కృష్ణార్జున: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి (3), → (11), → (4) using AWB
→‎విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి. using AWB
పంక్తి 19:
ఇంగ్లీషు సినిమా 'బ్రూస్ ఆల్మైటీ' స్పూర్తితో పాతకాలపు ఫార్ములాతో పి.వాసు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తీశారు. సినిమా అంతా అతని కాలం చెల్లిన విధానమే మనకు కనిపిస్తుంది. సినిమాలో ఏ ఒక్క సన్నివేశమూ కొత్తగా కనిపించదు, వినోదాన్ని పంచదు. ఫాంటసీని మిక్స్ చేసిన సందర్భాలన్ని గందరగోళంగా వుంటాయి. నాగార్జున ఇమేజ్ ని దేవుడి పాత్రలో వాడుకోవాలని చూశారు కానీ, సన్నివేశ బలం లేకపోవడంతో తేలిపోయాయి. సినిమా ప్రారంభంలోనూ చివరిలోనూ మోహన్ బాబు అర్థం లేని సాయిబాబా గెటప్ తో కనిపించి హీరో కోసం ఓ పాట కూడా పాడేస్తాడు. తాంత్రికుడిగా నెపోలియన్ కూడా నటించాడు. సినిమాలో పలుచోట్ల జాతకాలు, విధి, సృష్టి గురించి తెగ చర్చిస్తారు. అయితే తలాతోకా వుండదు. క్లైమాక్స్ లో సృష్టి విదానాన్ని సీరియస్ గా చెప్పిన నాగార్జున, 'లేదు నేను బతికే తీరాలంటూ హీరో గట్టిగా అడిగేసరికి', 'ఎంట్రా అలా మాట్లాడుతున్నావ్' అని వేలితో విష్ణుని నెడుతూ 'పోరా' అనగానే చావుబతుకుల మధ్యనున్న అర్జున్ ఒక్కసారిగా బతికిపోవడం వింతగానే వుంటుంది. కృష్ణుడిగా నాగార్జున గ్లామర్ గా, చలాకీగా తన పాత్రను పండించారు. అయితే, ఒకసారి అతను వేసిన బికారి గెటప్ ఇబ్బందికరంగా వుంది. అర్జున్ గా విష్ణు సినిమా అంతా హెవీగా కనిపించాడు. మొదటి భాగంలో అమాయకుడిగా, బండగా వున్నాడు. రెండవ భాగంలో హుషారుగా, చక్కటి నటన ప్రదర్శించాడు. గ్లామర్ కి తప్ప మమతామోహన్ దాస్ పాత్రకు ప్రాధాన్యత లేదు. జ్యోతిష్యుడిగా బ్రహ్మానందం పాత్రను సద్వినియోగం చేసుకోలేకపోయారు. బ్రహ్మానందాన్ని బావా అని పిలిచే విష్ణుతో బ్రహ్మానందం భార్య భువనేశ్వరిని పొర్లించడం చీప్ టేస్ట్.
 
ఇందులో కొత్త విలన్ దేవ్ గిల్లి, మనోరమ, నాజర్, తనికెళ్లభరణి, ప్రేమ, సునీల్ ఇతర పాత్రలు పోషించారు. మరుదూరి రాజా మాటలు, స్టన్ శివ ఫైట్లు, వరసమార్చిన కీరవాణి పాటలు అంతంత మాత్రంగానే వున్నాయిఉన్నాయి. పాపులర్ పాట 'యమరంజు మీద వుంది పుంజు' ఇందులో రీమిక్స్ చేశారు. రీరికార్డింగ్ ఫర్వాలేదు. విష్ణు థింక్ స్మార్ట్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
 
[[వర్గం:2008 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణార్జున" నుండి వెలికితీశారు