మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన.పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.
 
ఇవి కాక టెంపోరావు, గుత్తా బాపినీడు, డాక్టర్, భయంకర్, విశ్వప్రసాద్, ప్రసాద్, కనకమేడల, [[కొమ్మూరి సాంబశివరావు]] మొదలైన వారి డిటెక్టివ్ నవలలని వారింట్లో అద్దెకి వున్న మద్డాలి సీతమ్మ గారు తమ బంధువుల నుంచి తెచ్చి ఇచ్చేవారు. డిటెక్టివ్ నవలల్లో ఇలా విసుగు కలిగించేవి కనిపించేవి కావు. ఎందుకంటే వారు కథని సంభాషణల ద్వారా నడిపించేవారు. పత్రికల్లోని రచనలకి, డిటెక్టివ్ నవలలకి తేడాని స్పష్టంగా గమనించ గలిగారాయన. డిటెక్టివ్ నవలల్లో ఫిలాసఫీని చెప్పేవారు కారు. సాధారణంగా నవల సంభాషణలతోనే మొదలయ్యేది. గాంధీనగర్లోని న్యూ ఇండియా సెంటర్లో బళ్ళ మీద అద్దెకి ఇచ్చే కొమ్మూరి నవలలని తెచ్చుకుని చదివే వారాయన. వాటి వెల అర్థరూపాయి. రోజుకి అణా అద్దె. వాటిని అణా లైబ్రరీలు అనేవారు.
ఆరోజుల్లో ఆయన పత్రికల్లో చదివిన అనేక వేల మంది రచనా విధానాలే ఆయనకు మార్గదర్శకత్వం అయ్యాయి. ఎలా రాయలో కంటే ఎలా రాయకూడదో ఆయనకు చిన్న వయసులోనే తెలిసింది. ఏ సమాచారం పాఠకుడిగా నాకు విసుగ్గా వుండేదో దాన్ని ఆయన రచనలనల్లో దొర్లకుండా వారు రచయితగా మొదటినించి జాగ్రత్తని తీసుకోసాగారు. పైగా మెత్తటి వాక్య నిర్మాణంలో దిట్ట అయిన కొమ్మూరి సాంబశివరావు నవలలు అన్ని అనేకమార్లు చదవడం వల్ల ఆయనకు అలాంటి వాక్యాలు రాయడం బాగా పట్టుపడింది. ఏది పాఠకుడిని కన్ఫుస్ చేయకుండా, వారి మెదడుని స్ట్రైన్ చేయకుండా చెప్పాలి అని ఆయన బాగా గ్రహించారు. ఆ సూత్ర్రాన్ని ఆనాటి డిటెక్టివ్ రచయితలు గ్రహించి పాటించారు. పత్రికల్లోని కథల పోకడకి, డిటెక్టివ్ నవలల్లోని పోకడకి గల తేడాని పట్టుకోగలిగారు. ఈ కారణంగా నా శైలి సులభంగా వుంటోంది.