ప్రధాన మెనూను తెరువు

మార్పులు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు , ని → ని (3), గా → గా (3), తో → తో , బందిం → బంధిం (2), using AWB
{{తెలుగు సినిమా సందడి}}
{{వేదిక|తెలుగు సినిమా}}
'''తెలుగు సినిమా''' లేదా '''టాలీవుడ్''' [[హైదరాబాదు]] కేంద్రంగా పని చేస్తున్న [[భారతీయ సినిమా]] లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]] గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిజ్ఞ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]] లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గా సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]] లో స్థాపించాడు.
 
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక [[హైదరాబాదు]] లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి [[ఆంధ్రప్రదేశ్]] సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన [[లేపాక్షి నంది]]ని స్ఫూర్తిగా తీసుకొనబడింది.
 
1940 లో విడుదలైన [[విశ్వమోహిని]] భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. [[ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం]] వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన [[మల్లీశ్వరి]]. ఈ చిత్ర్ం [[చైనా]] లోనూ 13 ప్రింట్లతో చైనీసు సబ్-టైటిళ్ళతో [[బీజింగ్]] లో 14, మార్చి 1953 లో విడుదలైనది. ఇదే 1951 లో విడుదలైన [[పాతాళ భైరవి]] 24 జనవరి 1952 న [[బొంబాయి]] లో జరిగిన మొట్టమొదటి [[ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్]] లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత]] చలన చిత్రం. 1956 లో విడుదలైన [[తెనాలి రామకృష్ణ (1956 సినిమా)|తెనాలి రామకృష్ణ]] [[ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం]] ని గెలుచుకొన్న ఏకైక చిత్రం.
 
[[తెలుగు సినిమాలు 2005|2005]], [[తెలుగు సినిమాలు 2006|2006]] మరియు [[తెలుగు సినిమాలు 2008|2008]] సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ [[బాలీవుడ్]]ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినది. [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గాస్టూడియోగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్]] లో నమోదైనది. హైదరాబాదులో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే ఉన్నాయి.
 
సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది [[పాతాళ భైరవి]] (1951), [[మల్లీశ్వరి]] (1951), [[దేవదాసు]] (1953), [[మాయాబజార్]] (1957), [[నర్తనశాల]] (1963), [[మరో చరిత్ర]] (1978), [[మా భూమి (సినిమా)|మా భూమి]] (1979), [[శంకరాభరణం]] (1979), [[సాగర సంగమం]] (1983), [[శివ]] (1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.
 
[[సినిమా]] [[తెలుగు]] వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. [[భారతీయ సినిమా]]లో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]] ('''100''' సినిమాలకి పైగా)
* అతి తక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref> ('''42''' సినిమాలు) <br/> [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం, గౌరవం, ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
 
దక్షిణ భారతదేశంలో గల [[ఆంధ్రప్రదేశ్]] మరియు [[తెలంగాణ]] రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. [[హాలీవుడ్]] పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.
1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా [[భక్త ప్రహ్లాద]]తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.
 
ఈ కాలంలో ప్రతిభను కనపరచిన [[తెలుగు సినిమా దర్శకులు|దర్శకులలో]] కొందరు సి.పుల్లయ్య ([[లవకుశ]]), సిహెచ్.నరసింహారావు ([[సీతా కళ్యాణం]]), హెచ్.వి.బాబు ([[కనకతార (1937 సినిమా)|కనకతార]]), పి.పుల్లయ్య ([[బాలాజీ|తిరుపతి వెంకటేశ్వర మహాత్మ్యం]]), సిహెచ్.నారాయణ ([[మార్కండేయ]]).
 
==వాణిజ్య వైఖరి==
(ప్రధాన వ్యాసం: '''[[తెలుగు సినిమా వసూళ్లు]]''')
వాణిజ్య పరంగా సత్ఫలితాలని ఇచ్చే తెలుగు సినిమా భారతీయ సినిమా పై ప్రభావం చూపుతూ వచ్చినదివచ్చింది. రాబడిని పెంచుతూ వచ్చిన తెలుగు సినిమా జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం వరకూ కలదుఉంది. 1992 లో చిరంజీవి నటించిన[[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన [[ఘరానా మొగుడు]] బాక్సాఫీసు వద్ద రూ. పది కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం గాచిత్రంగా నిలచినది..
 
