విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==జగద్గురువుల గొప్పతనం==
విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు [[కాశీ]] వెళ్ళాడు. అదే సమయంలో విద్యాతీర్థస్వామి లంభిక యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తన గురువైన విద్యాతీర్థ స్వామి సమాధిపై బ్రహ్మాండమైన విద్యాశంకర దేవాలయం నిర్మాణంను భారతీకృష్ణతీర్థ స్వామి ప్రారంభించాడు. బుక్కరాయలు, హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు.హరిహర బుక్కరాయలు విజయ పరంపరలో 1345 సంవత్సరం శృంగేరి చేరి భారతీకృష్ణుల ఆశీర్వచనాలు పొందారు. 1346 సంవత్సరములో శృంగేరికి వెళ్లి, భారతీకృష్ణతీర్థ స్వామి దర్శనం చేసుకొని కొంత భూమిని శ్రీపాదులకు దానంగా ఇచ్చారు.
 
విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరికి[[శృంగేరి]]కి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.
 
==విద్యారణ్యుడి గురించి==
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు