ఎం.ఎస్. సుబ్బులక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 49:
*ఎం.ఎస్. గురించి ఫిల్మ్స్ డివిజన్ వారు చేసిన ఒక ఆంగ్ల డాక్యుమెంటరీ [https://www.youtube.com/watch?v=O6S0mfHEpKw యూట్యుబ్ లింక్]
 
== ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం ==== జీవితం ==
[[దస్త్రం:Ms subbulakshmi.jpg|thumb|right|200px|మీరా చిత్రంలో సుబ్బలక్ష్మి]]
సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి [[మధురై]] నుంచి [[చెన్నై]]కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన '''త్యాగరాజన్ సదాశివన్''' తో 1940 లో ఆమె ప్రేమవివాహం అయింది. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాదను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో '' సేవాసదనం '' సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో ''శకుంతలై'' అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది.
*ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గురించి వీడియో, అడియో పరిచయం [[యూట్యూబ్]].[http://www.youtube.com/watch?v=wyDNKW7g2Co&feature=related లింక్]<ref name=youtube>[http://www.youtube.com/watch?v=wyDNKW7g2Co&feature=related యూట్యూబ్ వీడియో పరిచయం][[జూన్ 13]],[[2008]]న సేకరించబడినది.</ref>
*ఎం.ఎస్. గురించి ఫిల్మ్స్ డివిజన్ వారు చేసిన ఒక ఆంగ్ల డాక్యుమెంటరీ [https://www.youtube.com/watch?v=O6S0mfHEpKw యూట్యుబ్ లింక్]
[[File:Statue subbalaxmi 4.JPG|thumb|left|ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ విగ్రహం. తిరుపతిలో]]
సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు. నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో [[అభంగాలు]], దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. [[త్యాగరాజు]], [[ముత్తుస్వామి దీక్షితార్]], [[శ్యామశాస్త్రి]] వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.