామరస్ స్టార్ గా కనిపించి ఓ రకమైన క్రేజ్ క్రియేట్ చేశారు. కాంచన సాంఘిక చిత్రాలే కాదు [[దేవకన్య]], అందం కోసం పందెం, [[శ్రీకృష్ణావతారం]] వంటి జానపద, పౌరాణిక చిత్రాలలో మంచి నటనను ప్రదర్శించారు.
 
[[మనుషులు మారాలి]], [[మంచి కుటుంబం]] చిత్రాల్లో కథకు కీలకమయిన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను [[కళ్యాణ మండపం]]లో పొషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడంలో వచ్చిన 'గజ్జె పూజ'. ఒక వేశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మథనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చమర్చాయి. హీరోయిన్ గా రిటైరైన తర్వాత [[ఆనంద భైరవి]] చిత్రంలో మంచి పాత్ర పోషించారు.
"https://te.wikipedia.org/wiki/కాంచన" నుండి వెలికితీశారు