బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
బైబిలు గ్రంధంలో ఏ భాగమూ లిఖితం కాక మునుపు వృత్తాంతాలను ప్రజలు కధలుగా చెప్పుకొనేవారు. యూదుల లేఖనాల్లో చాలా భాగాలు ఈ వృత్తాంతాలే. పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకున్న అనంతరం (1800 B.C) వారు వృత్తాంతాలను, ప్రవచనాలను లిఖించడం ఆరంభించారు. పాత నిబంధన యూదులకు ధర్మశాస్త్రము(రాజ్యాంగము)గా వ్యవహరించబడినది. యేసు క్రీస్తు కాలంలో అది సవరణలు చేయబడి క్రొత్త నిబంధనగా చేయబడింది.
 
పాత నిబంధన భాగం హెబ్రీయ భాషలో వ్రాయబడగా, క్రొత్త నిబంధన భాగం క్రీస్తు శకంలో గ్రీకు భాషలో వ్రాయబడినది. బైబిలులోని ప్రతి వాక్యానికి అదే అధ్యాయానికి లేదా వేరే అధ్యాయానికి లేదా వేరే పుస్తకానికి చెందిన మరో వాక్యంతో సంబంధం ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో బైబిలు మొదటిది అని చెప్పడంలో సందేహం లేదు. అత్యధిక విమర్శకులు కలిగిన పుస్తకం కూడా బైబిలే. క్రైస్తవుల నమ్మకం ప్రకారం బైబిలు పదునైన రెండంచుల ఖడ్గం. బైబిలు చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని, రక్షణగా ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా లేదా విజయం సిద్ధిస్తుందని [[క్రైస్తవులు]] నమ్ముతారు. బైబిలులోని పాత నిబంధన గ్రంధములోని వృత్తాంతాలు చరిత్ర సంఘటనలు కాకపోయినా సామాజిక పరిస్థితులు చూపిస్తాయి. ఏసు క్రీస్తు జీవితము చరిత్రయే అయినా క్రొత్త నిబంధన లిఖించబడినది ఏసు క్రీస్తు మరణించిన తర్వాత కాలంలోనే. హిందూ వేదాలవలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతమునకు చెందినది.
 
మధ్య యుగంలో కొన్ని రాజకీయ సామాజిక కారణాల వల్ల ఇంగ్లండు చర్చివారు ప్రొటస్టెంట్లు, కేథలిక్కులు, తూర్పుసనాతన సంఘం, పెంతికోస్తు, బాప్టిస్టు వంటి ఎన్నో సంఘాలుగా చీలిపోయారు. ప్రొటస్టెంట్లు ఏసుక్రీస్తు బోధనలు, మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. కేథలిక్కులు బాల్యంలో యేసు చేసిన మహిమలు, తల్లి మేరీ చేసిన మహిమలు, శిలువయాగం, తిరిగి రావడం వంటివి నమ్ముతారు. నేడు ప్రపంచంలో సుమారు అన్ని భాషల్లోను బైబిలు అచ్చువేయబడుచున్నది.
పంక్తి 52:
 
==బైబిలుకు చెందని పుస్తకాలు ==
1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని Fertilize చేసుకోవడానికి మెత్తటి మట్టి కొసం ఈజిప్టులోని[[ఈజిప్టు]]లోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్క తో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంధానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తు కు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ [[మరణం]] అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరి తో శారీరక సంబంధం ఉన్నదని , వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నవి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో [[బైబిల్ వ్యతిరేక పత్రికలు]]గా మిగిలిపోయాయి.
 
==ఇతర గ్రంథాలతో పోలికలు==
*హిందూ సాహిత్యం వలే బైబిలు కూడా త్రైత సిద్ధాంతానికి చెందినది.
*బైబిలు ప్రకారం తండ్రి, కుమారుడు, [[పరిశుద్ధాత్మ]] త్రిమూర్తులైతే, వేదాల ప్రకారం [[బ్రహ్మ]], [[విష్ణు]], మహేశ్వరులు త్రిమూర్తులు.
*పాత నిబంధనలో ఉన్న జంతు బలి అర్పణలు హిందూ వేదాల్లో కూడా ఇవ్వబడినవి.
*పాత నిబంధనలో ఆదాము ఆది మానవుడైతే హిందూ పురాణాల్లో మనువు ఆది మానవుడు.
*హిందూ గ్రంథాల్లో పేర్కొన్న స్వర్గలోకాన్ని బైబిలులో పరలోకంగా పిలుస్తారు.
*బైబిలు విగ్రహారాధన ఖండిస్తుంది, [[హిందు మతంలోమతం]]లో [[విగ్రహారాధన]] సాధారణం.
*బైబిల్ ప్రకారం పాపుల్ని పాపంనుండి రక్షించాలి, [[భగవద్గీత]] ప్రకారం పాపుల్ని సంహరించాలి.
*పాత నిబంధన ప్రకారం నోవాహు అను దైవ భక్తుడి కాలంలో జరిగిన జల ప్రళయం మత్స్య పురాణంలోను, [[ఖురాన్]] లోను, సుమేరియన్ల కావ్య గ్రంధమైన [[గిల్గమేష్]] లోను మరియు ఎన్నో ఇతర పుస్తకాల్లోను ఇవ్వబడినది.
 
== తెలుగులో బైబిలు ==
[[దస్త్రం:Book of common prayers.jpg|right|200px|thumbnail|సామాన్య ప్రార్థనల పుస్తకము - 1880లో ముద్రిచబడినది. [http://anglicanhistory.org/bcp/telugu.html]]]
1812లో బైబిలులో కొంత భాగము తెలుగులో ప్రచురితమైంది. 1818లో క్రొత్త నిబంధన గ్రంథము ప్రచురించారు. 1854లో పూర్తి బైబిలును తెలుగులో ప్రచురించారు. 1842లో S.P.G. తెలుగు మిషను [[కడప]] జిల్లాలో ఆరంభమైంది. రెవ.విలియమ్ హొవెల్ 1842లోనే ప్రార్థనల పుస్తకాన్ని, కొంత బైబిలును అనువదించాడు. 1858లో S.P.C.K. వారు మద్రాసులో దీనిని ప్రచురించారు. అంతకు ముందే 1849లో పి.ఆర్.హంట్ 'A Teloogoo translation of the Book of Common Prayer'ను మద్రాసు అమెరికన్ ప్రెస్సులో ప్రచురించాడు. 1880లో మద్రాసు డయోసియన్ కమిటీవారు S.P.C.K. ప్రెస్సులో సామాన్య ప్రార్థనల పుస్తకాన్ని ప్రచురించారు. [[కడప]], [[ముత్యాలపాడు]]లలో మిషనరీ కార్యములు నిర్వహించిన రెవ.[[జాన్ క్లే]] మంచి తెలుగు పండితుడు. ఆయన ఈ తెలుగు బైబిలును విస్తృతంగా సవరించాడు.
 
== అంతర్జాలంలో తెలుగు బైబిల్ ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు