అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని (6), గా → గా , తో → తో , పరిక్ష → పరీక్ష, స్ using AWB
చి →‎ప్రవేశిక: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), → (2) using AWB
పంక్తి 25:
ఈమె [[:en:Home Rule Movement|స్వయం పాలన ఉద్యమం]] స్థాపించినది.
 
తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా.విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు.1867 డిసెంబరులో తన తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ వివాహమాడెను. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహముతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని ''నేషనల్ సెక్యులర్ సొసైటీ ''అనే సంస్థలో చేరింది. ''లా అండ్ రిపబ్లిక్ లీగ్ ''ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. భారతదేశంలోని ''దివ్యజ్ఞాన సమాజం" ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చింది. ''మే యూనియన్ ''ని స్థాపించి కార్మికులకోసం పోరాడింది.1898 జులై 7న బనారస్ లోని ఒక చిన్న ఇంట్లో తాను కలలుగన్న విద్యాసౌధాన్ని ప్రారంభించి, దానిని అలహాబాదు విశ్వవిద్యాలయపు సంస్థగా పేర్కొనినది. బాలగంగాధర తిలక్ 1895 లో ప్రస్తావించిన "స్వయంపాలన" ను 1914 లో అనీ బిసెంట్ కార్యరూపంలో పెట్టేందుకు ప్రజల్ని సంసిద్ధులను చేయసాగింది. దీనికి సంబంధించిన ''కామన్ వెల్త్ ''అనే వార పత్రికను ఆమె ప్రారంభించినది.1915 లో ఈమె ''హౌ ఇండియా ఫాట్ ఫర్ ఫ్రీడం''అనే పుస్తకాన్ని వ్రాసింది. భారతదేశ స్వాతంత్ర్యమును గురించి వివరించినది.
 
ఈమె రచించిన ''లెక్చర్ ఆన్ పొలిటికల్ సైన్స్'' పుస్తకంలో పాశ్చాత్య, భారతీయ రాజకీయ వ్యవస్థల గురించి పరిష్కృతం కాగలిగే సూచనలను ఇచ్చినది. 1917లో అనీ బిసెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబడింది. ఎన్నోరకాల ప్రాతిపదికలతో జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించించినది. ''న్యూ ఇండియా''అనే దినపత్రిక ఈమెదే. ''ఇండియన్ బాయ్స్ స్కౌట్ అసోషియేషన్'' ను స్థాపించినది. ఈమెకు 1921లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం ''డాక్టర్ ఆఫ్ లెటర్స్'' బిరుదునిచ్చి సత్కరించినది. 80సంవత్సరాల వయసులో ''బుడాపెస్ట్ యూరోపియన్ కాంగ్రెస్, చికాగో ప్రపంచ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించినది.1933 సెప్టెంబర్ 20న ఆమె తుదిశ్వాస విడిచినది.
 
== ఆరంభకాల జీవితం ==
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు