దశావతారం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , కీ → కీ , క్రిష్ణ → కృష్ణ (2), ఉద్దేశ్యం → ఉద్దేశ using AWB
పంక్తి 60:
 
==సంక్షిప్త చిత్ర కథ==
ఇహ కథలోకి వస్తే - '''గోవింద్''' ( కమల్ హాసన్ 1 ) అనే సైంటిస్ట్ చెన్నైలో ఓ బహిరంగ సభలో దేశ ప్రజల నుద్దేశించి మాట్లాడడంతో కథ ప్రారంభం అవుతుంది. ఇదే సభకి [[అమెరికా]] '''అధ్యక్షుడు జార్జ్ బుష్''' ( కమల్ హాసన్ 2 ) హాజరవుతాడు. జీవితంలో జరిగే ప్రతీ సంఘటన వెనుకా తెలీని ఒక సంబంధం ఉంటుందనీ, ఎక్కడో [[చైనా]]లో [[సీతాకోక చిలుక]] రెక్కలాడిస్తే అమెరికాలో పెను విపత్తులు రావచ్చు నంటూ “కేవోస్” సిద్ధాంతాన్ని చెబుతూ, కథని పన్నెండో శతాబ్దంలో వైష్ణ భక్తుడైన '''రంగరాజ నంబియార్''' ( కమల్ హాసన్ 3 ) తో మొదలు పెడతాడు. శైవ మతస్థుడైన కుళోత్తుంగ చోళుడు ([[నేపోలియన్నెపోలియన్ (నటుడు)|నేపోలియన్నెపోలియన్]]) వైష్ణవ మతాన్ని అంతరించే ప్రయత్నంలో [[చిదంబరం]]లోని వైష్ణు విగ్రహాన్ని పెకలించి సముద్రంలో పారవేయడానికి సైన్యంతో వస్తాడు. దాన్ని ఎదురించే ప్రయత్నంలో రంగరాజ నంబియార్ బందీ అవుతాడు. ఒక్క సారి శివ నామ జపం చేస్తే విడిచిపెడతానని చెప్పినా వినని రంగరాజ నంబియార్ని విష్ణు విగ్రహంతో పాటు సముద్రంలో పారేయిస్తాడు. ఇది తట్టుకోలేక రంగరాజ నంబియార్ భార్య ( [[ఆసిన్]] ) అక్కడున్న విగ్రహానికి తల బాదుకొని మరణిస్తుంది. అలా రంగరాజు పాత్ర ముగుస్తుంది. అంతే హఠాత్తుగా కథ పెన్నెండో శతాబ్దం వదిలేసి, ఇరవై ఒకటో శతాబ్దం వైపు పరిగెట్టి అమెరికాలో [[వాషింగ్టన్]] లో తేలుతుంది.
 
ఇక్కడ గోవింద్ అనే జీవశాస్త్రవేత్త మానవాళిని చిటికెలో అంతం చేసే [[సింథటిక్]] బయో [[వైరస్]] కనిపెడతాడు. అది కాస్తా ఉగ్రవాదుల చేతిలో పడుతోందని తెలుసుకొని, దాన్ని కాపాడే ఉద్దేశంతో ఓ చిన్న పెట్టె లో పెట్టి [[ఎఫ్.బి.ఐ.]]కీ చెప్పే తరుణంలో '''ఫ్లెచర్''' ( కమల హాసన్ 4 ) అనే టెర్రరిస్ట్ఉగ్రవాది దృష్టిలో పడతాడు. తన స్నేహితుడింట్లో తలదాచు కుందామనుకునే సరికి ఫ్లెచర్ గోవింద్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడ అతని స్నేహితుడూ, స్నేహితుడి జపనీస్ భార్యా ఫ్లెచర్ చేతిలో మరణిస్తారు. ఎలాగో అక్కడనుండి తప్పించుకొని బయట పడినా ఓ నాటకీయ పరిణామంలో ఆ బయో వైరస్ బాక్స్ కాస్తా ఇండియాలో చిదంబరం అనే ఊరికి పార్సిల్ అయ్యిందని తెలుసుకొని అందరికళ్ళూ కప్పి, విమానం కార్గోలో దూరి, [[భారతదేశం]] వెళిపోతాడు. గోవిందు వివరాలు తెలుసుకొన్న ఫ్లెచర్ కూడా తన స్నేహితురాలి ( [[మల్లికా షరావత్]] ) సహాయంతో ఇండియా బయల్దేరుతాడు. తన స్నేహితుడి జపనీస్ భార్య మరణం తెలుసుకొన్న ఆమె '''అన్న''' కరాటే ఫైటర్ ( కమల హాసన్ 5 ) గోవిందుని హత మార్చాలని ఇండియాకి ప్రయాణం కడతాడు. బయో వైరస్ వెపన్ కోసం గోవిందూ, ఆ రెండింటి కోసం ఫ్లెచరూ, అతని ప్రేయసీ, అతన్ని చంపాలని జపనీస్ ఫైటరూ ఒకరి నొకరు చేజ్ చేసుకోవడంతో కథ పాకాన పడుతుంది.
 
