తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను గురించి → గురించి, లో → లో , గ్రంధా → గ్రంథా (4), జరిగి using AWB
పంక్తి 28:
}}
 
వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలుగ్రంథాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. [[అవధానము (సాహిత్యం)|అవధానాల్లో]] వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో [[పాండవ ఉద్యోగ విజయములు]] నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.
*''బావా ఎప్పుడు వచ్చితీవు..'',
*''చెల్లియో చెల్లకో..'',
పంక్తి 41:
==చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి==
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంధాలుగ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి.
తరువాత వారు [[యానాం]]కు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
 
పంక్తి 54:
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి [[వినాయక చవితి]] ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
 
వేంకట శాస్త్రి [[వారాణసి]] వెళ్ళి తిరిగి వచ్చినాక [[కాకినాడ]] లో జంటగా [[అవధానము (సాహిత్యం)|శతావధానం]] ప్రదర్శించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.
 
ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు [[అనీబిసెంట్]] ప్రశంసలు అందుకొన్నారు. [[వెంకటగిరి]], [[గద్వాల]], [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]], [[విజయనగరం]], [[పిఠాపురం]] సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.
 
[[పోలవరం]] జమీందారు వారి ప్రతిభనుప్రతిభ గురించి తెలిసికొని [[ఎడ్విన్ ఆర్నాల్డ్]] రచించిన [[లైట్ ఆఫ్ ఆసియా]] గ్రంధాన్నిగ్రంథాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించాడు. ఆ విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించాడు. ఫలితంగా వారు 1901లో [[కాకినాడ]]కు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. ఈ పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంధాలనుగ్రంథాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
 
1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే [[గోలంక వీరవరం]] జమీందార్ [[రావు రామాయమ్మ]] వీరికి భరణం ఏర్పాటు చేసింది.
==అవధానాలు==
వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు, గుండుగొలను గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం ముమ్మిడివరం, అయినవిల్లి గ్రామాలలో అష్టావధానాలు చేశాడు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. కాకినాడ, అమలాపురం, ఏలూరు, బందరు, నెల్లూరు, విశాఖపట్నం, బెజవాడ, మద్రాసు, గుంటూరు, రాజమండ్రి మొదలైన పట్టణాలలోను, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వెంకటగిరి, విజయనగరం, నూజివీడు, కిర్లంపూడి మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు. ఈ అవధానాలన్నింటిలోను తిరుపతిశాస్త్రి ఒక పాదం చెబితే వేంకటశాస్త్రి మరొక పాదం చెప్పేవాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=119-128|edition=ప్రథమ|accessdate=18 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరి అవధానాలలో వెలువడిన కొన్ని పద్యాలు:
పంక్తి 185:
#సతీ జాతకము
=== ఆత్మకూరు సంస్థానాధికారిపై లఘుకృతి ===
[[మహబూబ్ నగర్ జిల్లా]] లోని సంస్థానాలలో ఒకటైన [[అమరచింత సంస్థానము|ఆత్మకూరు సంస్థానాన్ని]] తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగినదిజరిగింది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని ''అధిక + అరి '' అని చమత్కరిస్తూ, అన్యోపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి ''శనిగ్రహం '' అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....
<poem>
ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
పంక్తి 233:
{{వికీసోర్స్|తిరుపతి వేంకట కవులు}}
*Tirupati Venkata Kavulu: Makers of Indian Literature, Salva Krishnamurthy, Sahitya Akademi, New Delhi, 1985.
 
* ప్రసిద్ధ తెలుగు పద్యాలు - పి.రాజేశ్వరరావు సంకలనం
[http://www.vepachedu.org/kattamanchi.html#Tirupati_Venkata_Kavulu శ్రీ వేపచేదు విద్యా పీఠము, మన సంస్కృతి, నవంబరు 2000]