కథలు గాథలు (దిగవల్లి శివరావు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రధమ → ప్రథమ, బాగము → భాగము , → (54), , → , (3), కలవు. → ఉన్నాయ using AWB
చి clean up, replaced: కధ → కథ (25) using AWB
పంక్తి 2:
 
== రచన నేపథ్యం ==
దిగవల్లి వేంకటశివరావు వృత్తిపరంగా [[న్యాయవాది]] అయినా చారిత్రికాంశాలు, వాటి పరిశోధనపై చాలా ఆసక్తి కలిగివుండేవారు. 96 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని 60 చారిత్రిక గ్రంథాల రచనలో ఫలవంతం చేసుకున్నారు. ఆయన తాను చారిత్రిక పరిశోధన చేస్తున్న కొద్దీ లభించిన వివిధ విచిత్రమైన, సామాన్యంగా ఎవరికీ తెలియని విశేషాలను, వింతలను ఈ గ్రంథంగా రచించారు. 1942 నుండి ఒక దశాబ్దంపాటు భారతిలోను, ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలలోనూ రాసినవి ఒక పుస్తకంగా 1944లో ముందు ప్రచురితమైంది. 1945లో రెండవభాగం ప్రచురించారు. 1947 కల్లా నాలుగు భాగాలు ప్రచురింపబడ్డాయి. 1954 [[వెంకట్రామా అండు కో]] వారిచే ముద్రించబడిన రెండవ కూర్పు వెలువడింది. అటుతరువాత 2010 లో [[విశాలాంధ్ర పబ్లింషింగ్ హౌస్]] [[హైదరాబాదు]] వారిచే ముద్రింపచేసి గ్రంధకర్త గారి ప్రథమ కుమారుడు కీ.శే దిగవల్లి వెంకటరత్నంగారు(1936-2010) ఈ పుస్తకము మూడవ కూర్పు వెలువడించారు. గ్రంధకర్త గారి ప్రతి ముద్రితగ్రంధములోను చివర వారి అముద్రితగ్రంధముల జాబితాను జతపరిచారు. వాటిలో కధలుకథలు-గాధలు 5,6 భాగములు 400 పుటలు అని వున్నది. అంతేకాక, 1947 లోనే వెలువడిన నాలుగవ భాగము మొదటి కూర్పు చివరి పుటలో 5,6 భాగములుగా రావలసిన 38 వ్యాసముల జాబితా 1947 లోనే గ్రంధకర్త ప్రచురించారు. మొదటి నాలుగు భాగములు చదినిన చదువరులు అముద్రితము గాయున్న5,6 భాగములు కూడా విలువైనదని ప్రచురించమని కోరటం జరిగింది. గ్రంధకర్తగారి మూడవ కుమారుడు డా. దిగవల్లి రామచంద్ర ఆయా వ్యాస ప్రతులకోసము అన్వేషణ చేయగా 1947 తదుపరి అనేక చారిత్రక వ్యాసములు అనేక పత్రికలలో ప్రచురించినవి గూడా 5,6 భాగములుగా ప్రచురించతలచినారని గ్రంధకర్త చేతివ్రాత ప్రతులను బట్టి, వారు తయారుచేసిన మూడునాలుగు జాబితాలను బట్టి 2014 లో తెలుసుకుని ప్రయత్నించగా 114 వ్యాసములు లభించినవి. వాటిని 5,6 భాగములుగా పుస్తకరూపముతీసుకు వచ్చుటకు గ్రంధకర్త గారి మనుమడు, అమెరికా వాసి,డా దిగవల్లి శివరావుతో కలసి ముద్రంచుటకు 2015 చివరిలో ఏర్పాటు చెసియున్నారు. త్వరలోనే 5,6 భాగములు గూడా వెలువడగలవు. రాబోయే 5,6 భాగములలోని వ్యాసముల క్లుప్తమైన సారాంశములు ఈ క్రింద సమకూర్చబడగలవు. ఈ పుస్తకము మొదటి భాగములో 13 వ్యాసములు, రెండవభాగములో 16 వ్యాసములు, మూడవభాగములో 10 వ్యాసములు, నాలుగన భాగములో19 వ్యాసములు మొత్తం 58 వ్యాసములున్నవి. అముద్రితముగానుండిన 5,6 భాగములు పుస్తకరూపము దాల్చినచో దాదాపుగా 114 వ్యాసములుతో వెలువడగలదు.
 
== ఇతివృత్తం ==
పంక్తి 22:
రెండవ భాగము ప్రచురణ-ముద్రణ వివరములు: "అన్ని హక్కులు గ్రంధకర్తవి వెల రు 1-4-0. గ్రంధ కర్త పర్మిటు నెం. 63/44 రు. బెజవాడ ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షర శాలయందు అ.వెేంకటరత్నం, M.Sc గారిచే ముద్రించబడియె. P.I.C. NO.K.6. 1000--7-9-45 " ఈ రెండవభాగములోగల 16 వ్యాసముల విశేషములు క్లుప్తముగా :
* మొదటి రెండు వ్యాసములూ అపూర్వమైన [[వజ్రము]]ల చరిత్రలు. ప్రధానంగా "కోహినూరు" మరియు "పిట్టు(రీజంటు)" వజ్రములు చరిత్రలు. మొదటిది మొగలాయి రాజవంశీయుల చరిత్రతో మిళతమైనది. రెండవది ఆంగ్లేయుల పరిపాలనలో దక్షిణభారతదేశమునకు గవర్నరు గాపనిచేసిన పిట్టు దొరగారి చరిత్రతో మిళితమైనది. 787 క్యారట్ల విలువగల "కోహినూరు" వజ్రమున క్రీ.శ 1300 సంవత్సరమునుంచీ చరిత్రకలిగి గుంటూరు సీమలోని సత్తెనెపల్లి గ్రామము లోని వజ్రపు గనిలో దొరికిన దనినూ ఆ వజ్రపు చరిత్రతో మిళితమై 1526-1707 మధ్య పరిపాలించిన మొగలాయి చక్రవర్తుల చరిత్ర నైపుణ్యముగా వర్ణించ బడినది ఈ మొదటి వ్యాసములో. రెండవది "పిట్టు" వజ్రము "రీజంటు" వజ్రమని ప్రసిధ్ధి గాంచి క్రీ.శ 1701 లో బెజవాడకి 12 మైళ్ళ దూరములోనున్న పరిటాల గ్రామములో దొరికినదని వివరించబడింది
* ఆంగ్ల పరిపాలనా కాలములో 18-19 శతాబ్దపు చరిత్రలో దుభాషి (ద్విభాషికి రూపాంతరమైన మాట) మరియూ మున్షీ అనే పలుకు బడిగలిగిన పదవులలో పనిచేసిన తెలుగు వారు దుబాషి లంగరు పాపయ్య, మున్షీ నవ కృష్ణ దేవ్ ల వృత్తాంతముతో మిళితమైన ఆంగ్ల ప్రభుత్వపరిపాలకుల, మొగలాయి చక్రవర్తుల సుబేదారుడైన నవాబు [[మీర్జాఫర్ ]], [[ఆర్కాటు నవాబు]] అనబడే కర్ణాటక నవాబు మొదలగు వారల పాత్రలు కలిగి చిత్రమైన చరిత్ర విశేషములతో కూడిన ది ఈ మూడవ వ్యాసము. 1789 నుండీ 1890 దాకా ప్రసిద్ధి లోనుండిన చరిత్రకధచరిత్రకథ లంగరు పాపయ్య అనబడిన అవధానం పాపయ్య గారిది. ఆయన నెల్లుూరు జిల్లా వాస్తవ్యుడు, మొదట చెన్నపట్టణంలో సముద్ర సుంకములు ( కస్టమ్సు) ఉద్యోగిగా చేరిన పాపయ్యగారు అప్పటి నుండీ లంగరు పాపయ్య అని ప్రసిధ్ధి గాంచి త్వరలోనే చెన్నపట్టణం గవర్నరుకు దుభాషిగా అయి అక్కడనుండి ఉన్నత ఆంగ్లప్రభుత్వ పరిపాకులైన [[రాబర్టు క్లైవు ]], [[వారన్ హేస్టింగ్సు]], [[ఆర్చిబాల్డు క్యాంబెల్ ]], [[జాన్ హాలెండ్ ]], [[ఎడ్వర్డు హాలెండ్]] సోదరులకు నమ్మిన బంటుగానుండి ఆంగ్లేయ ప్రభువుల ప్రోత్బలముతో వారికి అనుకూలముగానూ చేదోడుగాను వారికి వీరోధులైన వారిని రూపుమాపుటకు చేసిన కుతంత్రాలవల్ల అపనిందలు ఆరోపణలకు పాల్పపడిన ఆర్కాట్ నవాబు గారికి దివాన్ గా నుండిన [[రాయరెడ్డి]] గారి పైనా, [[డేవిడ్ హలిబర్టన్]] అను ఇంకో ఆంగ్లేయునిపైనా జరిగిన కుతంత్రాల కధకథ తెలుసుకున్న సుప్రసిధ్ధ నవలారచయిత [[సర్ వాల్టర్ స్కాట్]]కు ప్రేరేపణకు కారణమై వారు రచించిన [[సర్జన్సు డాటర్]] అను నవలలో పాపయ్య అను దుభాషి పాత్రను సృష్టించి రచించారు. ఆ అవధానం పాపయ్య గారిని చెన్నపట్టణంలో పాపయ్యర్ అని గూడా ప్రసిధ్ధి వారి పేరున వేపరీ పేటలో ఒక వీధి పేరు ఇప్పటికీ వున్నదట. ఇటువంటి విచిత్రమైన చరిత్రకధచరిత్రకథ కలిగినది ఈ కధలుకథలు గాధలు రెండవ భాగములోని మూడవ వ్యాసము.
* నాల్గవ వ్యాసము మేవాడు రాజనంశమును కాపాడిన 16 వ శతాబ్దపు మహిళ [[పన్నాబాయి]] పెద్దాపురం రాజవంశాన్ని కాపాడిన 17 వ శతాబ్ధపు మహిళ లక్ష్మీసోదెమ్మ ల చరిత్ర కధలుకథలు. ఇందులో మిళితమైనది చిత్తూరు దుర్గములో వసించి మేవాడ్ రాజ్యాన్ని పరిపాలించిన రాజపుత్రవంశీయుల చరిత్ర. క్రీ.శ 1535 లో చిత్తూరును రాజధానిగా చేసి పరిపాలించిన రాణాసంగుని కుమారుడైన[[విక్రమజిత్తు]] పరిపాలనాకాలములో వారి కుటుంబ మొత్తమును అతని శత్రువులు హతమార్చిన సందర్బములో అప్పటిలో విక్రమజిత్తు సవతి తమ్ముడు ఉదయసింగ్ తల్లిలేని పిల్లవాడైనందన అతనిని దాదిగా పెంచి అతనిని శత్రువులబారినుండి రక్షించుటకు ఉదయసింగ్ ఈడువాడే అయిన తన సొంత కొడుకునే బలిచేసుకున్న అద్బుతమైన సాహస చరిత్ర కధకథ పన్నాబాయి చరిత్ర కథ. అలాంటి సాహస చరిత్ర కధేకథే ఇంకోటి లక్ష్మీసోదెమ్మ అనే తెలుగు మహిళ. క్రీ.శ 1571 నుండీ ప్రసిధ్ధి గాంచిన ఇప్పటి తూర్పుగోదావరి జిల్లా లోని [[పెద్దాపుర సంస్థానము]]ను వత్సవాయి రాజ కుటుంబము వారు పరిపాలిం చారు. 1649 నుడీ 1688 వరకూ పరిపాలించిన "[[జగపతి రాజు]]" అనే బిరుదు గ్రహించి అదే నామధేయముగా ప్రసిధ్ధమై[[వత్సవాయి పినరాజు]] గారి అకాలమరణానంతరము జగపతిరాజుగారి భార్య [[రాగమ్మా దేవి]]గారు 1714 నుండీ 1734 వరకూ సమర్ధతో పరిపాలించి కుమారుడైన [[తిమ్మగజపతిరాజు]]కి రాజ్యమప్పగించారు. తిమ్మగజపతిరాజు పరిపాలనా కాలములో హైదరాబాద్ నవాబు గారి సేనాపతి [[షేర్ లష్కర్]]అను హోదాలోనున్న [[రుస్తుంఖాన్]] దండయాత్రచేసి పెద్దాపురం కోట పడగొట్టలేక కపటనాటకముతో తిమ్మరాజుగారిన ఆహ్వానించి హత్యచేయగనే రాగమ్మదేవిగారితో సహా అంతఃపుర స్త్రీలు అగ్నిప్రవేశంచేయబోయే ముందుగా రాగమ్మదేవిగారు తన మనుమడు పసిబాలుడుగానున్న జగపతిరాజును ( తిమ్మగజపతిరాజుగారికుమారుడు )ను ఎలాగైన రక్షించి విజయనగర రాజ్యమునకు చేర్చి రాజవంశమును కాపాడ టుకు రాజపురోహితుని భార్య దొడ్డ ఇల్లాలు కొంపెల్ల లక్ష్మీసోదెమ్మ గారిని కోరగా లక్ష్మీ సోదెమ్మగారు చేసిన సాహస చరిత్రకధచరిత్రకథ.
*5,6,7 వ్యాసములలోని చరిత్ర కథలు [[పెనుగొండ]], తరువాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని దక్షిణహిందూ దేశమును పరిపాలించినట్టియూ. [[ఆరవీటి వంశము]] వాడునూ, ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయల వారి బంధువుడైన [[వేంకటపతి దేవ రాయలు]] గారు క్రీ.శ. 1585 నుండీ 1614 వరకూ పరిపాలించిన కాలంలో పోర్చుగీసు వర్తకవ్యాపారులు బహుమతులకు,పొగడ్తలకు ప్రసన్నుడై వారి క్రైస్తవదేవాలయలు, మఠాలు నిర్మాణమునకు, క్రైస్తవ మతాభివృధ్దికి దోహదం చేసేటట్టి అనేక సౌకర్యములను, రెండు గ్రామములను బహుకరించినట్టు ఆజ్ఞలుజారీ చేశారు.పోర్చుగీసు వారి [[జెసూటు క్రేస్తవ మత]] మఠాలు,మత ప్రచారము ముమ్మరం చేశారు.పోర్చు గీసు వారే కాక డచ్చి, ఆంగ్ల వర్తకులు కూడా వారి వారి సంస్థానములుతో మత ప్రచారము విజృంభించారు. చెన్నపట్టణందగ్గర [[శాంథోము]]లోను [[పులికాటు]] దగ్గరను మెదలుపెట్టిన వీరు తదనంతరం విజయనగర సామ్రాజ్యములోకి గూడా ప్రవేశించారు. రాయలవారి రాజధాని చంద్రగిరిలో ఒక తాలింఖానా (జిమ్నేసియం) చరిత్రలో ప్రముఖమైనది. వేంకటపతి దేవరాయలవారికి పుత్రసంతానము లేని కారణంగా వారి నలుగురు రాణీలలో వకరైన రాణి వెంకటమాంబ తన తండ్రి [[గొబ్బూరి ఓబులరాయడు]]గారి పన్నాగం ప్రకారం ఒక తంత్రం పన్ని దొంగ కాన్పుకని పొత్తిళ్లలోనున్న ఒక బ్రాహ్మణపిల్లవానిని తీసుకుచ్చితనేకన్నట్టుగాప్రకటించటం, వెంకటపతిదేవరాయలవారు ఆ పన్నాగం పసిగట్టినా పరువుప్రతిష్టలకు భంగంరాకుండా తదుపరి వైభోగ కార్యములన్నీ పైకి నడిపించి చివరకు అవసాన కాలం క్రీ.