ఆడం స్మిత్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినాడు → చేసాడు, చినాడు → చాడు (11) using AWB
→‎జీవనం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , → using AWB
పంక్తి 25:
15 సంవత్సరాల వయస్సులో ఆడంస్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చేరి నైతిక తత్వశాస్త్రం అభ్యసించాడు. ఇక్కడ ఉన్నప్పుడు స్మిత్ స్వేచ్ఛావాదం, తర్కం ప్రసంగాలలో నైపుణ్యం సంపాదించాడు. [[1740]]లో స్మెల్ ఎగ్జిబిషన్ అవార్డు పొందినాడు. ఆ తర్వాత ఆక్స్‌పర్డ్ లోని బాలియోల్ కళాశాలలో చేరినాడు. కాని బ్రిటన్ విశ్వవిద్యాలయాలు అతనికి నచ్చలేవు. వెల్ట్ ఆప్ నేషన్ ఐదో భాగంలో స్మిత్ ఇదే విషయాన్ని చెబుతూ స్కాట్లాండ్ లో పోలిస్తే ఆక్స్‌పర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో శిక్షణ నాణ్యత అంతగా లేదని వివరించాడు.
== జీవనం ==
[[1748]]లో స్మిత్ ఎడంన్‌బర్గ్ లో ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించాడు. [[1750]] ప్రాంతంలో ప్రముఖ తత్వవేత్త [[డేవిడ్ హ్యూమ్]] ను కలుసుకున్నాడు. అప్పటి నుంచి వారిరువురి మధ్య గాఢస్నేహం కొనసాగింది. ఈ స్నేహం స్మిత్ ఆర్థిక సిద్ధాంతాల అభివృద్ధికి కూడా దోహదపడింది. [[1751]]లో స్మిత్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తర్క పీఠాన్ని అధిష్టించాడు. [[1752]]లో ఒకప్పుడు అతని గురువైన ప్రాన్సిస్ హచిసన్ అధిష్టించిన నైతిక తర్కశాస్త్రం పీఠాన్ని ఆక్రమించాడు. ఆ స్థానంలో తర్కం నుంచి రాజకీయ అర్థశాస్త్రం వరకు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. [[1762]]లో గ్లాస్గో విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఆప్ లా (LL.D) ప్రధానం చేసింది. [[1773]]లో విశ్వవిద్యాలయాన్న్ని వదలి హెన్రీ స్కాట్‌కు ట్యూటర్‌గా పనిచేశాడు.అతని వెంబడి 18 మాసాలు [[ఫ్రాన్సు]], [[స్విట్జర్లాండ్]] బయలుదేరాడు. ఆ సమయంలోనే ఫిజియోక్రటిక్ స్కూల్ కు చెందిన అర్థశాస్త్ర మేధావులను కలిసే అవకాశం లభించింది. ఫ్రాన్సుకు చెందిన [[ఫ్రాంకోయిస్ కేనే]], [[జాక్వెస్ టర్గెట్]] ల ప్రభావం అతనిపై పడింది. స్వస్థలం కిర్‌కాల్డి వచ్చిన పిదప లండన్ రాయల్ సొసైటీలో యొక్క ఫెలో గాఫెలోగా ఎన్నికయ్యాడు. [[1776]]లో ప్రముఖ రచన వెల్త్ ఆప్ ది నేషన్స్ రచించాడు. [[1778]]లో స్మిత్ స్కాట్లాండ్‌లో కస్టమ్స్ కమీషనర్‌గా నియమించబడ్డాడు. [[1783]]లో ఎడింబర్గ్ రాయల్ సొసైటీ సంస్థాపక సభ్యులలో ఒకడిగా అవతరించాడు. [[1787]] నుంచి [[1789]] వరకు గ్లాస్గో విశ్వవిద్యాలయపు రెక్టార్‌గా కొనసాగినాడు. [[1790]], [[జూలై 17]]న స్మిత్ మరణించాడు.
== వెల్త్ ఆప్ నేషన్స్ ==
[[File:Smith - Inquiry into the nature and causes of the wealth of nations, 1922 - 5231847.tif|thumb|''Inquiry into the nature and causes of the wealth of nations'', 1922]]
"https://te.wikipedia.org/wiki/ఆడం_స్మిత్" నుండి వెలికితీశారు