క్రియేటివ్ కామన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (3) using AWB
పంక్తి 22:
| footnotes =
}}
'''క్రియేటివ్ కామన్స్''' ('''సీసీ''') అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని [[సంస్థ]]. సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని. <ref>{{cite web|url=http://wiki.creativecommons.org/FAQ |title=తరచూ అడిగే ప్రశ్నలు|publisher=క్రియేటివ్ కామన్స్ |date = |accessdate=20 డిసెంబర్ 2011}}</ref> ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అందుబాటులో తెచ్చింది. ఈ లైసెన్సులను వాడి రచయితలు వారి కృతులపై కొన్ని [[హక్కు]]లను సడలించి సాధారణ జనాలకు అందుబాటులోకి తేవచ్చును. ఏ హక్కులను సాధారణ ప్రజలకోసం సడలిస్తున్నారో, ఏ హక్కులను తమ వద్దనే ఉంచేసుకుంటున్నారో వేరు వేరుగా తెలపవచ్చు. ఈ విషయాలను తెలిపేందుకు విశేష చిహ్నాలతో కూడిన బొమ్మలు లేదా ఆయా హక్కులను తెలిపే పొడి అక్షరాలను వాడవచ్చు. క్రియేటివ్ కామన్స్ రచయితకున్న కాపీ హక్కులను తొలగించదు, ఆ హక్కులను మరింత వివరిస్తుంది. ''సర్వ స్వామ్యహక్కులు'' అన్న పదానికి తెర తీస్తూ, ''లిఖిత పూర్వక ముందస్తు అనుమతి'' అన్న పంథాను మార్చివేస్తూ; రచయితకూ-రచనను వాడుకునే వ్యక్తికి మధ్య సంబంధాన్ని విస్తృత పరుస్తుంది. అనగా రచనను వాడుకోవాలనుకునే వ్యక్తి అవసరమున్నపుడు రచయితను సంప్రదించి అనుమతి తీసుకునే పద్ధతి కాకుండా, రచయితే తన రచనను స్వయంగా వాడుకోవచ్చు అని ముందస్తుగా ప్రకటన చేయడం.
ఇందువలన అనవసరపు ఖర్చు, అనవసరపు సంప్రదింపులు తొలగిపోతాయి. తద్వారా రచయితకూ, వాడుకుంటున్న వ్యక్తికీ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. [[వికీపీడియా]] ఈ లైసెన్సుల్లో ఒకదాన్ని వాడుతుంది.<ref>{{cite web |url=http://wikimediafoundation.org/wiki/Terms_of_Use |title=వికీమీడియా ఫౌండేషన్ వారి వాడుక మార్గదర్శకాలు |accessdate=June 11, 2012}}</ref>
 
