ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, బుద్ది → బుద్ధి, → using AWB
పంక్తి 18:
'''ఆ నలుగురు''' అనేది [[2004]]లో వచ్చిన ఓ [[తెలుగు సినిమా]]. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన [[నంది ఉత్తమ చిత్రం]] ఇది.
==కథ==
పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం (రాజేంద్ర ప్రసాద్), అనే పత్రికా సంపాదకుడి కథ ఇది. రఘురాం చనిపోయిన తరువాత అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమ కింకరులు (చలపతి రావు, రఘు బాబు) రావడంతో కథ ప్రారంభమవుతుంది. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్దిబుద్ధి చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు. ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పంక్తి 28:
సినిమాలో కథానాయకుడు రఘురాం పాత్ర వయసుమళ్ళిన పత్రికాసంపాదకుని పాత్ర. భావోద్వేగాలు బాగా పండించాల్సిన పాత్ర కావడంతో మొదట సినిమా తీద్దామనుకున్న [[అట్లూరి పూర్ణచంద్రరావు]] దర్శక నటులు [[విసు (నటుడు)|విసు]], [[దాసరి నారాయణరావు]], నటుడు [[మోహన్‌ బాబు]]లలో ఎవరో ఒకరితో ఆ పాత్ర చేయించాలని భావించారు. వీరెవరితోనూ కుదరకుంటే [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత [[భాగ్యరాజ్|కె.భాగ్యరాజా]]కు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తాను కథానాయక పాత్ర పోషిస్తానని పట్టుపట్టినందు వల్లనే చేజారింది.
 
తర్వాత సినిమాని చేపట్టిన దర్వకుడు చంద్రసిద్ధార్థ్, మదన్ కథానాయకుని పాత్రకు [[రాజేంద్ర ప్రసాద్]]ని జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా సంప్రదించారు. రాజేంద్రప్రసాద్ ఇంటి బెడ్రూంలో మదన్ దర్శకుడికి, రాజేంద్రప్రసాద్ కీ కథ వినిపించారు. కథ పూర్తికాగానే ఒకరు బాత్రూంలోకి, మరొకరు బాల్కనీలోకి వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయిన కథారచయిత మదన్ ఇక ఈ అవకాశమూ చేజారిపోయినట్టే అని నిరుత్సాహపడే దశలో రాజేంద్రప్రసాద్ కళ్ళుతుడుచుకుని వచ్చి ఈ సినిమా వెనువెంటనే ప్రారంభించాలని తన నిర్ణయం చెప్పేశారు. తర్వాత రాజేంద్రప్రసాద్ తన పాత్ర ప్రవర్తించే తీరు, సంభాషణలు చెప్పే విధానం, కళ్ళజోడు, పంచెకట్టు, విగ్గు ఇలా అన్నీ ఎలావుండాలో ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు.
 
రాజేంద్రప్రసాద్ పక్కన కథానాయిక పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[భానుప్రియ]], [[రోజా సెల్వమణి|రోజా]] మొదలైన గతతరం కథానాయికలకు కథ వినిపించారు. అందరూ కథ చాలాబావుందని మెచ్చుకున్నవారే కానీ ఎవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. రాజేంద్రప్రసాద్ తనతో [[మిస్టర్ పెళ్ళాం]] సినిమాలో నటించిన [[ఆమని]]ని గుర్తుచేసుకుని, ఆమెను సంప్రదించమని సలహాఇచ్చారు. కథ విని సినిమాకు ఆమని ఓకే చెప్పారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
 
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్హైదరాబాదు పరిసరాల్లోనే జరిగింది. [[రామకృష్ణ స్టూడియో]], [[రామానాయుడు స్టూడియో]], రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది. 38 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తైంది. సినిమా దాదాపుగా కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్లో అయింది.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" /> ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర వ్యవహరించారు. సురేందర్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేశారు.<ref name="టైటిల్స్">ఆ నలుగురు సినిమా టైటిల్స్</ref>
 
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు