కొత్తపల్లి జయశంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి 117.199.237.251 (చర్చ) చేసిన మార్పులను Sfic యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , (2), లో → లో (2), కు → కు , గా → గా (2) using AWB
పంక్తి 36:
| weight =
}}
[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ '''కొత్తపల్లి జయశంకర్''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]] లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]] గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టి ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011, జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.
 
==బాల్యం==
[[1934]] , [[ఆగస్టు 6]] న [[వరంగల్‌]] జిల్లా, [[ఆత్మకూరు]] మండలం [[అక్కంపేట]] లో జయశంకర్‌ జన్మించాడు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]] గా మిగిలిపోయాడు.
 
==ఉద్యోగ జీవితం==
బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని [[సీకేఎం కళాశాల]] ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు [[కాకతీయ విశ్వవిద్యాలయం]] రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.
 
==అధ్యాపకుడిగా..==
పంక్తి 48:
 
==తెలంగాణా ఉద్యమంలో==
1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.సి.ఆర్]] కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. [[తెలంగాణా]] రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవాడు.
 
విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.
తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.
 
==చివరిమాటలు ...భవిష్యత్ తెలంగాణ==
పంక్తి 89:
*http://www.telangana.org/Papers/Article10.pdf
{{వరంగల్ జిల్లా విషయాలు}}
 
[[వర్గం:1934 జననాలు]]
[[వర్గం:2011 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కొత్తపల్లి_జయశంకర్" నుండి వెలికితీశారు