శ 1614 లో [[శ్రీరంగపట్టణము]]నకు రాజప్రతినిధిగానుండిన తన అన్నగారు[[రామరాయల]]వారి కుమారుడు శ్రీరంగరాయలకు తనతదునంతరం చంద్రగిరి రాజ్యాదిపత్యం వప్పచెప్పారు. కానీ రాణీ వెంకమాంబగారి సోదరుడు గొబ్బూరి జగ్గరాజు శ్రీరంగరాయలుని కూలద్రోసి సకుటుంబముగా ఖారాగారములో బంధించి చివరటు హత్య చేయించటము ఆ లోపలే ధర్మాత్నుడైన [[యాచమనాయడు]] గారు అతి సాహస ప్రయత్నంచెసి చెరసాలనుండి 12 సంవత్సరముల బాలుడైన శ్రీరంగనాయకుని కూమారుడైన [[రామరాయదేవరాయలు]]ను రక్షించిన మరియూ ఆ [[ఆరవీటి వంశీయుల]] పరిపాలనా కాలంలో రాజవంశములోని చిత్రవిత్రమైన కుతంత్రాలు వైషమ్యాలు, వైరాలు తోగూడిన చరిత్ర కథలు.
*క్రీ.శ 1762 - 1766 మధ్య [[మచిలీ బందరుకు]](ఇప్పటి కృష్ణాజల్లాలోని[[మచిలీపట్టణం]]([[బందరు ]]) అప్పటి[[ఉత్తర సర్కారులు]]లోని అతి ప్రాముఖ్యమైన సర్కారు. ఆంగ్లేయ కంపెనీ ముఖ్య సభాపతి గానుండి న [[జాన్ ఫయి బస్]] అనే దొర గారి కాలంలో వారికి [[దుభాషిగా]] నుండిన [[కాండ్రేగుల జోగిపంతులు]]కు [[దివిసీమ]]లో [[జాగీరులు]] సంపాదించారు. ఒక సారి [[పెద్దాపుర సంస్థానం]] పరిపాలించే[[వత్సవాయి రాజవంశ]] పు[[తిమ్మజగపతి రాజుగారు]] మచిలీబందరు వచ్చి జోగిపంతులుగారింటికి వచ్చినప్పుడు జోగిపంతులు అవమానించటం తత్ఫలితముగా జగపతిరాజుకారు తానూ హిందుస్తానీ ఆంగ్లం చదునుకున్నవాడైనందున దుభాషిగా మచిలీబందరులో ఆంగ్లేయ దొరగారి సమ్మతితో నియమించబడ్డారు జోగిపంతులుగారి ఏకఛత్రాదిపత్యమును హతమార్చి అహంకారపతనంచేయడం మొదలగు చరిత్ర కధలుతోకథలుతో గూడినది ఈ 9 వ వ్యాసము.
*10వ వ్యాసము నుండీ 16 దాకా ఆరు వ్యాసములు భారతదేశములో హిందువులు మంచిజరుగుతుందని నమ్మకంతో చేసేటటువంటి పూజలూ, జపాలు, మీద నమ్మకముకలిగిన మహమ్మదీయ నవాబులు భ్రాహ్మణులచేత చేయించిన పూజలు, జపాలేకాక చేతబడులు,మ్రొక్కుబడులు చేయించటం, దైవ ప్రతిష్టానం చేసిన విశేషాలు తోకూడిన చరిత్ర కధలుకథలు. క్రీ.శ 1782-1799 దాకా [[శ్రీరంగపట్నం]] రాజధానిగా చేసుకుని [[మైసూరు]]నేలినట్టియూ ఆంగ్లేయ పరిపాలకులకు సింహస్వప్నమైనట్టి [[టిప్పూ సుల్తాన్]] ( [[హైదర్ అలీ]] కుమారుడు) తన తండ్రిలాగే హిందూవులు చేయించే జపాలమీద నమ్మకముగలవాడు. శ్రీరంగపట్నం మీదకి స్వయంగా దండయాత్రచేసిన ఆంగ్ల గవర్నర్ జనరల్ [[కారన్ వాలీస్]] ఓడిపోవాలని జపాలు చేయించటం ఆ జపాలమహిమ వల్లనే కారన్ వాలీసు రెండుసార్లు ఓడిపోయాడని నమ్మినట్లుగా చరిత్రలో కెక్కినవిశేషాలు, 1749- 1795 వరకూ [[ఆర్కాట్]] నవాబుగా ప్రసిధ్ధి చెందిన [[మహమ్మదాలీవాలాజా]] నవాబుగారు [[తంజావూరు]]ను ఆక్రమించకుండా అడ్డుకుంటున్నఆంగ్లేయ గవర్నరు[[పిగట్టు]] దొర విరగడైపోవాలని చేతబడిచేయించాడనినూ దాని ఫలితముగానే ఆ పిగట్టుదొర 1776లో పదభ్రష్టుడై ఖారాగారశిక్షననుభవిస్తూ పరమిదించాడని చరిత్ర లోని ఇంకో కథ, హిందూ దేవుళ్లకు స్వయంగా మ్రొక్కుబడులు చెల్లించి,[[హైదర్ లింగం]]అని ప్రసిధ్ధి చెందిన శివలింగమును ప్రతిష్టించిన హైదరాలీ బహద్దర్ కధకథ, శ్రీరంగపట్నంలోని[[శ్రీరంగనాధ స్వామి]] దేవాలయ గోపురమును హైదర్ అలీ పునర్నిమాణము చేసిన కధకథ మొదలగునవి.
 
===మూడవభాగములోని కధలుకథలు===
మూడవభాగము ప్రచురణ తేదీ అక్టోబరు 25,1946 ప్రకాశకులు వెంకట్రామా అండ్ కో, బెజవాడ అన్ని హక్కులు గ్రంధకర్తవి. " Printed at the Vani Press and published by Venkatarama & Co., Bezwada P.I.C.No.W.G.I. Oct 1946- 1000" నెల రూ 2-0-0. మూడవభాగములో 10 వ్యాసములు ఉన్నాయి.
* "అతిరూపుని కధకథ" ఇది వక చరిత్రకధచరిత్రకథ అయిననూ సస్పెంస్ నవల లాగ రోమాంచకమైన కధకథ. ఈ కధలోకథలో చరిత్రఅంశాలు విజయనగరచక్రవర్తుల సామ్రాజ్యము వారి సామంతరాజు సేతూపతి. చక్రవర్తిసామ్రాంజ్యమునకు రాజధాని [[చంద్రగిరి]]. సామంతరాజు రాజ్య కుగ్రామము లోని వక గొప్పజ్యోతశాస్త్ర పండితుని పండిత-కుమారుడు అతిరూపుడనువానికి జ్యతిష్యమురీత్యా అర్ధాయుష్షుగా మరణించునని తెలుసుకునటం, అజ్ఞాతుడుగా మరణిద్దామని అతిరూపుడు కాశీవేపు దేశాటనపోవుచుండగా దారిన చంద్రగిరిలో ప్రాణభయపెట్టి బలవంతముగా ఇంకొక వధూవరుని స్థానమున అతనికి చక్రవర్తిగారి పండిత-కుమార్తెతో అగ్నిసాక్షిగా వివాహంకావడం. వివాహానంతరం అతను కాశీవైపు పారద్రోలబడుట, జాతకప్రకారమే అతను మరణించి తిరిగి హటయోగిచే పునర్జీవితంవచ్చి అజ్ఞాతునిగా ప్రయాణించుచున్న ఆ అతిరూపుని చక్రవర్తికుమార్తె అతని ఆచూకీ తెలుసుకోటానికి వివాహంనాడు అతను చెప్పిన వక సంస్కృత శ్లోకంను ఉపయోగించి తెలుసుకునటం.
*రెండవ వ్యాసము అయోధ్యనవాబు19వ శతాబ్దమునాటి చరిత్రకథ [[అయోధ్య]]ను పరిపాలించిన [[ఖాజీఉద్దీన్ హైదర్]] నవాబు గారితదనంతరం నవాబుగారైన అతని కుమారుడు [[నజరుద్దీన్]] గారి విచిత్ర వైభోగజీవితగాధ
*1827- 1837 మధ్య అయోధ్యను పరిపాలించిన నజరుద్దీని అను వనవాబు గారి మృగశాలలో "మల్లీరు" అను పేరుగల పందెపుటేనుగును గురించిన చరిత్రకథ.
పంక్తి 37:
* ముసల్మానుల హూలీ పండుగ 6 వ వ్యాసము. హూలీ పండుగ హిదువులతో పాటుగా మహ్మదీయపరిపాలకులైన మొగలాయి చక్రవర్తుల ప్రతినిధులు జరుపుకునిని విశేషములు అనేక చరిత్రమూలాధారములనుంచి తీసి రచించిన ఈ వ్యాసము.