ఈ సంస్థ [[2001]]లో, సెంటర్ ఫర్ పబ్లిక్ డొమెయిన్ అనే సంస్థ సహాయంతో, లారెన్స్ లెసీగ్, హాల్ ఏబెల్సన్, ఎరిక్ ఎల్డ్రెడ్ ద్వారా స్థాపించబడింది.<ref>{{cite web|url=http://creativecommons.org/about/history|title=క్రియేటివ్ కామన్స్ చరిత్ర|accessdate=2011-10-09}}</ref>. ఫిబ్రవరి 2002లో క్రియేటివ్ కామన్స్ గురించిన మొట్టమొదటి వ్యాసం వెలువడింది. ఇది హాల్ ప్లాట్కిన్ అనే వ్యక్తి వ్రాసారు. <ref>{{cite news|url=http://www.sfgate.com/cgi-bin/article.cgi?f=/g/a/2002/02/11/creatcom.DTL|title=ఆల్ హెయిల్ క్రియేటివ్ కామన్స్ స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ అండ్ ఆథర్ లారెన్స్ లెసీగ్ ప్లాన్స్ ఎ లీగల్ ఇన్సరెక్షన్ |last=ప్లాట్కిన్ |first=హాల్ |work= |publisher=SFGate.com |accessdate=2011-03-08 |date=11 February 2002}}</ref>
డిసెంబర్ 2002 లో మొదటి దఫా లైసెన్సులను జారీ చేసారు. <ref>{{cite web|url=http://creativecommons.org/about/history/|title=క్రియేటివ్ కామన్స్ చరిత్ర |accessdate=2009-11-08}}</ref>
మనకు ఈనాడు తెలిసిన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులను రూపొందించిన వారిలో మోలీ షాఫర్ వాన్ హౌవెలింగ్, గ్లెన్ ఓటిస్ బ్రౌన్, నీరు పహాడియా, బెన్ అడీడా ఉన్నారు.<ref>{{cite web|url=http://creativecommons.org/press-releases/entry/3483|title=క్రియేటివ్ కామన్స్ అనౌన్సెస్ న్యూ మేనేజ్మెంట్ టీం |last=హాఫే |first=మాట్ |date=2002-09-18|publisher=creativecommons.org |accessdate=2013-05-07}}</ref>
2003లో అంతకుముందు 1998 నుండి నడపబడుతున్న ఓపెన్ కంటెంట్ ప్రాజెక్టును డేవిడ్ ఎ వైలీ క్రియేటివ్ కామన్స్ లో విలీనం చేసి, క్రియేటివ్ కామన్స్ ను పాత ప్రాజెక్టుకు రూపాంతరం అని తెలుపుతూ ఆ సంస్థ నిర్దేశకుడిగా చేరారు.<ref>{{cite web||archivedate=2003-08-02|archiveurl=http://web.archive.org/web/20030802222546/http://opencontent.org/|url=http://opencontent.org/ |title=ఓపెన్ కంటెంట్ ఇజ్ అఫీషియల్లీ క్లోజ్డ్ అండ్ దట్స్ జస్ట్ ఫైన్. (ఓపన్ కంటెంట్ అధికారికంగా మూతబడింది. ఐనా ఏం పర్వాలేదు) |publisher=opencontent.org |date=30 June 2003 |accessdate=2016-02-21 |author=డేవిడ్ ఎ వైలీ}}</ref><ref>[https://blog.creativecommons.org/2003/06/23/creativecommonswelcomesdavidwileyaseducationaluselicenseprojectlead/ క్రియేటివ్ కామన్స్ వెల్కమ్స్ డేవిడ్ వైలీ యాజ్ ఎజుకేషనల్ యూజ్ లైసెన్స్ ప్రాజెక్ట్ లీడ్] creativecommons.org (June 23rd, 2003) పై మ్యాట్ వ్యాసం</ref>
పంక్తి 35:
 
==లక్ష్యం, ప్రభావం==
[[File:GoldenNica CreativeCommons.jpg|thumb|గోల్డెన్ నికా అవార్డ్ (2004) ]]
[[File:Lawrence Lessig (9).jpg|thumb|లారెన్స్ లెసీగ్ (January 2008) ]]
[[File:Creative Commons Japan Seminar-200709-1.jpg|thumb|క్రియేటివ్ కామన్స్ జపాన్ సెమినార్, [[టోక్యో]] (2007) ]]
[[File:CC some rights reserved.svg|thumb|సీసీ కొన్ని హక్కుల భద్రం]]
[[File:Creativecommons spanien.jpg|thumb|గ్రనాడాలోని ఒక పబ్ లో ఉన్న ఒక నోటీస్. ఆ పబ్ లో వినబడే సంగీతం క్రియేటివ్ కామన్స్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉందని తెలుపుతోంది.]]
 
క్రియేటివ్ కామన్స్ కాపీలెఫ్ట్ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటంలో ముందంజలో ఉందని పరిగణిస్తారు. కాపీలెఫ్ట్ అంటే ''సర్వస్వామ్యహక్కులు నిర్బంధించే'' కాపీరైట్ అనే ధోరణికి విరుద్ధంగా మొదలైన ఒక ఉద్యమం. <ref>{{cite news| first= షరీ ఎల్. | last= బ్రొసార్డ్| title= ది కాపీలెఫ్ట్ మూవ్మెంట్: క్రియేటివ్ కామన్&శ్ లైసెన్సింగ్ | publisher= కమ్యూనికేషన్ రీసర్చ్ ట్రెండ్స్ | url=http://cscc.scu.edu/trends/v26/v26_n3.pdf | date=September 2007 | accessdate=2015-10-20}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రియేటివ్_కామన్స్" నుండి వెలికితీశారు