దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
'''దేవీశ్రీ ప్రసాద్''' సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడై సంచలనం సృష్టించాడు.
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీ కి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.
 
==సంగీతం అందించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/దేవి_శ్రీ_ప్రసాద్" నుండి వెలికితీశారు