గురువును మించిన శిష్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
==కథ==
ధర్మపాలసువర్ణగిరి మహారాజుసాంరాజ్యానికి రాజైన ధర్మపాలుడు ([[కైకాల సత్యనారాయణ]])కి ఇద్దరు కుమారులు. అతని రాజ్యంపైకి కీర్తిసేనుడు ([[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]]) దండెత్తి రాగా యుద్ధంలో పరాజయం తప్పదని తెలిసి ధర్మపాలుడు భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోతాడు. అడవిలో కాళికా దేవిని ఆరాధించే కాలకేతుడు అనే ఒక మాంత్రికుడి ([[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]]) ఆశ్రమానికి వెళతారు. కాలకేతుడు తనకు సర్వలోకాధిపత్యం కావాలని కాళికాదేవిని కోరగా ఆమె సర్వలక్షణాలు కలిగిన ఓ రాజకుమారుడికి సర్వ విద్యలు నేర్పించి తన సమక్షానికి తీసుకురమ్మంటుంది. తన ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడికి రాజకుమారులు విజయుడు, అజయుడు కనిపించేసరికి ఆనందపడతాడు. రాజు తన బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్నానని బాధ పడుతుంటే కాలకేతుడు వారిద్దరికీ తాను విద్య నేర్పిస్తాననీ అందుకు ప్రతిఫలంగా తాను అడిగినప్పుడు వారిలో ఒకరిని తనకి అప్పగించమంటాడు. తన కుమారులు విద్యావంతులవుతున్నారని రాజదంపతులు అందుకు అయిష్టంగానే అంగీకరిస్తారు.
 
రాజదంపతులు అటు వెళ్ళగానే సర్వలక్షణాలు కలిగిన పెద్ద కుమారుడు విజయుడికి అన్ని విద్యలు నేర్పడానికి నిర్ణయించి, చిన్న కుమారుడిని మాత్రం పశువుల కాపరిగా నియమిస్తాడు. ఇది చూసి మాంత్రికుడు శిష్యుడైన అనంతుడు బాధ పడతాడు. విజయుడు పెరిగి పెద్దవాడై అన్ని కళలలోనూ ఆరితేరుతాడు. అప్పుడు అనంతుడు మాంత్రికుడు కుటిల ఆలోచనను విజయుడికి తెలియజేస్తాడు. అప్పుడు విజయుడు కామరూపంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిన సంగతి గురించి చెబుతాడు.