ఈ లోగా బలరాం '''నాడార్''' ( కమల హాసన్ 6 ) అనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో చిక్కి, టెర్రరిస్ట్ గా అనుమానింప బడతాడు. అందరి కళ్ళూ కప్పి తప్పించుకుంటాడు గోవింద్. బయో వైరస్ పెట్టె కోసం సరాసరి చిదంబరంలో ఉన్న ఓ వైష్ణవ కుటుంబాన్ని కలవడానికి వెళతాడు. అక్కడే లక్ష్మీ ( ఆసిన్ ) అనే అమ్మాయి పరిచయ మవుతుంది. ఈ లోగా బయో వైరస్ బాక్స్ పార్సిల్ '''లక్ష్మి బామ్మ''' ( కమల హాసన్ - 7 )కృష్ణవేణి చేతిలో పడుతుంది. అది కాస్తా ఊరేగింపులో గోవిందరాజు విగ్రహం లో జార విడుస్తుంది కృష్ణవేణి . అనుకోని హఠాత్పరిణామ క్రమంలో ఆ విగ్రహము, లక్ష్మితో కలసి పారిపోతాడు గోవింద్. అతన్ని ఫ్లెచర్, బలరాం నాడార్ ఇద్దరూ వెంబడిస్తూనే ఉంటారు. బయో వైరస్ టెంపరేచర్ పెరగ కుండా చూడాలని గోవింద రాజు విగ్రహాన్ని ఓ ఊరి చివర శ్మశానం దగ్గర గోతిలో కప్పెడతాడు. అక్కడే ఇసుక స్మగ్లర్స్ తో గొడవపడతాడు గోవింద్. ఈలోగా ఇసుక స్మగ్లర్ బండారాన్ని బయట పెట్టే నిమిత్తమై '''పుణ్యకోటి''' ( కమల హాసన్ – 8 ) అనే అతను వస్తాడు. వాళ్ళని తప్పించుకొని వెళుతూ ఓ వాన్ యాక్సిడెంట్ లో పొడుగాటి '''కరీముల్లా''' ( కమల్ హాసన్ - 9 ) అనే ముస్లిం కుటుంబాన్ని కలుస్తాడు. గాయపడ్డ కరీముల్లా తల్లిని ఆసుపత్రిలో చేర్చే సమయంలో కేన్సర్ వ్యాధితో ఉన్న '''అవతార్ సింగ్''' ( కమల్ హాసన్ – 10 ) అతని భార్య ( [[జయప్రద]] ) నీ కలుస్తాడు. ఇలా అనేక పాత్రలన్నీ ఒక దాని వెంబడి ఒకటి వస్తాయి. గోవింద్ బయో వైరస్ ని ఎలా రక్షించాడు? ఫ్లెచర్ నుండి ఎలా తప్పించుకున్నాడు ? జపనీస్ ఫైటర్ పగ తీరిందా? బలరాం నాడార్ గోవిందుని టెర్రరిస్ట్ గా పట్టుకున్నాడా? పుణ్యకోటీ, ఇసుక స్మగ్లర్ల గొడవ తీరిందా? కేన్సర్ వ్యాధి గురైన అవతార్ సింగ్ కీ ఈ కథకీ సంబంధం ఏమిటి? ఏభై ఏళ్ళ క్రితం చనిపోయిన బామ్మ కొడుకు పోయిన సంగతి తెలుసుకుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబు మిగతా కథ! <ref name=navatarangam>నవతరంగం వెబ్సైట్ నుండి[http://navatarangam.com/?p=497 దశావతారం సినిమా గురించి] [[జూన్ 16]], [[2008]]న సేకరించబడినది.</ref>
"https://te.wikipedia.org/wiki/దశావతారం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు