ప్రతాపరుద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==యుధ్ధములు==
 
క్రీ. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరము రాజ్యాధికారము చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకారవిధానమును కట్టుదిట్టం చేశాడు. నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు. తన దాడిని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు. ఒకటి అంబదేవుని పైకి, రెండవది [[నెల్లూరు]] పైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి క్రీ. శ. 1291లో అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరు పైకి వెడలి అచట మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విటలుడు యాదవరాజాక్రాంతములైనున్న ఆదవాని, తుంబళము కోటలు పట్టుకొని రాయచూరుదుర్గముపై దాడికి వెడలారు. కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడ సాధించి కృష్ణా తుంగభద్రల నడిమిదేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. ఆంతరంగిక వ్యవహారాలీవిధముగా చక్కదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కరపరిస్థితి ఉత్తరదేశము నుండి ముంచుకొచ్చింది.
==ముస్లిం దండయాత్రలు==
పంక్తి 24:
===రెండవ దాడి===
 
క్రీ.శ. 1309లో సుల్తాను మరింత సైన్యముతో మాలిక్ నాయిబ్ కాఫూర్ ను పంపాడు. అతడు దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫూర్ హనుమకొండను[[హనుమకొండ]]ను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫూర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడ చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, ఏనుగులను[[ఏనుగు]]లను బహూకరించాడు.
 
===మూడవ దాడి===
"https://te.wikipedia.org/wiki/ప్రతాపరుద్రుడు" నుండి వెలికితీశారు