అర్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
== వ్యక్తిత్వం ==
[[దస్త్రం:Ravi Varma-Arjuna and Subhadra.jpg|left|thumb|అర్జునుడు సుభద్ర రతి క్రీడలు సన్నివేశాన్ని చిత్తిరించిన [[రాజా రవి వర్మ]].]]
మహాభారతం అర్జునుని సంపూర్ణ వ్యక్తిత్వం కలవానిగానూ, ఆరోగ్యకరమైన, ధృడమైన, అందమైన శరీరం, ఆరోగ్యకరమైన మనస్సు కలవానిగానూ, మరియు ప్రతి తల్లితండ్రీ, ప్రతి భార్య, ప్రతీ స్నేహితుడు, గొప్పగా చెప్పుకోగల వ్యక్తిత్వం ఉన్నవానిగా అభివర్ణించింది.మొత్తం నలుగుర్ని వివాహమాడాడు. స్నేహితులతో కూడా చాలా మంచిగా వ్యవహరించేవాడు. గొప్ప వీరుడైన [[సాత్యకి]] అర్జునుడికి మంచి స్నేహితుడు. తన బావయైన శ్రీకృష్ణునితో జీవితాంతం మంచి సంబంధాన్ని కొనసాగించాడు. కొంచెం మృధు స్వభావి మరియు మంచి ఆలోచనాపరుడు కూడా. అందుకనే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అతనికి గీత బోధించవలసి వచ్చింది.
=== విద్యార్థిగా ===
అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు. దీనికి పునాది లేత వయస్సులోనే పడింది. చిన్నపుడు అత్యుత్తమ [[విద్యార్థి]]. గురువు [[ద్రోణాచార్యుడు]] చెప్పిన ఏ అంశాన్నైనా ఇట్టే గ్రహించే వాడు.
 
=== భర్తగా ===
పంక్తి 15:
===కర్తవ్య పాలనలో===
[[దస్త్రం:Swayamvara Draupadi Arjuna Archery.jpg|thumb|250px|మత్స్య యంత్రాన్ని ఛేదిస్తున్న అర్జునుడు.]]
పాండవులు తమ ఉమ్మడి భార్యయైన ద్రౌపదితో సంసార జీవనం సాగించడానికి కొన్ని విధి నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నియమాల ప్రకారం ఒకరు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నపుడు మరొకరు వారి ఏకాంతానికి భంగం కలిగించరాదు. ఇలా భంగం కలిగించిన వారికి ఏడాది పాటు బహిష్కరణ శిక్ష విధిస్తారు. పాండవులు ఇంధ్రప్రస్థాన్ని పరిపాలిస్తున్నపుడు ఒక సారి బ్రాహ్మణుడొకడు, అర్జునుని సహయాన్ని అభ్యర్థించాడు. అతని పశుసంపదలను ఎవరో దొంగల ముఠా తోలుకెళ్ళారనీ, వారి నుంచి తన పశు సంపదను కాపాడమని అర్జునుని వేడుకొన్నాడు. కానీ అర్జునుని ఆయుధ సామాగ్రి మొత్తం ద్రౌపది మరియు యుధిష్టురుడు ఏకాంతంగా ఉన్న గదిలో ఉండిపోయి నందున వారికి భంగం కలిగించడం నియమాలకు వ్యతిరేకం కనుక సందిగ్ధంలో పడ్డాడు. కానీ సహాయార్థం వచ్చిన బ్రాహ్మణోత్తముని తిప్పి పంపటం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి ఆ శిక్ష గురించి జంకకుండా వారున్న గదిలోకి వెళ్ళి ఆయుధాలు తీసుకొని పశువులను దొంగలించిన వారికోసం వెళ్ళాడు. ఆ పని పూర్తయిన వెంటనే [[ధర్మరాజు]] మరియు ద్రౌపదితో[[ద్రౌపది]]తో సహా [[కుటుంబం]] మొత్తం వారిస్తున్నా ఒక సంవత్సరం పాటు తనకు తానే బహిష్కరణ విధించుకున్నాడు.
 
== అరణ్య వాసం మరియు అజ్ఞాతవాసం ==
"https://te.wikipedia.org/wiki/అర్జునుడు" నుండి వెలికితీశారు