ఋతు సంహారము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. using AWB |
|||
పంక్తి 1:
ఋతు సంహారము కావ్యాన్ని కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించారు. దీనినే తెలుగు ఋతువులు అన్న మరో పేరుతో వ్యవహరిస్తారు. పలు ఋతువులు తెలుగు నాట కలిగించే ప్రకృతి మార్పులు, ప్రజల జీవితాలలోకి తీసుకువచ్చే సున్నితమైన చేర్పులు వంటివాటిని వర్ణిస్తూ రాగరంజితమైన ఈ కావ్యాన్ని ఆయన రచన చేశారు.
== రచన నేపథ్యం ==
విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఈ ఋతు సంహార కావ్యానికి మూలకథావస్తువు, కావ్యరచన విషయంలో కాళిదాసు రచించిన '''ఋతు సంహారము''' కావ్యం ప్రభావం ఉంది. ఆ ప్రభావం నేరుగా ఆయన ఎంచుకున్న కావ్యనామంపైనే కనిపిస్తోంది.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు">{{cite book|last1=చెన్నప్ప|first1=మసన|title=విశ్వనాథ సాహితీ సమాలోచనం (తెలుగు ఋతువులు)|date=సెప్టెంబరు 3, 1995|publisher=యువభారతి|location=హైదరాబాద్|edition=ప్రథమ ముద్రణ}}</ref> కానీ విశ్వనాథ సత్యనారాయణ రచనలోని వర్ణనలపై మాత్రము ఆ ప్రభావమేమీలేదు సరికదా ఆయన చిన్నతనంలో చూచిన తెలుగు వాతావరణం వర్ణనలే
== కథావస్తువు ==
తెలుగు ఋతువులు కావ్యానికి కథావస్తువు తెలుగు నాట వసంత, గ్రీష్మాది ఋతువులు ఎలా ప్రవర్తిల్లుతాయి, వాటి వల్ల ప్రజాజీవితంలో సూక్ష్మమైన భేదాలు ఎలా వాటిల్లుతాయి, ఆచార వ్యవహారాలు ఎలా వుంటవి మొదలైన విషయాలతో కూడివుంటుంది. ఇది వర్ణన ప్రధానమైన కావ్యము. కేవల ఋతువర్ణనలకే పరిమితం కాకుండా ప్రత్యేకించి తెలుగు నాట ఆయా ఋతువులు ఎలా వుంటాయన్నది రచించడం వల్ల ఈ కావ్యానికొక ప్రత్యేకత ఏర్పడింది. ఇదే పేరుగల తన కావ్యాన్ని కాళిదాస మహాకవి గ్రీష్మ ఋతువుతో ప్రారంభించగా విశ్వనాథ సత్యనారాయణ మాత్రం దీనిని వసంతంతో ప్రారంభం చేశారు. వసంత ఋతువు అందరికీ ప్రీతిపాత్రమైనదనే కాక తెలుగు వారి తొలి పండుగైన సంవత్సరాది వసంతంలోనే ప్రారంభమవడమూ కారణం కావచ్చు. తెలుగు నేల మీద పల్లె ప్రకృతిని సర్వాంగ సుందరంగా అభివర్ణించిన కావ్యంగా దీనిని పలువురు విమర్శకులు పేర్కొన్నారు.<ref name="మసన చెన్నప్ప-తెలుగు ఋతువులు" />
పంక్తి 9:
== మూలాలు ==
<references/>
[[వర్గం:విశ్వనాథ సత్యనారాయణ రచనలు]]
[[వర్గం:తెలుగు కావ్యములు]]
|