== పరిశ్రమ ==
[[మూలా నారాయణస్వామి]], [[బి.నాగిరెడ్డి]] లు 1948 లో [[చెన్నై]] కేంద్రంగా [[విజయ వాహినీ స్టూడియోస్]] స్థాపించారు. [[భక్తప్రహ్లాద (సినిమా)]] తో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన [[ఎల్.వి.ప్రసాద్]] కుడా చెన్నై యే కేంద్రంగా 1956 లో [[ప్రసాద్ స్టూడియోస్]] ని స్థాపించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమని, [[నందమూరి తారక రామారావు]] హయాం లో చెన్నై నుండి హైదరాబాదు కిహైదరాబాదుకు తరలించటంలో [[డి.వి.యస్.రాజు]] కీలక పాత్ర వహించారు.
 
[[అక్కినేని నాగేశ్వరరావు]] హైదరాబాదు చేరి, [[అన్నపూర్ణ స్టూడియో]] నిర్మించారు. [[దగ్గుబాటి రామానాయుడు]], [[రామోజీరావు]] లచే నిర్మించబడ్డ ఫిలిం స్టూడియోలు విరివిగా సినీ నిర్మాణం చేయటంతో బాటు పలువురికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. పలు తెలుగు చిత్రాలు [[హిందీ]], [[తమిళం]] ల లో పునర్నిర్మించబడ్డట్టే, పలు హిందీ, తమిళ మరియు మలయాళ చిత్రాలు తెలుగులో పునర్నిర్మింపబడ్డాయి. అయితే కొన్ని హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు నేరుగా అనువదించబడటమే కాక ఆయా భాషలలో కంటే తెలుగులోనే అధిక విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
[[తెలుగు సినిమాలు 2004|2004]] వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
 
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించినసంబంధించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
 
{| class="wikitable"
 
==కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబంధం==
తమిళ చలనచిత్ర పరిశ్రమ [[కోలీవుడ్]] అని పేరు పొందినది. యాభై మరియు అరవై దశకం లో స్టూడియోలు మద్రాసు మహానగరం లో వుండటం వలన తెలుగు మరియు తమిళ సినిమాకి మంచి సంబంధం కలదుఉంది. నేటికి అనేక తెలుగు చలనచిత్రాలు తమిళంలో, మరియు తమిళ చలనచిత్రాలు తెలుగులో డబ్బింగ్ చెయ్యడం మామూలూ. అలగే తెలుగు తారలు తమిళం లో నటించటం తమిళ తారలు తెలుగులో నటించడం సహజం. ప్రముఖ తారలు [[త్రిష]], [[ఇలియానా]] 123 లక్షల వరకు; [[శ్రియా సరన్|శ్రియ]], [[జెనీలియా]], [[సదా]], [[భూమిక|భూమిక చావ్లా]], [[ఛార్మీ కౌర్|ఛార్మి]] (వీళ్ళంతా ముంబాయికి సంబందించినసంబంధించిన వాళ్ళు) 150 నుండి 160 లక్షల వరకు తీసుకుంటారు. [[నయన తార]], [[ఆసిన్]], [[అనుష్క శెట్టి|అనుష్క]] వంటి వారు నటించే రోజులు బట్టి 130 నుండి 140 లక్షల వరకు తీసుకుంటారు.
 
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కథలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు.<!-- The swapping of stories and heroines between Kollywood and Tollywood is common. --> తెలుగువాడైన [[విద్యాసాగర్]] కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, [[శంకర్]] వంటి దర్శకులు, [[ఎ.ఎమ్.రత్నం]] వంటి నిర్మాతలు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965188" నుండి వెలికితీశారు