*7 వ వ్యాసము క్రీ.స 1741 వంగరాష్ట్రము పరిపాలించుచున్న మొగలాయి ప్రతినిధి అలీవర్ధీ ఖాన్ రాజ్యముపై మహారాష్ట్ర సైన్యము దండయాత్రచేసినప్పడు జరిగిన చరిత్రాశములు
*గొల్ల హంపన్న అను ఈ వ్యాసములో ఆంగ్లేయుల పరిపాలనాకాలమందు జాత్యాభిమానము వలన కలిగిన పక్షపాతక దృష్టితో చేసిన విచారణలు,న్యాయస్థాన తీర్పులు అనేకం. వాటిలో ఈ గొల్ల హంపన్న కధకథ మరోకటి. పూర్తి చరిత్రమూలాధారములతో చెప్పబడిన కధకథ. చెన్నపట్నం లోగొప్ప సంచలము కలుగచేసినట్టి ఆంగ్లేయుల న్యాయవిచారణ 20వ శతాబ్ధప్రారంభముపు ఆధునిక కాలములో భారతీయలపై ఆంగ్లేయుల అన్యాయ వైఖరి చాటునది. ఆ కేసు విచారణ జరిగిన మర్నాడే ఒక ఆంగ్లేయ విలేఖరి [[ది మద్రాసు మెయిలు]] అను వార్తాపత్రికలోఆ కేసు విచారణ జరిగిన రీతిని తీవ్రముగా విమర్శించాడు.[[దివాన్ బహదూర్ పత్తి కేశవ పిళ్ళై]] గారు అప్పటిలో [[గుత్తి]]లో ప్రముఖ వకీలుగానుండిరి. [[ది హిందూ]], [[ది మద్రాసు స్టాండర్డు]] అను ప్రముఖ వార్తాపత్రికలలో తీవ్ర విమర్శలు ప్రచురించారు. 1893 అక్టోబరులో జరిగిన ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని [[గుంతకల్లు]] రైలు స్టేషన్ దగ్గరలో రైల్వే గేటు కాపరి, హంపన్న అనువానిని [[వెల్లింగటన్]] నుండి [[సికందరాబాదు]] పోవు ఆంగ్లసైనిక పటాలములో నొక సిపాయి తన రివాల్వరుతో అన్యాయముగా కాల్చి చంపిన ఘటన. హంపన్నచేసిన నేరంఏమిటంటే ఆ తుంటరి సైనికుల బారినుండి గుంతకల్లు రైలు స్టేషన్ సమీపమునుండి బాటలో పోవుచున్న అసాహాయులైన స్త్రీలిద్దరి మానము కాపడుట. ఆనాటి గుంతకల్లు కేసులో పోలీసుఅన్వేషణచేసినది గుత్తిలో పోలీసు ఇనస్పెక్టర్ గానుండిన [[మాదిరెడ్డి పాపారావు నాయడుగారు]]. గుంతకల్లులో నెలకొలుపబడిన గొల్ల హంపన్న స్మారక చిహ్నమును ఆంగ్ల దొరలు నిలిపి వేయుటకు ఎంత ప్రయత్నించిననూ సాధ్యం కాలేదు.
*పాదుషా బేగం కధకథ క్రీ.శ 1842-1847 మధ్య [[లక్నో]]ను రాజధానిగా చేసుకుని[[అయోధ్య]] రాజ్యమునేలిన [[అంజిద్ అలీషా]] గారి పట్టపురాణీ గారి అంతఃపురవైభోగ వర్ణన. అంజీద్ అలీ షా తరువాత వారి కుమారుడు [[వజీద్ అలీ షా]]గారు 1847 లో రాజ్యపరిపాలన అసమర్ధతవలన 1856 లో ఆంగ్లేయులు అతనిని పదభ్రష్టునిచేసి అయోధ్యరాజ్యమును తమ వశము చేసుకున్నారు.
*10 వ వ్యాసం హోన్నూరు ఫకీరులు. క్రీ.శ 1155 లో తెలంగాణనునేలిన కడపటి కాకతీయరాజుల కాలమునాడు అనంతపురం జిల్లాలోని పెనుకొండ లోనుండిన మహమ్మదీయ మహాపురుషుడైన ఫీర్ ఫకృద్దీన్ బావా గారి శిష్యులని చెప్పుకొని రాయలసీమ, మైసూరు,హైదరాబాదు ప్రాంతములలోని వారు. జాఫర్ (కావి)రంగు( కాషాయి రంగు) వస్త్రములు ధరించి నుదిటిపై శైవమతచిహ్నమైన గంధపు గీరలు, కుంకుమ బొట్టు, గోధుమరంగు పూసలదండలను రెండు తాయెత్తులను ధరించి, కేశఖండన చేయక, ఇత్తడితో చేసిన చేతి వ్రేళ్ళ ఆకారమును దగ్గిరనుంచుకునియుండుట ఆ హూన్నూరు ఫకీరుల కులచిహ్నములు. వారికి శ్రీశైలములనుా, పెనుగొండనూ వారి ఉపదేశ క్షేత్రములు. వృత్తిరీత్యా వారు ఉళ్ల వెంట పోయి ఎరుక చెప్పియూ,ములికలనమ్మియూ జీవనముచేశడివారు.
 
===నాలుగవ భాగములోని కధలుకథలు===
నాలుగవ భాగము ప్రచురణ తేది 1947. అన్ని హక్కులు గ్రంధకర్తవి. ప్రకాశకులు శ్రీ గూడూరి నమశివ్వాయ Printed by Mr. I.V. Ratnam M.Sc at the A.G Press and Published by G. Namassivaya, K-70-500-27-1-47 నెల రూ 2-0-0. నాల్గవ భాగములో 19 వ్యాములు గలవు
* నాలుగవ భాగములోని మొట్టమొదటి వ్యాసము "భారతవర్ష చరిత్ర సమీక్ష". ఇది మహాకవి [[రవీంద్రనాధ టాగూరు]] ఆంగ్లములో రచించి [[విశ్వభారతి]]మొదటి సంచిక 1923 లో ప్రచురించిన అమూల్య వ్యాసము "A vision of India's History"కు స్వేఛ్ఛానువాదము. వివిధ జాతి, కుల, మతములు గల భారతీయుల ఆధ్యాత్మిక దృష్టికోణములలోని అంతరార్ధములు విశదీకరించబడినవి. విభిన్నత లోని ఏకత్వం ఉన్నదన్న సిధ్ధాంతమునకు సమాధానముగా చెప్పబడిన అనేక విషయాలు (1)అద్వైతము ద్వైతము వక్కటేయనియూ, (2) వసిష్ట విశ్వామిత్రుల వైరములందు గూడా బ్రాహ్మణులు క్షత్రియులు ఇరుప్రక్కలానుండిరనియూ (3) క్షత్రియులను వధించిన పరశురాముని క్షత్రియుడైన శ్రీ రామచంద్రుడే ఓడించినను శ్రీరామచంద్రుడు సర్వమతజాతి ప్రియుడైన దేముడని (4) వైదికకర్మలను కొంతనిరసనముచేసిన భగవద్గీతను భోదించిన శ్రీ కృష్ణుడు కూడా అన్ని జాతులవారికీ ప్రియుడైనాడని, భేదాలు మనఃకల్పితమైనవే గాని జాతి భేదములు కావనియూ (5) కర్మయోగ భక్తియోగ సంప్రదాయముల వల్ల కలిగిన వివాదములు(6) మహా కావ్యములైన రామాయణ భారతముల లోని ఘటనలు, యుధ్ధములు కేవలము కారణములుగా కనిపించే కారణాలు (రావణుడు సీతనపహరించుటవలన రామాయణం, పాండవులకు రాజ్యభాగమివ్వనందున మహాభారతం)వల్ల జరుగలేదనియూ అవి ఒక మహదాదర్శనమును నిలువబెట్టుటకు జరిగిన యుధ్ధములనే సూచించున్నవనియూ(7) అలాగే ఆర్యులకూ, అనార్యులకూ గల వైరములు (8)ఆచారములు,వైదిక కర్మల వల్ల ప్రజానీకమును విడదీయు కులాచారములే ప్రధానముగా కనబడుచూ అసలైన సృష్టియొక్క ఏకత్వమునకు తోడ్పడు అంతఃశుధ్ధి ఫ్రధానమన్న విషయం మరుగునపడుచున్నదనియూ ఇంకనూ అనేక పురాణేతి హాసములలోని సారాంశములతోనూ, భారత భాగవతాలగూర్చి చిర్చించి భారతీయుల ఇతిహాసచరిత్ర సమీక్షించబడినది ఈ వ్యాసములో.
*రెండు నుండీ తొమ్మిదవ వ్యాసము దాకా ఎనిమిది వ్యాసములు ఆధ్యాత్మిక విషయాలు చరిత్ర దృష్టికోణముతో చర్చించినవి. మహాభారతేతిహాసము, అల్బెరునీ-మహాభారతము, నాగ-లింగ ప్రతిమారాధనము,ఋగ్వేదమునాటి సనాతనధర్మము,గయాసురుని కధకథ, గురుశిష్య సంప్రదాయము, తిరుపతి జైన క్షేత్రమా?, అర్చనలు ఆరాధనలు కొలువులు.[[ఉజుబెకిస్తాన్]] దగ్గిరనున్న [[ఖైవా]] (Khiva) అను దేశపు రాజ్యములోని మంత్రిగానున్న, గొప్పపండితుడైన[[అల్బెరునీ]]ని [[మహ మద్ ఘోరీ]] బంధించి హిందూదేశమునకు ప్రవాసము పంపించగా ఈ దేశములో క్రీ.శ.1017-1030 మద్యకాలంలో అల్బేరునీ గారు అరబ్బీలో రచించిన ఉద్గ్రంధములో మహా భారత కావ్యమును గూర్చి రచించారు. [[వేదం వెంకటాచలయ్య]] గారి మహాభారత కావ్యముపై చేసిన పరిశోధనా సారాంశములు గలవు. తరువాత వ్యాసము సర్పము, సర్పారాధనమును గురించి. అనేక దేశాలలో సర్పమునునొక దేవతగా పూజించటం, సర్పములను పూజించే జాతి గూడా నుండినట్లు బౌధ్ధ గ్రంధములో చప్పబడినది. [[బౌధ్ధమత]] చిహ్నాలతో పాటునాగ ప్రతిములు గుంటూరు, మహాబలిపురములోని బౌధ్ధచిహ్నములతో కలపబడినవి. మానవుల బుధ్ధి తత్వములకు ఆదిదేవతైన [[బుధ గ్రహము]] సర్పచిహ్నము తోనునన్నది. ఈజిప్టు దేశంలో హెర్మిస్సు చిహ్నంగాను,గ్రీసు దేశంలో మేర్క్యురీ చిహ్నంగాను కుండలినీ శక్తికి గూడా సర్పమేచిహ్నము. తరువాత వ్యాసములలోని సారాంశము క్లుప్తముగా. [[వ్రజము]] అనేప్రాంతము [[మదురానగరము]] దగ్గరలోనున్నది. అక్కడ కృష్ణదేవారాధనలు మహ ఘనముగా జరిగేవి. ఔరంగజేబుకు రెండువేల సంవత్సరాల ముందునుంచీ జరుగుతున్న వ్రజములో కృష్ణపూజలు జరుగురాదని ఔరంగజేబు 1658 లో నిషేదించాడు.