మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
[[దస్త్రం:Madurei 350.jpg|thumb|left|మీనాక్షి దేవాలయ చిత్రము]]
== నామచరిత్ర ==
ఈ నగరానికి మదురై అన్న పేరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగాన్ని మదురై, నాలు మాడ కూడలి, కూడఒల్ నగర్, తిరువలవై, ఆలవై అని పలు విధములుగా పిలువబడింది. మదురై అన్న పేరు రావడానికి కారణంగా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మదురై అంటే తమిళంలో[[తమిళం]]లో తీయనిది అని అర్ధం. మరొక కథనాన్ని అనుసరించి మారుతము అనే మాట మదురగా మారిందని అభిప్రాయపడుతున్నారు. వైగై నదీతీరాన ఉన్న వృక్షముల నుండి వచ్చే మనసును పరవశింపజేసే మారుతం కారణంగా సంగకాలంలో ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. పురాణాల అధారంగా ఇక్కడ సంభవించిన [[సునామీ]] కారణంగా ఈ ప్రదేశం ప్రాచీన కుమరిఖండం నుండి విడిపడి ప్రస్తుత మదురై నగరం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. [[దిండిగల్]] సమీపంలో వడమదురై అనే ఊరు ఉంది అలాగే [[శివగంగై]] జిల్లాలో మానామదురై అనే ఊరు ఉంది. చారిత్రకంగా 17వ శతాబ్దంలో పరంజ్యోతి మునివర్ చేత రచించబడిన తిరువిళయడల్ పద్య కావ్యపురాణంలో తిరువాలవై మాన్మియం అని ప్రస్తావించబడింది. మరొక పురాణంలో పరమశివుడు ఈ నగరాన్ని ఆశీర్వదించి తన తాళగతిలో నుండి ఈ నగరంమీద దివ్య మకరందాన్ని కురిపించాడని సంస్కృతంలో మకరందానికి మధువు అన్న పేరు ఉన్న కారణంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు