"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB)
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్ధ తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]] తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
 
గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి [[దాసరి రామతిలకం]]. 1938లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.
 
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
గిరిజకు 17 యేళ్ళ వయసులో తల్లి మరణించింది. ఈమె వివాహము సి. సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో జరిగింది. వివాహం తర్వాత గిరిజ సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ప్రయత్నించింది. గిరిజ భర్త సన్యాసిరాజు, విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో [[భలే మాష్టారు|భలే మాస్టారు]] సినిమా తీశాడు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్, చంద్రకళతో [[పవిత్ర హృదయాలు]] తీశారు. ఆ సినిమా కూడా విజయవంతం కాకపోవటంతో గిరిజ సంపాదించిన ఆస్తంతా కోల్పోయింది. మద్రాసు రెండంతస్థుల విశాలమైన భవనం అప్పులతో చేజారిపోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి. సొంత ఇల్లు కోల్పోయి చివరకు చిన్న అద్దెగదిలోకి మారే పరిస్థితి ఏర్పడింది. పూట గడవని స్థితికి వచ్చింది. [[రాజశ్రీ]], '[[భీష్మ]]' [[సుజాత]] వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.
 
ఈమె కూతురు [[శ్రీరంగ]], [[దాసరి నారాయణరావు]] నిర్మించిన [[మేఘసందేశం]]లో [[అక్కినేని నాగేశ్వరరావు]] కుమార్తెగా నటించింది. ఆ తరువాత సలీమాగా అనేక మలయాళం సినిమాలలో నటించి మంచినటిగా పేరు తెచ్చుకున్నది.
#[[రహస్యం (సినిమా)|రహస్యం]] ([[1967]])
#[[ఆడదాని అదృష్టం]] (1974)
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960876" నుండి వెలికితీశారు