[[ఋగ్వేదము]]నాటి[[సనాతన ధర్మము]] అను వ్యాసములో [[ఆర్యులు]] గ్రందములలో ఋగ్వేదము బహు ప్రాచీనమైనది. క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరముల క్రితం రచించబడ్డ [[పాణిని]] వ్యాకరణము లోనూ మరియూ 300 సంవత్సరముల క్రితం రచించి న [[మహాభాష్యము]] లోనూ [[మనుస్మృతి]] లోను కూడా భారత దేశములో [[ఆర్యావర్తనము]] అనబడే భూభాగము [[హిమాలయా]] పర్వతాలకీ [[వింధ్యాపర్వతాలు]]కీ మధ్యనున్నభూభాగము. గయాసురడు నూటఇరువది యోజనముల పొడవైన ఆజాను బాహుడనీ గొప్ప తపోశక్తిగల రాక్షసుడునీ తన శరీర అన్ని పుఁణ్యక్షేత్రములకన్నా అతిపత్రముగానుండేట్లు వరప్రసాదమును పొందాడనీ అతిని శరీరముపై బ్రహ్మదేవుడు యాగంచేసి అతినిని అంతమొనరించాడనీ, అతని తల యున్న ప్రదేశము ఈ నాటి బీహారులోని గయఅని చెప్పబడిన గయాసురుని కధకథ. తిరుపతి జైన క్షేత్రమా అనే వ్యాసములో అనేక జైన ఆలయాలు, బౌధ్ధఆరామాలు విష్ణు శివ క్షేత్రములగా మారినట్లుగా చరిత్రలో అనేక నిదర్శనములు కనబడుచున్నవని చెప్పబడినదీ వ్యాసములో. ఉదాహరణకొకటి ద్రాక్షారామం గర్భగుడిలో బౌధ్ధస్తూపంయొక్క గుర్తులు స్పష్టంగా కనపడుతున్నవని చెప్పబడినది అలాగే అమరావతికూడా బౌధ్ధ జైన క్షేత్రమయ్యుండి తరువాత శివక్షేత్రంగా మారింది. తిరుపతి వెంకటాచలమునకు కృతాయుగములో ఋషభాచలమని పేరుయున్నది. ఋషుభుడు జైనుల తీర్ధంకరులలో ఆదితీర్ధంకరుడు. శైవుల లోనూ వైష్ణువులలోనూ ఋుషభుడున్నాడు. అర్చనలు, ఆరాధనలు కొలువులు అను వ్యాసములో ఇవ్వబడిన మూలాధారములనేకములతో సారాంశమేమన భారత దేశములో జనుల చిత్తవృథ్తిని బట్టి ఎన్నో విధములైన అర్చనలు చేస్తున్నప్పటికీ, ఎన్నో మతములు, అనాగరక అర్చనలున్నప్పటికీ పరతత్వమొక్కటేయను సిధ్ధాంతము గల సనాతన ధర్మముయొక్క విశేషము. ఈ ఎనిమిది వ్యాసములలో గల ఆధ్యాత్మిక విశేషాలు చరిత్ర దృష్టితో ఉల్లేఖించిన అనేక మూలాధారములలో కొన్ని చెప్పక తప్పదు. [[భండార్కర్]]గారి [[దక్షిణాపధ పూర్వచరిత్ర]], [[శ్రీనివాస కళ్యాణము]],[[మల్లాది సూర్యనారాయణ శాస్త్రి]] గారి [[సంస్కృత వాజ్ఞయ చరిత్ర]], [[K.A.నీలకంఠ శాస్త్రి]] గారి [[A historical sketch of Saivism, Cultural Heritage of India]], [[వేటూరి ప్రభాకరశాస్త్రి]]గారి పీఠికతోయున్న [[శ్రీనాధ కవిసార్వభౌముని]] [[క్రీడాభిరామము]],[[పాల్కూరి సోమనాధుని]] [[బసవపురాణము]], [[పింగళి సూరన్న]]గారి [[కళాపూర్ణోదయము]] 3వ ఆశ్వాసములోని పద్యాలు, [[నెలటూరి వెంకటరమణయ్య]]గారి "The History of third Dynasty of Vijayangar: [[భిషప్ హేబర్]] గారి జర్నల్ ఇత్యాదులు.
*10 నుండీ 19 వ్యాసముల జాబితా: స్కృతానికి గ్రీకు మాతృక, పంచతంత్ర దిగ్విజయము, "కధకథ కంచికి వెళ్లింది", దేశాంతరాలలో ఆంధ్ర నాగరికత, పూర్వకాలపు తెలుగు నాటకాలు, పూర్వకాలపు నాటక ప్రదర్శనము, క్రీ.శ. 1509 నాటి కూచిపూడి భాగవతులు, తెలుగు ప్రబంధముల ప్రామాణ్యం, కర్ణాటక కవిత్రయము నన్నయ భట్టారకుడు, ఓనామాలలో జైన సంప్రదాయము. సమాప్తం
 
== మూలాలు ==