ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
[[దస్త్రం:AIR Logo.jpg|right|thumb|100px|ఆకాశవాణి చిహ్నం]]
== చరిత్ర ==
[[భారతదేశం]]లో మొదటి రేడియో ప్రసారాలు [[1923]] [[జూన్]]లో "రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి" ద్వారా ప్రసారం చేయబడ్డాయి. దీని తరువాత 'బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ' ఏర్పాటు చెయ్యబడింది. ప్రయోగాత్మకంగా జూలై [[1927]]లో [[కలకత్తా]], [[బొంబాయి]] నగరాలలో 'ఇండియన్ బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ' ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్ కాష్టింగు కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. ''1936'' సంవత్సరములో '''ఆకాశవాణి''' ప్రభుత్వ సంస్ధగా అవతరించింది. అంతకి పూర్వము ప్రైవేటు [[రేడియో]] క్లబ్బులు ఉండేవి.
[[దస్త్రం:Akashvani Bhavan in New Delhi.jpg|right|thumb|200px|ఢిల్లీలో ఆకాశవాణి ప్రధాన భవనం]]
 
ఇటీవలి కాలంలో టీవీ ఛానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ ఎమ్ రేడియో చానెళ్లు అన్ని వర్గాల వారికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కల ఆకాశవాణి ప్రసార కేంద్రాలు [[అదిలాబాదు]], [[కడప]], [[విజయవాడ]], [[విశాఖపట్నం]], [[హైదరాబాదు]], [[అనంతపురం]], [[కర్నూలు]], [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]], [[నిజామాబాదు]], [[తిరుపతి]], [[వరంగల్లు]].
 
ఇటీవలి కాలంలో ఎఫ్‌ఎం పై ఆకాశవాణి రెయిన్ బో ([[హైదరాబాదు]], [[విజయవాడ]]) కేంద్రాలతో పాటు కొన్ని ప్రెవేటు ఎఫ్‌ఎం కేంద్రాలు ([[రేడియో మిర్చి]], [[రేడియో సిటీ]], [[బిగ్ ఎఫ్‌.ఎం.]], [[రెడ్ ఎఫ్‌.ఎం.]]) ప్రజాదరణ పొందుతున్నాయి. విద్యా ప్రసారాలకై [[జ్ఞానవాణి]] కేంద్రం (హైదరాబాదు, విశాఖపట్నం, ఇతర ముఖ్య నగరాలలో) పని చేస్తున్నది.
 
=== తెలుగులో తొలి ప్రసారాలు ===
ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16న ప్రారంభమయ్యాయి. ఆరోజు సాయంత్రం 5.30గంటలకు సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజ స్వామి రచించిన ''శ్రీ గణపతిని సేవింపరాదే'' అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్యపిళ్లై నాదస్వరంపై వాయిస్తూండగా అదే తొలి ప్రసారంగా మద్రాసు కేంద్రం ప్రారంభమైంది. ఆ రాత్రే 8.15కు ''భారతదేశం-రేడియో'' అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకటరెడ్డినాయుడు తెలుగులో ప్రసంగించారు. తెలుగులో తొలి రేడియో ప్రసంగంగా భావించే ఈ ప్రసంగంలో ''నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడా మంచి వినుచున్నారో నేను చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు ఉండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినదేమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీషులో రేడియో అందురు'' అని ప్రారంభించారు.<br />
[[మద్రాసు]] కేంద్రం తొలి తెలుగు ప్రసంగాల్లో 1938 జూన్ 18న ''సజీవమైన తెలుగు'' అనే అంశంపై [[గిడుగు రామమూర్తి పంతులు]], జూన్ 21న ''మన ఇల్లు-దాని అందము చందము'' అనే అంశంపై [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]], జూన్ 23న ''[[రవీంద్రనాథ్ ఠాగూర్|రవీంద్రుడు]]'' గురించి [[బెజవాడ గోపాలరెడ్డి]] 15నిమిషాల వ్యవధి గల ప్రసంగాలు చేశారు. [[ముద్దుకృష్ణ]] రాసిన ''[[అనార్కలి]]'' మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం. 1938 జూన్ 24 రాత్రి 8.30గంటలకు ఆ నాటకం ప్రసారమైంది. రేడియో నాటకాన్ని [[ఆచంట జానకీరాం]] రూపొందించారు. అనార్కలి పాత్రని పున్నావఝుల [[భానుమతి]] (రేడియో భానుమతిగా సుప్రసిద్ధులు) ధరించగా, సలీం పాత్రను [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], అక్బర్ పాత్రను అయ్యగారి వీరభద్రరావు ధరించారు.<br />
1938 జూన్ 25 రాత్రి తొలిగా జానపద సంగీతం ప్రసారమైంది. మద్రాసు ప్రసారాల తొలి తెలుగు వ్యాఖ్యాత మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ సోదరుడు). ఆయన రేడియో తాతయ్యగా పిల్లల కార్యక్రమాల ద్వారా సుప్రసిద్ధులు.<ref>''ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది...'' శీర్షికన [[సుధామ]] రాసిన వ్యాసం([[తెలుగు వెలుగు]]; ఫిబ్రవరి 2014 సంచిక)</ref>
=== హైదారాబాద్, విజయవాడ కేంద్రాల ప్రారంభం ===
ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబర్ 12న తొలి తెలుగు రేడియో స్టేషనుగా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి విజయవాడ కేంద్రం ప్రసారాలు ప్రారంభించింది. 1933లో హైదారాబాద్ చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200వాట్ల శక్తిగల రేడియోకేంద్రం స్థాపించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3న నిజాం తన అదుపులోకి తీసుకున్నారు. ''దక్కన్ రేడియో''గా 7వ అసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాము ఉర్దూ ప్రసారాలతో ప్రారంభించినా పరిమితంగా తెలుగు, [[కన్నడ]], మరాఠీ కార్యక్రమాలుండేవని తొలి తెలుగు రేడియో కార్యక్రమాలను గురించి పరిశోధించిన విశ్రాంత ఆకాశవాణి ఉద్యోగి సుధామ పేర్కొన్నారు. స్టూడియో సరూర్ నగర్ నుంచి [[ఖైరతాబాద్]] యావర్ మంజిల్ కు తరలింది. 1948 డిసెంబరు 1నాటికి 800వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్ లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు [[మాడపాటి హనుమంతరావు]] ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. 1950లో దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో హైదారాబాద్ కేంద్రంగా మార్చింది. హైదారాబాద్, విజయవాడ కేంద్రాలు తెలుగులో విజ్ఞాన వినోదాలను మేళవించి రూపొందించిన వివిధ కార్యక్రమాలతో తెలుగు జనజీవితంలో భాగమయ్యాయి.
=== ఇతర తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ===
{| class="wikitable"
! ఆకాశవాణి కేంద్రం !! ప్రారంభ తేదీ
|-
| [[కడప]] || 17.06.1963
|-
| [[విశాఖపట్నం]] || 04.08.1963
|-
| [[ఆదిలాబాద్]] || 12.10.1986
|-
| కొత్తగూడెం || 24.03.1989
|-
| [[వరంగల్]] || 17.02.1990
|-
| [[నిజామాబాద్]] || 09.09.1990
|-
| [[తిరుపతి]] || 01.02.1991
|-
| [[అనంతపురం]] || 29.05.1991
|-
| [[కర్నూలు]] || 01.05.1992
|-
| [[మార్కాపురం]] || 09.08.1993
|}
 
=== ఇతర కేంద్రాల తెలుగు ప్రసారాలు ===
1955 నవంబరు 2న ప్రారంభమయిన [[బెంగళూరు]], 1963 జూన్ లో మొదలైన [[పోర్ట్ బ్లెయిర్]] కేంద్రాల్లోనూ తెలుగు ప్రసారాలు చేశారు. [[ఢిల్లీ]] నుంచి తెలుగు వార్తలు, శ్రీలంకలో తెలుగు ప్రసారాలు, వివిధాభారతి వాణిజ్య విభాగంలోనూ తెలుగు కార్యక్రమాలు జరిగాయి.
 
== కార్యక్రమాలు ==
5,722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965210" నుండి వెలికితీశారు